KCR : కూతురిని అరెస్ట్ చేయించినా బీజేపీపై కేసీఆర్ కు ఎందుకు కోపం లేదు?

మూడోసారి అధికారం చేపట్టినప్పటికీ మోడీ పాలనలో ఇంతవరకు ఎలాంటి ఏ మార్క్ కనిపించలేదు. అంతకుముందు కూడా తెలంగాణ రాష్ట్రానికి పెద్దగా ఒరగబెట్టింది లేదు. ఎంతసేపూ రెచ్చగొట్టే రాజకీయాలు.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తప్పితే పెద్దగా చేసిందేం లేదు. మొన్నటి ఎన్నికల వేళ కూడా అటువంటి సంప్రదాయమే కనిపించింది. అటు బీఆర్ఎస్ నేతలు కూడా అదే కార్నర్ చేశారు.

Written By: Srinivas, Updated On : September 24, 2024 5:58 pm

KCR-BJP

Follow us on

KCR : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయగా.. 153 రోజుల పాటు ఆమె జైలులోనే ఉండిపోయారు. అయితే.. ఇటీవలే ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కవిత విడుదలై కూడా నెల రోజులు కావస్తోంది. కానీ.. ఇంతవరకు ఈ విషయంపై ఆమె తండ్రి కేసీఆర్ మాత్రం నోరుమెదపడం లేదు. ఇటు కవిత కూడా త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి వస్తానని.. తనను మరింత మొండి దానిని చేశారని.. ఎవరినీ వదలబోనని హెచ్చరించారు. కానీ.. ఇప్పటివరకు ఆమె ఎక్కడా కనిపించలేదు.

కవిత జైలు నుంచి విడుదలయ్యాక కేసీఆర్ బయటకు వస్తారని అందరూ భావించారు. కవిత కోసమే ఆయన ఫామ్ హౌజ్‌కు పరిమితం అయ్యారనే టాక్ నడిచింది. బయటకు వచ్చి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధిస్తారని బీఆర్ఎస్ నేతలు చెప్పుకొచ్చారు. కానీ.. ఇంతవరకు కూడా ఆయన ఫామ్ హౌజ్ దాటలేదు. ఇంతవరకు ఒక ప్రెస్‌మీట్ పెట్టిన దాఖలాలు కూడా లేవు. ఎక్కడా కవితను అరెస్టును ఖండించింది లేదు. ఇప్పటికీ ఇంకా కేసీఆర్ రాకకోసం ఆ పార్టీ నేతలు ఆశతో ఎదురుచూస్తూనే ఉన్నారు.

అటు కేంద్రంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించి వంద రోజులైంది. మోడీ ప్రధానిగా మూడో సారి బాధ్యతలు చేపట్టారు. అయితే.. మూడోసారి అధికారం చేపట్టినప్పటికీ మోడీ పాలనలో ఇంతవరకు ఎలాంటి ఏ మార్క్ కనిపించలేదు. అంతకుముందు కూడా తెలంగాణ రాష్ట్రానికి పెద్దగా ఒరగబెట్టింది లేదు. ఎంతసేపూ రెచ్చగొట్టే రాజకీయాలు.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తప్పితే పెద్దగా చేసిందేం లేదు. మొన్నటి ఎన్నికల వేళ కూడా అటువంటి సంప్రదాయమే కనిపించింది. అటు బీఆర్ఎస్ నేతలు కూడా అదే కార్నర్ చేశారు.

అయితే.. కవిత అరెస్టు నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా పార్టీని దెబ్బతీసేందుకే బీజేపీ ఇలాంటి కుట్రకు దారితీసిందని కేసీఆర్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే.. ఎప్పుడైతే ఆయన రాష్ట్రంలో అధికారం కోల్పోయారో అప్పటి నుంచి సైలెంట్ అయిపోయారు. కేంద్రంలో అధికారంలో ఉండడం.. కేసులతో లోపలేస్తారని.. అధికారంలో లేకపోవడంతో బీజేపీకి ఎదురు వెళ్లలేకపోతున్నాడు సైలెంట్ గా ఉంటున్నాడు. టైం వచ్చినప్పుడు బీజేపీని చావుదెబ్బ తీయడానికి కేసీఆర్ వెనుకాడరు. కవితను అరెస్ట్ చేసినా.. కేంద్రంలో విఫలమవుతున్నా బీజేపీపై కేసీఆర్‌కు ఎందుకు కోపం రావడం లేదనేది అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. ఇప్పటికైనా పెద్దాయన మేల్కొని ప్రజల్లోకి వస్తారని బీఆర్ఎస్ నేతలు ఆశిస్తున్నారు.