CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తరువాత రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాడు. తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీల పథకాలు అమలు చేస్తామని ఇచ్చిన హామీలను ఒక్కోక్కటి అమలు చేస్తున్నారు. అలాగే పెండింగులో ఉన్న సమస్యలను పరిష్కారం చేసే దిశగా ముందుకు వెళ్తున్నాడు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి పెద్దగా ఆడంబరాలకు పోకుండా సింప్లిసిటీ మెయింటేన్ చేస్తున్నారు. కొన్ని అధికారిక కార్యక్రమాలకు ఎక్కువగా ఖర్చు చేయకుండా డబ్బులు పొదుపు చేయాలని అనుకున్నాడు. అయితే ఇటీవల రేవంత్ రెడ్డి తన ఇంట్లో వంట మనిషికి వార్నింగ్ ఇచ్చాడట? అలా వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే?
అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి తన అధికార నివాస భవనంగా హెచ్ఎంఆర్డీ భవనాన్ని ఎంచుకున్నారు. అంతకుముందు సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ప్రగతి భవన్ ను నిర్మించిన విషయం తెలిసిందే. హంగు, ఆర్బాటాలతో నిర్మించిన ఈ భవనంను డిప్యటీ సీఎం భట్టి విక్రమార్కకు కేటాయించారు. అలాగే దీనిని ప్రజా భవన్ గా మార్చి వారంలో రెండు సార్లు దర్భార్ ను ఏర్పాటు చేశారు. ఇక రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కాన్వాయ్ ను ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టడడం లేదు. తన కారుకే బుల్లెట్ ఫ్రూవ్ సెట్ చేయాలని చెప్పారు. అంతేకాకుండా కాన్వాయ్ ని సగం వరకు తగ్గించాలని చెప్పారు.
సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారిక కార్యక్రమాలన్నీ ప్రగతి భవన్ నుంచే నిర్వహించారు. ఈ భవనంలో ప్రత్యేకంగా వంట మనుషులు ఉండేవారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక భోజనం అక్కడి నుంచే వచ్చింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తన వంట మనిషిపై సీరియస్ అయ్యారు. తనకు ఇంటి భోజనం తీసుకురావాలని ప్రగతి భవన్ నుంచి వస్తుంటే మీరేం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే మరోసారి ఇలా జరిగితే పనిలో నుంచి తీసేస్తానని వార్నింగ్ ఇచ్చాడట. ఈ విషయం బయటకు రావడంతో ప్రజలంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
ప్రస్తుతం రేవంత్ రెడ్డి కొన్ని పనుల నిమిత్తం ఢిల్లీకి వెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల పథకాల్లో ఇప్పటికే రెండు అమలు చేశారు. జనవరిలో గ్యాస్ సిలిండర్ రూ.500లకే ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరుణంలో అధిష్టానం వద్ద దీనిపై చర్చించేందుకు వెళ్లినట్లు సమాచారం. ఇదిలా ఉండగా రేవంత్ రెడ్డి ఇలా ఖర్చుల విషయంలో పొదుపు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.