Congress Cabinet: తెలంగాణలో కొత్త ప్రభుత్వం రెండు రోజుల క్రితం కొలువుదిరింది. సీఎం గారు రేవంత్ రెడ్డి మరో పదకొండు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన సాయంత్రమే శాఖల కేటాయింపు జరుగుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం శాఖల కేటాయింపునకు రెండు రోజుల సమయం తీసుకుంది. శనివారం ఉదయం పంతులకు శాఖలకు కేటాయించారు.
పెండింగ్ లో హోం శాఖ..
మంత్రులకు శాఖలు ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం హోంశాఖను హోల్డ్ లో పెట్టింది. అత్యధిక ప్రాధాన్యం కలిగిన ఈ శాఖను ఎవరికీ కేటాయించలేదు. ప్రస్తుతం ఉన్న 1100 ఈ శాఖను నిర్వహించే సమర్థులు లేరా అన్న చర్చ జరుగుతుంది. ఉత్తంకుమార్ రెడ్డికి హోంశాఖ ఇస్తారని మొదట ప్రచారం జరిగింది. కానీ ఎవరికి కేటాయించకుండానే హోల్డ్ లో పెట్టారు.
సీఎం వద్దనే ఉంచుకుంటారా?
హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన వద్దే ఉంచుకోనున్నట్లు చర్చ జరుగుతోంది. చెంద కీలకమైన శాఖ తన వద్ద ఉంచుకోవడం ద్వారా పోలీస్ వ్యవస్థను కంట్రోల్లో పెట్టుకోవచ్చని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే ప్రస్తుత మీ శాఖను ఎవరికి కేటాయించలేదని అంటున్నారు. మరి కొంతమంది కొత్తగా ప్రమాణస్వీకారం చేసే ఆరుగురు మంత్రులు ఒకరికి కేటాయిస్తారని పేర్కొంటున్నారు.
కేటాయించిన శాఖలు..
హోం శాఖ తో పాటు పళ్ళ కీలక శాఖలు కూడా ఇంకా ఎవరికీ కేటాయించలేదు. విద్య, పశుసంవర్ధక, కార్మిక, మున్సిపల్, అర్బన్ డెవలప్మెంట్, సాధారణ పరిపాలన శాఖలను కూడా హోల్డ్లో పెట్టారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత మిగతా వారికి ఈ శాఖలను కేటాయించనున్నట్లు తెలుస్తోంది.