https://oktelugu.com/

Congress party Poll: సోషల్ మీడియాలో వీకైనప్పుడు.. పోల్ ఎందుకు? బాట్స్ ఎందుకు?

కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో వీక్. ఇది కొంతమందికి బాధ కలిగించవచ్చు గాని.. కేసీఆర్ పరిపాలన, రేవంత్ పరిపాలనపై ఆ పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో నిర్వహించిన పోల్ ద్వారా మరోసారి బయటపడింది. ఎన్నికల ముందు కాస్త హడావిడి చేసింది గాని.. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకొని.. భారత రాష్ట్ర సమితి చేస్తున్న సోషల్ యుద్ధాన్ని నెటిజన్లే నిలువరించగలిగారు.

Written By: , Updated On : January 31, 2025 / 11:21 AM IST
Telangana Congress Party

Telangana Congress Party

Follow us on

Congress party Poll : ట్విట్టర్ ఎక్స్ లో ఎవరి పరిపాలన బాగుంది అని కాంగ్రెస్ పార్టీ పోల్ నిర్వహించింది. కానీ ఇక్కడే ఆ పార్టీ ఐటీ సెల్ భారత రాష్ట్ర సమితిని తక్కువ అంచనా వేసింది. తాము నిర్వహించిన పోల్ లో తమ పార్టీ సానుభూతిపరులు మాత్రమే ఓటు వేస్తారని కాంగ్రెస్ పార్టీ భావించింది. చివరికి ఆ పోల్ ఒకటి నిర్వహించామనే సోయిని కూడా కాంగ్రెస్ పార్టీ మర్చిపోయింది.. దీంతో గులాబీ సోషల్ మీడియా రెచ్చిపోయింది. ఇంకేముంది ఆ పోల్ ముగియడానికి ముందు 50 వేల ఓట్లను డంప్ చేసింది. ఇది సక్రమమా? అక్రమమా? అనే ప్రశ్నలు పక్కన పెడితే… కాంగ్రెస్ పార్టీ తెలివి తక్కువ తనాన్ని గులాబీ సోషల్ మీడియా త్వరగానే గుర్తించి.. చుక్కలు చూపించడం మొదలుపెట్టింది. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగానికి కక్కలేని మింగలేని పరిస్థితిని తీసుకొచ్చింది.. అంతేకాదు ఈ పోల్ ను స్క్రీన్ షాట్లు తీసి కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా డిఫెన్స్ మూడ్ లో పడింది. కాంగ్రెస్ పార్టీ తిరిగి కౌంటర్ మొదలుపెట్టింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది..” అమెరికాతోపాటు విదేశాల నుంచి నకిలీ ఖాతాల ద్వారా ఓట్లు వేయించారు. బాట్స్ ద్వారా ఈ ఓట్లను ఆపరేట్ చేయించారు.. అందువల్లే ఇలా జబ్బలు చరుచుకుంటున్నారని” కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎదురుదాడి మొదలుపెట్టారు..” గులాబి సోషల్ మీడియా ఉపయోగించే బాట్స్ ను బయటి ప్రపంచానికి తెలియజేయడానికే మేము ఈ పోల్ పెట్టాం. దానిని ఈ విధంగా బయటపెట్టామని” కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

ఎలా తెలుస్తుంది

కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాను పెద్దగా హ్యాండిల్ చేయలేకపోతోంది. అధికారంలో ఉన్నప్పటికీ గులాబీ సోషల్ మీడియా విభాగానికి మించి ఎదగలేక పోతోంది. అన్ని విషయాలను ఆ పార్టీ సోషల్ మీడియా విఫల ప్రదర్శన చేస్తోంది. ఒకానొక దశలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనా, భారత రాష్ట్ర సమితినా.. అనేది అంతుపట్టడం లేదంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాను బలోపేతం చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతోంది. వాస్తవానికి ట్విట్టర్ వాడే వారు మన సమాజంలో చాలా తక్కువ మంది ఉంటారు. వారికి ఈ పోల్స్, బాట్స్ గురించి పెద్దగా తెలియదు.. అలాంటివారు కేవలం రిజల్ట్ మాత్రమే చూస్తారు. ఇప్పుడు ఆ రిజల్ట్ ను భారత రాష్ట్ర సమితి విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. ఒకవేళ భారత రాష్ట్ర సమితి ఇలా చేస్తుందని కాంగ్రెస్ పార్టీకి ఒక అవగాహన ఉన్నప్పుడు.. కచ్చితంగా కౌంటర్ బాట్స్ కూడా మాట్లాడుకోవాల్సింది. కానీ ఆ పని చేయలేక భారత రాష్ట్ర సమితి ముందు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం తలవంచింది.. అయితే ఇప్పుడేమో కొత్తగా మీ తొండి ఆటను బయటపెట్టామని చెబుతోంది. ఇలాంటి వాదనలు.. బయటికి ఎన్ని ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం చాలా నేర్చుకోవాలి. గులాబీ పార్టీ కి దిమ్మ తిరిగిపోయే స్థాయిలో కౌంటర్ ఇవ్వాలి. లేకపోతే ప్రతిరోజు ఇలా బాధిత పక్షం కావాల్సి ఉంటుంది. ప్రభుత్వ పరంగా అమలు చేస్తున్న పథకాలపై కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం గొప్పగా ప్రచారం చేయడం లేదు. భారత రాష్ట్ర సమితి చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వడం లేదు. ఏదో నాలుగు పోస్టులు.. మూడు ట్వీట్లు.. రెండు పేపర్ కటింగ్ లు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం పరిస్థితి ఉంది. మరి ఇప్పటికైనా ఈ పరాభావాల నుంచి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం పాఠాలు నేర్చుకుంటుందో.. ఒక వేచి చూడాల్సి ఉంది.