Jubilee Hills By-Election: తెలంగాణలో ( Telangana) జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ అన్నట్టు పరిస్థితి ఉంది. బిజెపి పోటీ చేస్తున్నా ఆ స్థాయిలో ప్రచారం చేయడం లేదు. ఆ రెండు పార్టీలకు ధీటుగా ముందుకు వెళ్లడం లేదు. ఎన్డిఏ భాగస్వామ్య పక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ మద్దతు కోరడం లేదు. ఏపీలో మరో భాగస్వామ్య పార్టీ అయినా జనసేన మద్దతు తీసుకుందే తప్ప.. టిడిపి అవసరం, సాయం కోరలేదు బిజెపి. దీని వెనుక వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. టిడిపి సాయం తీసుకుంటే బీజేపీపై సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించే అవకాశం ఉంది తెలంగాణలో. అందుకే 2023 తెలంగాణ అసెంబ్లీ, 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జోలికి వెళ్లలేదు బిజెపి. ఇటువంటి తరుణంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతు ఎవరికి అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
మాగుంట ఫ్యామిలీతో..
కాంగ్రెస్ పార్టీ సీఎం గా ఉన్నారు రేవంత్ రెడ్డి( Revanth Reddy ). 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సీఎం అయ్యారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ తటస్థ వైఖరి అనుసరించింది. ఆ ఎన్నికల్లో పూర్తిగా పోటీ చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి టిడిపి తో ఉన్న అనుబంధం దృష్ట్యా ఆ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపాయి అన్నది విశ్లేషణలు ఉన్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి కొనసాగింది. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగుతుండడంతో అదే పరిస్థితి ఉంటుందా? అంటే మాత్రం సమాధానం దొరకని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ పోటీ చేస్తోంది మాగుంట సునీత. ఆమె దివంగత మాజీ ఎమ్మెల్యే గాంధీ భార్య. గాంధీ కరుడుగట్టిన టిడిపి వాది. తప్పనిసరి పరిస్థితుల్లో గులాబీ పార్టీలో చేరాల్సి వచ్చింది. అయినా సరే చంద్రబాబుతో తన సన్నిహిత్యాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అయితే మిత్రపక్షంగా ఉన్న బిజెపి మద్దతు కొరకపోవడంతో.. ఇప్పుడు టిడిపి ఎదుట ఉన్న పార్టీలు కాంగ్రెస్, బిఆర్ఎస్ మాత్రమే.
ఇన్ని పరిణామాల నడుమ..
జూబ్లీహిల్స్( Jubilee Hills) ఎన్నికలు అనగానే నారా లోకేష్ ను కలిశారు కేటీఆర్. ఇలా చెప్పింది కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అయితే తనను కేటీఆర్ కలిస్తే తప్పేంటి అని నారా లోకేష్ ప్రశ్నించారు. అయితే ఇప్పుడు ఎన్నికలు జరుగుతుండడంతో వీటి పైనే విశ్లేషణ జరుగుతోంది. రేవంత్ ని చూస్తే కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలి. బిఆర్ఎస్ అభ్యర్థి మా గుంట సునీత ఉండడంతో అటువైపు మొగ్గు చూపాలి. అయితే ఏపీలో సీఎం చంద్రబాబుతో పాటు లోకేష్ విషయంలో సానుకూలంగా ఉన్నారు కేటీఆర్. కెసిఆర్ మాదిరిగా వ్యవహరించడం లేదు. చంద్రబాబుతో పాటు లోకేష్ సైతం మునుపటి మాదిరిగా గులాబీ పార్టీపై వ్యతిరేకంగానూ లేరు. ఒకవైపు బిజెపి తన భాగస్వామ్య పక్షమైన టిడిపి మద్దతు కోరడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అటు కాంగ్రెస్ గెలిచినా.. అదే సమయంలో టిఆర్ఎస్ గెలిచినా.. క్రెడిట్ మాత్రం టిడిపికే.