Rohith Reddy Drugs Case: తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో నిన్న ఎస్ఓటి పోలీసులు దాడులు చేశారు. రెండు గ్రాముల మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఇంకా కొంతమంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో రోహిత్ రెడ్డికి డ్ర*గ్స్ పాజిటివ్గా వచ్చింది. ఇందులో ఏపీ రాష్ట్రానికి సంబంధించిన ఒక పార్లమెంట్ సభ్యుడు కూడా ఉన్నారు. ఈ వ్యవహారం కాస్త రెండు రాష్ట్రాలలో సంచలనంగా మారింది.
Also Read: రాజ్యసభ పదవులకు పోటీ.. తెరపైకి కొత్త లెక్కలు!
రోహిత్ రెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో అత్యంత రహస్యంగా నిర్వహిస్తున్న ఈ పార్టీ గురించి పోలీసులకు ఎలా తెలిసింది? పైగా ఆ పార్టీలో అందరూ హై ప్రొఫైల్ వ్యక్తులు ఉన్నారు. ఎవరు కూడా తమ ఫోన్ లను వెంట ఉంచుకోలేదు. ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా అత్యంత జాగ్రత్తగా నిర్వహించారు. కనీసం సమాచారం బయటకు వెళ్లకుండా చూసుకున్నారు. కానీ, ఒక్కసారిగా ఈ వ్యవహారం మొత్తం బయటపడడంతో అసలు ఇదంతా పోలీసులకు ఎలా తెలిసింది? పోలీసులు ఎలా ఈ వ్యవహారాన్ని బయటపెట్టారు? అనే ప్రశ్నలు అందరిలోని వ్యక్తమవుతున్నాయి.
మాదకద్రవ్యాల వ్యవహారానికి సంబంధించి ఒక ప్రముఖ నటి సోదరుడు సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. గతంలో అతడు మాదక ద్రవ్యాల వ్యవహారంలో దొరికిపోయాడు. పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈడి మెట్లు కూడా ఎక్కాడు. పెద్ద పెద్ద సెలబ్రిటీలకు మాదక ద్రవ్యాలు సరఫరా చేసి అతడు భారీగా సంపాదించాడు. ఈడి నాడు విచారణ జరిపినప్పుడు అతడి ఖాతాలలో జరిగిన లావాదేవీలను భారీగా గుర్తించింది. ఇటీవల మణికొండ ప్రాంతంలో డ్ర*గ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. ఆ కేసు లో పోలీసులు కీలకమైన ఆధారాలు సేకరించారు. దీంతో అతడు పరారీ అయ్యాడు. అనంతరం ఈగల్ టీం అతడిని పట్టుకుంది. అనంతరం విచారించింది. అతడు చెప్పిన వివరాలను అత్యంత జాగ్రత్తగా సేకరించింది ఈగల్ టీం.
ఆ నటి సోదరుడు చెప్పిన వివరాలు ఆధారంగా పోలీసులు అత్యంత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అనేక మాదకద్రవ్యాల వ్యవహారాలను రట్టు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో జరిగిన పార్టీ వివరాలు కూడా ఆ వ్యక్తి చెప్పినవేనని.. అందువల్లే పోలీసులు అత్యంత పకడ్బందీగా దాడులు చేయగలిగారని .. రోహిత్ రెడ్డి, ఇంకా కొంతమంది వ్యక్తులను పట్టుకో గలిగారని తెలుస్తోంది. అయితే ఇంకా కొంతమంది వ్యక్తులు కూడా మాదక ద్రవ్యాలతో పార్టీలు నిర్వహిస్తున్నారని.. వారి గురించి కూడా ఆ నటి సోదరుడు చెప్పాడని తెలుస్తోంది. పోలీసులు వారిపై కూడా నిఘా పెట్టారని.. త్వరలోనే వారి పని కూడా పడతారని ప్రచారం జరుగుతుంది.