Kaleshwaram : కాళేశ్వరంను సీఎం రేవంత్ రెడ్డి ఏం చేయనున్నాడు?

అందుకే కాళేశ్వరం ప్రాజెక్టుకు అత్యంత కీలకమైన మేడిగడ్డ,అన్నారం బ్యారేజ్ లకు ప్రత్యామ్నాయ డామ్ల నిర్మాణంపై కూడా ఫోకస్ పెట్టాలని అధికారులకు ఆయన సూచించారనే చర్చ సచివాలయ వర్గాలో వినిపిస్తోంది.

Written By: NARESH, Updated On : May 19, 2024 1:09 pm

Kaleshwaram

Follow us on

Kaleshwaram : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై మొదటి నుంచి సీరియస్ గానే ఉన్నారు. కాళేశ్వరానికి మెయిన్ పిల్లర్లుగా ఉన్న అన్నారం, సుందిళ్ల,మేడిగడ్డ బ్యాలెన్స్ సింగ్ రిజర్వాయర్లు దెబ్బతినడంతో వాటికి మరమ్మత్తులు చేయాలా..? లేక ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలా ..? అనే అంశంపై ఫస్ట్ నుంచి గట్టిగానే నజర్ పెట్టారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వాహణ దానికి అయ్యే విద్యుత్ ఖర్చులపైనే ఫస్ట్ క్యాబినేట్ సెషన్ కొనసాగించారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఏదో ఒకటి కీలక నిర్ణయం తీసుకుంటారనే చర్చ మొదటి నుంచి ఉంది.

ఈ నేపథ్యంలోనే శనివారం రాష్ట్ర సచివాలయంలో మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, ఉన్నతాధికారులతో కాలేశ్వరం ప్రాజెక్టుపై మరో మారు రేవంత్ చర్చించడం ఆసక్తికరంగా మారింది. మేడిగడ్డ,అన్నారం బ్యారేజీలకు మరమ్మత్తులు చేస్తే పనికోస్తాయా..? లేక కొత్త వాటినే నిర్మించితే బాగుంటుందా ..? వీటికి సంబంధించిన ఖర్చును ఎవరు భరించాలి..? ప్రభుత్వం హా..? లేక నిర్వాణ సంస్థ నుంచి వసూలు చేయాలా..? వంటి అంశాలపై ఆయన సచివాలయంలో సుదీర్ఘంగా ఉన్నతాధికారులతో చర్చించి ఒక అంచనాకు వచ్చేసినట్లే కనిపిస్తోంది.

ఈ సందర్భంగానే ఇరిగేషన్ అధికారులు పలు కీలక విషయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్ ల నిర్మాణంలోనే లోపాలు ఉన్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు రేవంత్ కు వివరించారు. ఈ బ్యారేజ్ ల కింద భారీ ఎత్తున బొగ్గు నిల్వలు నిక్షిప్తమై ఉన్నట్లు సీఎంకు తెలియజేశారు. ఆ బొగ్గు నిక్షేపాల పైన మేడిగడ్డ,అన్నారం బ్యారేజ్ లు నిర్మించడం వల్లే పునాదుల్లో పటిష్టత లోపించి అవి కుంగిపోతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవివరంగా వివరించడం జరిగింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నటికైనా ఈ డ్యాములకు ప్రత్యామ్నాయాలను చూసుకోవాల్సిందేనని అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది. ఒకవేళ ప్రస్తుతానికి ఈ డ్యాంలకు రిపేర్లు చేసి నీటిని ఎత్తిపోసినప్పటికీ.. సుదీర్ఘ కాలం పాటు మాత్రం వీటిపైన ఆధారపడలేమని ఆయన తేల్చేశారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టుకు అత్యంత కీలకమైన మేడిగడ్డ,అన్నారం బ్యారేజ్ లకు ప్రత్యామ్నాయ డామ్ల నిర్మాణంపై కూడా ఫోకస్ పెట్టాలని అధికారులకు ఆయన సూచించారనే చర్చ సచివాలయ వర్గాలో వినిపిస్తోంది.