HomeతెలంగాణDMK embarrassment: జాతీయ చానెల్ డిబేట్ లో ఈ కామెడీ ఏంట్రా బాబూ.. డీఎంకే పరువు...

DMK embarrassment: జాతీయ చానెల్ డిబేట్ లో ఈ కామెడీ ఏంట్రా బాబూ.. డీఎంకే పరువు పోయిందిగా..

DMK embarrassment: నిన్నంతా బడ్జెట్ గురించి చర్చ నడిచింది. జాతీయ చానల్స్ నుంచి మొదలు పెడితే ప్రాంతీయ చానల్స్ వరకు బడ్జెట్ గురించి రకరకాల వాదనలు ప్రసారమయ్యాయి. ఈ చర్చా వేదికలలో రాజకీయ నాయకుల నుంచి మొదలుపెడితే ఆర్థికవేత్తల వరకు పాల్గొన్నారు. ఎవరికివారు తమ విశ్లేషణలు చేశారు.

ఓ జాతీయ ఛానల్ లో బడ్జెట్ కు సంబంధించిన చర్చ సాగింది. అందులో పరాశక్తి సినిమాకి సంబంధించిన చర్చ బయటికి వచ్చింది. ఓ నాయకుడు పరాశక్తి సినిమా ద్వారా హిందీ భాషను తమ మీద ఎలా బలవంతంగా రుద్దారో వివరించారు. అయితే నాడు హిందీ భాషను బలవంతంగా రుద్దుతున్నప్పుడు అధికారంలో ఎవరు ఉన్నారని డిబేట్ నిర్వహిస్తున్న ప్రజెంటర్ ప్రశ్నించారు. దానికి ఆ నాయకుడు ఒకసారిగా సైలెంట్ అయిపోయారు. అలా మాట్లాడుతున్న ఆ వ్యక్తి డిఎంకె పార్టీకి చెందిన నాయకుడు. దీంతో జాతీయస్థాయిలో డీఎంకే పరువు పోయింది.

తమిళనాడులో డీఎంకే పార్టీ మొదటి నుంచి కూడా హిందీకి వ్యతిరేకంగా ఉంటుంది. హిందీ వ్యతిరేక ఉద్యమాలను నిర్వహించి.. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి డీఎంకే అనేకసార్లు అధికారంలోకి వచ్చిందని ఆరోపణలు ఉన్నాయి. తమిళనాడులో హిందీ మీడియం ను రద్దు చేయడం వెనక.. కుట్ర కూడా ఉందని అప్పట్లో విమర్శలు వినిపించాయి.

ఇప్పుడు త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో జాతీయస్థాయి చర్చా వేదికలో డీఎంకే పార్టీ పరువు పోవడం గమనార్హం. ఇటీవల కాలంలో ఏ ఛానల్ లో డిబేట్ నిర్వహించినప్పటికీ.. డీఎంకే పార్టీ నాయకులు తమ ప్రభుత్వ విధానాలను సమర్ధంగా చెప్పలేకపోతున్నారు. కొన్ని సందర్భాలలో ప్రత్యర్థి పార్టీల నాయకులు విసిరే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్నారు.

ఏ హిందీ నైతే బలవంతంగా రుద్దారని డిఎంకె పార్టీ నేతలు ఆరోపిస్తున్నారో.. నాడు కేంద్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీని ఉత్తర భారతదేశానికి చెందిన వ్యక్తులే నాడు నడిపిస్తున్నారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఇండియా కూటమిలో డీఎంకే ప్రధాన పార్టీగా ఉంది. ఇదే అంశాన్ని ఆ న్యూస్ ప్రెజెంటర్ లేవనెత్తితే డీఎంకే నాయకుడి వద్ద సమాధానం లేదు. వాస్తవానికి ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి.. అధికారాన్ని దక్కించుకునే నాయకులు ఏదో ఒక సందర్భంలో ఇలా ప్రజల ముందు తలవంచుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు డీఎంకే పార్టీ కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular