CP Sajjanar: న్యూ ఇయర్ వేడుకల కౌంట్ డౌన్ ప్రారంభమైంది. కొత్త వేడుకలకు చిన్న పెద్ద అంతా సిద్ధమవుతున్నారు. మరోవైపు వేడుకలు ప్రశాంతంగా జరుపుకునేలా పోలీసులు అప్రమత్తం అయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఉత్సవాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ సజ్జనార్, కొత్త సంవత్సర ఉత్సవాల సమయంలో ట్రాఫిక్ రూల్స్‌ు కచ్చితంగా పాటించాలని పౌరులకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు.
120 ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు..
డిసెంబర్ 31 రాత్రి నగరంలో 120 ముఖ్య ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్‌పాయింట్లు ఏర్పాటు చేస్తున్నామని సజ్జనార్ పేర్కొన్నారు. ఈ చర్యలు పండుగ వాతావరణంలో పెరిగే రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ఉద్దేశించినవి. ట్రాఫిక్ పోలీసులు అధిక సంఖ్యలో మోహరించి ఉంటారు.
నాడు అట్ల.. నేడు ఇట్ల..
ఇదిలా ఉంటే.. రేవంత్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డ్రంకెన్ డ్రైవ్‌పై అప్పటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇష్టానుసారం ధూషించారు. పిల్లగాండ్లు మందుతాగి పోతే.. డ్రంకెన్ డ్రైవ్ పేరుతో డబ్లు గుంచుతుండ్రు అని ఓ బహిరంగ సభలో డ్రంకెన్ డ్రైవ్ తీరుపై మండిపడ్డారు. కానీ ఇప్పుడు అధికారంలోకి రాగానే, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు. దీనిపై పాత వీడియోతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అప్పుడు అట్ల.. ఇప్పుడు ఇట్ల అని కామెంట్ చేస్తున్నారు.
మద్యం తాగి పట్టుబడితే భారీ జరిమానా, వాహనాల జప్తు, జైలు శిక్ష
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మందుబాబులకు హెచ్చరికలు జారీ చేసిన హైదరాబాద్ సీపీ సజ్జనార్
నగరంలోని 120 ప్రాంతాల్లో ఇవాళ రాత్రి ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని.. మద్యం తాగి పట్టుబడితే భారీ జరిమానా, వాహనాల… pic.twitter.com/nx8317lAPQ
— Telugu Scribe (@TeluguScribe) December 31, 2025