HomeతెలంగాణVehicle Registration: వాహనదారులకు గుడ్‌ న్యూస్‌..

Vehicle Registration: వాహనదారులకు గుడ్‌ న్యూస్‌..

Vehicle Registration: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాహనదారులకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌ కోసం అందరూ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు వెళ్తున్నారు. అక్కడ గంటల తరబడి నిరీక్షణకు తోడు.. బ్రోహక్ల చేతివాటం, డబ్బులు ఇవ్వనిదే పని జరగకపోవడంతో ప్రతీ వామనదారుడు ఇబ్బంది పడుతున్నారు. సేవలన్నీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నా ఓదో చిన్నసాకుతో డబ్బులు వసూలు చేయడం రవాణాశాఖలో సర్వ సాధారణమైంది. ఈ నేపథ్యంలో రవాణాశాఖలో సంస్కరణలకు సీఎం రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. అక్రమవసూళ్లకు పాల్పడుతున్న చెక్‌పోస్టులను ఎత్తివేయాలని నిర్ణయించారు. తాజాగా రిజిస్ట్రేషన్లను సులభతరం చేసే దిశగా కీలక సంస్కరణలను చేపడుతోంది. షోరూంలలోనే శాశ్వత రిజిస్ట్రేషన్‌ సౌకర్యాన్ని ప్రవేశపెట్టడం ద్వారా, రవాణా శాఖలో అవినీతిని అరికట్టి, బ్రోకర్ల వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ కొత్త విధానం 2026 జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు కానుంది.

Also Read: చంద్రబాబు ఉన్నతి వెనుక రాజశేఖర్ రెడ్డి.. నిజం ఎంత?

ప్రజలకు సులభతరమైన ప్రక్రియ..
రవాణా శాఖ కార్యాలయాల్లో (ఆర్టీఏ) వాహన రిజిస్ట్రేషన్‌ కోసం పొడవైన క్యూలు, బ్రోకర్ల జోక్యం, అవినీతి ఆరోపణలు దశాబ్దాలుగా సామాన్యులకు సవాలుగా మారాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు, రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం షోరూంలలోనే వాహన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేసే విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానం ఆంధ్రప్రదేశ్, దిల్లీ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే విజయవంతంగా అమలవుతున్న నేపథ్యంలో, తెలంగాణలో కూడా దీనిని అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి, రవాణా శాఖ సాఫ్ట్వేర్‌ వ్యవస్థలో అవసరమైన సాంకేతిక మార్పులు చేస్తోంది. ఇది షోరూం సిబ్బందికి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను సులభంగా నిర్వహించేలా చేస్తుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఎంపిక చేసిన షోరూంలలో ఈ విధానం త్వరలో ప్రారంభం కానుంది, ఇది రాష్ట్రవ్యాప్త అమలుకు ముందు పరీక్షా ప్రాతిపదికగా ఉపయోగపడుతుంది.

అవినీతి, బ్రోకర్లకు చెక్‌..
రవాణా శాఖలో అవినీతి, బ్రోకర్ల వ్యవస్థ ఏళ్లుగా పాతుకుపోయింది. ఆర్టీఏ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ పత్రాలు, డ్రైవింగ్‌ లైసెన్సులు బ్రోకర్ల చేతుల్లోకి వెళ్లడం, అక్రమ వసూళ్లు సర్వసాధారణంగా మారాయి. ఈ కొత్త విధానం ద్వారా, ఈ సమస్యలను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. షోరూంలలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయితే, బ్రోకర్ల అవసరం తొలగిపోతుంది. ఇది పారదర్శకతను పెంచడమే కాక, వాహన యజమానుల ఖర్చులను కూడా తగ్గిస్తుంది. రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లింపు, స్మార్ట్‌ కార్డు జారీ వంటి ప్రక్రియలు డిజిటల్‌ వేదికల ద్వారా జరగడం వల్ల అవినీతికి ఆస్కారం గణనీయంగా తగ్గుతుంది.

వాహనదారులు పొందే ప్రయోజనాలు..
ఈ కొత్త విధానం వాహన కొనుగోలుదారులకు గణనీయమైన సౌలభ్యాన్ని అందిస్తుంది. ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, షోరూంలోనే రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుంది. రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించిన తర్వాత, ఆర్సీ స్మార్ట్‌ కార్డు నేరుగా ఇంటికి పోస్టు ద్వారా చేరుతుంది. ఈ సంస్కరణలు ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) ప్రోత్సాహానికి కూడా దోహదపడతాయి. 2024 నవంబర్‌ 18 నుంచి 2026 డిసెంబర్‌ 31 వరకు ఈవీలకు రిజిస్ట్రేషన్‌ ఫీజు, పన్ను మినహాయింపు విధానం అమల్లో ఉంది, ఇది షోరూం రిజిస్ట్రేషన్‌తో మరింత సమర్థవంతంగా అమలవుతుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో రోజుకు సుమారు 2,500 కొత్త వాహనాలు రిజిస్టర్‌ అవుతున్న నేపథ్యంలో, ఈ విధానం రద్దీని తగ్గించి, సామాన్యులకు సమయం, డబ్బు ఆదా చేస్తుంది.

అమలులో ఇబ్బందులు..
ఈ విధానం అమలు సులభమైనది కాదు. షోరూంలలో రిజిస్ట్రేషన్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి పలు సవాళ్లను అధిగమించాల్సి ఉంది. షోరూంలలో సాంకేతిక సౌకర్యాలను మెరుగుపరచడం, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం అవసరం. రవాణా శాఖ ఈ దిశగా ఇప్పటికే కసరత్తు చేస్తున్నప్పటికీ, ఈ ప్రక్రియకు సమయం పట్టవచ్చు. అన్ని షోరూంలు ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. హైదరాబాద్‌లో పైలట్‌ ప్రాజెక్ట్‌ విజయవంతమైతే, రాష్ట్రవ్యాప్తంగా విస్తరణ సులభతరం అవుతుంది. ఈ కొత్త విధానం గురించి వాహన కొనుగోలుదారులకు తగిన అవగాహన కల్పించాల్సి ఉంది. ఇందుకోసం రవాణా శాఖ, షోరూం యాజమాన్యాలు కలిసి ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version