HomeతెలంగాణVC Sajjanar: హైదరాబాద్ ను సజ్జనార్ చేతిలో పెట్టిన రేవంత్.. ఏమిటీ ఆకస్మిక మార్పు!

VC Sajjanar: హైదరాబాద్ ను సజ్జనార్ చేతిలో పెట్టిన రేవంత్.. ఏమిటీ ఆకస్మిక మార్పు!

VC Sajjanar: రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది పూర్తయింది. రెండవ ఏడాది కూడా దగ్గరికి వస్తోంది. ఇంతకాలంలో రేవంత్ అనేక పర్యాయాలు అధికారులను బదిలీ చేయించాడు. ఎన్నడూ కూడా ఈ స్థాయిలో చర్చకు దారి తీయలేదు. డిజిపి నియామకం తర్వాత.. అధికారుల బదిలీలు.. వారి స్థానంలో కొత్త వారి చేర్పు.. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నాయి.

ఆర్టీసీ ఎండీ గా కొనసాగిన సజ్జనార్ ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా నియమించాడు రేవంత్. సజ్జనార్ 1996 ఐఏఎస్ బ్యాచ్ కు చెందినవాడు. తెలంగాణలో అనేక జిల్లాలో ఆయన పనిచేశారు. కెసిఆర్ ఆయనను ఆర్టీసీ ఎండిగా నియమించారు. ముఖ్యమంత్రి రేవంత్ కూడా ఆయన స్థానాన్ని కదిలించడానికి ఇష్టపడలేదు. అయితే ఇప్పుడు ఆయనను హైదరాబాద్ కమిషనర్ గా వేసి.. అతని స్థానంలో 1997 బ్యాచ్ అధికారి నాగిరెడ్డిని నియమించారు.. స్టీఫెన్ రవీంద్ర కు సివిల్ సప్లైస్ కమిషనర్ పోస్టింగ్ ఇచ్చారు. 1994 బ్యాచ్ అధికారి శిఖా గోయల్ ను విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీగా నియమించారు. అంతేకాదు ఆమె సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ పోస్టులో అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

కీలకమైన ఇంటెలిజెన్స్ చీఫ్ గా విజయ్ కుమార్ ను నియమించారు. ఈయన 1997 బ్యాచ్ అధికారి. హోం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న రవి గుప్త సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కు బదిలీ అయ్యారు. ఈయన 1990 బ్యాచ్ అధికారి. హోంగార్డ్స్ భాగంలో ఉన్న 1995 బ్యాచ్ సీనియర్ ఐపీఎస్ అధికారి స్వాతి లక్రాకు ఎస్పీఎఫ్ డీజీగా బాధ్యతలు అప్పగించారు. 1988 బ్యాచ్ అధికారి విక్రమ్ సింగ్ కు అండ్ ఆర్డర్ నుంచి డిజాస్టర్, ఫైర్ విభాగానికి బదిలీ చేశారు. దీనిపై మాత్రం నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈయనను మంచి ప్రయారిటీ పోస్టులు పంపిస్తే చాలా బాగుండేది. 1995 బ్యాచ్ అధికారి మహేష్ మురళీధర్ కు ఏడీజీ పర్సనల్ పోస్టు కల్పించారు. 996 బ్యాచ్ సిఐడి చీఫ్ చారు సిన్హా కు ఏసీబీ బాధ్యతలు అప్పగించారు. 1996 బ్యాచ్ అధికారి అనిల్ కుమార్ కు గ్రే హౌండ్స్, అక్టోపస్ బాధ్యతలు కూడా అప్పగించారు.

వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధిష్టానం నుంచి చాలా విషయాలలో గ్రీన్ సిగ్నల్ లభించినట్టు ఉంది. అందువల్లే ఆయన పాలన మీద పట్టు సాగిస్తున్నారు. క్రమేపీ తన మార్క్ ఉండేలా చూసుకుంటున్నారు. తనను నమ్ముకున్న శివధర్ లాంటి వ్యక్తికి ఏకంగా డీజీపీ ని చేయడం రేవంత్ స్టైల్ కు నిదర్శనం. వచ్చే రోజుల్లో ఐఏఎస్ అధికారులకు కూడా ఇలానే బదిలీలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి కెసిఆర్ తో అంట కాగిన చాలామంది అధికారులకు ఇన్ని రోజులపాటు పోస్టింగులు ఇవ్వడమే రేవంత్ చేసిన అతి పెద్ద సాహసం. అలాంటిది ఉన్నట్టుండి ఆయన ఇలా మారిపోవడం.. తనకు నచ్చిన, తాను మెచ్చిన అధికారులను కీలక స్థానాలలో నియమించడం ఒక రకంగా రేవంత్ కు పాలనపై పెరిగిన పట్టుకు నిదర్శనం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version