HomeతెలంగాణVamshi Press Statement: బీఆర్ఎస్ దాడి.. మహా వంశీ బరెస్ట్

Vamshi Press Statement: బీఆర్ఎస్ దాడి.. మహా వంశీ బరెస్ట్

Vamshi Press Statement: భారత రాష్ట్ర సమితి నాయకులు దాడి చేసిన తర్వాత మహా న్యూస్ సిఎండి వంశీ బయటికి వచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. గులాబీ పార్టీ నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

ఈ స్థాయిలో రాడ్లు.. ఇంత మొత్తంలో రాళ్లతో దాడి చేసి ఏం సాధిద్దాం అనుకున్నారు? మీ విషయంలో ఏదైనా తప్పుడు కథనాలు ప్రసారమైతే మీరు వచ్చి నిరసన తెలియజేసుకోండి.. పదిమంది కాదు, 20 మంది కాదు, వందమంది రండి. ఇక్కడ కూర్చోండి. నేను కూడా మీతో పాటు నిరసన తెలియజేస్తాను. ఒకవేళ తప్పుడు కథనం ఏదైనా ప్రసారమైతే కచ్చితంగా నేను క్షమాపణ చెబుతాను. అంతేగాని ఇలా భయభ్రాంతులకు గురి చేయడమేంటి.. ఇలా దాడులు చేయడమేంటి? ఇదేం పద్ధతి? ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభానికి ఉన్న విలువ ఇదేనా? ఇలాంటి దాడులు చేసి తెలంగాణకు ఎలాంటి సమాధానం చెబుతారు?” అంటూ మహా టీవీ సిఎండి వంశీ తన ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read:Maha TV office attack : మహాటీవీ ఆఫీస్ పై బీఆర్ఎస్ నేతల దాడి చితక్కొట్టారు

బృందాలుగా వచ్చారు
మహా టీవీ కార్యాలయం పై దాడులు చేయడానికి గులాబీ పార్టీ నాయకులు బృందాలుగా వచ్చారని ఆ సంస్థ ఉద్యోగులు చెబుతున్నారు..” శనివారం దాదాపు 11 గంటల సమయంలో కొంతమంది వ్యక్తులు వచ్చారు. వారి చేతిలో ఇనుప రాడ్లు ఉన్నాయి. కొందరు చేతిలో రాళ్లు కూడా ఉన్నాయి. వారు కార్యాలయంపై దాడులకు పాల్పడ్డారు. రాళ్లతో కార్యాలయం అద్దాలను బద్దలు కొట్టారు. కార్యాలయం ఎదుట పార్కింగ్ చేసిన వాహనాలను కూడా ధ్వంసం చేశారు. రాళ్లతో వాహనాల అద్దాలు పగలగొట్టి భయభ్రాంతులకు గురి చేశారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జై కేటీ ఆర్.. జై బీఆర్ఎస్ అంటూ నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి కక్ష సాధింపు మానుకోవాలని డిమాండ్ చేశారని” మహా టీవీ ఉద్యోగులు చెబుతున్నారు.

Also Read: న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఎందుకు చనిపోయింది? కారణాలు అవేనా?

కార్యాలయంలోకి దూసుకొచ్చారు..
“గులాబీ పార్టీ కార్యకర్తలు అంతటితో ఆగకుండా కార్యాలయం లోపలికి దూసుకొచ్చారు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. దుర్భాషలు మాట్లాడుతూ మా మీద దాడి చేసేందుకు ప్రయత్నించారు. కేటీఆర్ మీద వ్యతిరేక కథనాలు ప్రసారం చేస్తారా? ఇష్టానుసారంగా విమర్శలు చేస్తారా? మీకు ఎంత ధైర్యం? మీరు తెలంగాణలో ప్రసారాలు ఎలా చేస్తారు? ఛానల్ ఎలా నిర్వహిస్తారు? మీ వెనుక ఉన్నది రేవంత్ రెడ్డి కదా? రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు.. మీలాంటి ఎల్లో మీడియా ద్వారా ఇలాంటి కథనాలను ప్రసారం చేయిస్తున్నాడు. కేటీఆర్ మీద అడ్డగోలుగా ప్రసారాలు చేస్తే ఊరుకునేది లేదు. ఇంతకింతకు దాడులు చేస్తామంటూ బెదిరించారని” మహా న్యూస్ సిబ్బంది పేర్కొన్నారు.. వచ్చిన వారంతా కూడా యువకులేనని.. వారంతా దాడులకు పాల్పడటం వల్ల తమ భయభ్రాంతులకు గురయ్యామని… వారి వల్ల మాకు ప్రాణాపాయం ఉందని మహా న్యూస్ సిబ్బంది చెబుతున్నారు. వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version