https://oktelugu.com/

డబ్బులిస్తే డాక్టరేట్… తెలంగాణలో నకిలీ సర్టిఫికెట్ల భాగోతం..?

డాక్టరేట్లు పొందాలంటే ఎంత కష్టపడాలో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఒక రంగంలో విశేషమైన సేవలను అందించినా, ఏదైనా అంశంపై పరిశోధనలు చేసి విజయం సాధించినా డాక్టరేట్లను పొందవచ్చు. అయితే కొందరు కేటుగాళ్లు మాత్రం డాక్టరేట్ కోసం ఏళ్లకు ఏళ్లు కష్టపడాల్సిన అవసరం లేదని.. డబ్బుంటే డాక్టరేట్ ను సొంతం చేసుకోచ్చని ప్రూవ్ చేస్తున్నారు. డాక్టరేట్ల నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణం తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. Also Read : ఏపీపై కేంద్రం ఫోకస్: మత మార్పిడులపై […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 30, 2020 2:50 pm
    Follow us on

    universities selling doctorates for money in karimnagar

    డాక్టరేట్లు పొందాలంటే ఎంత కష్టపడాలో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఒక రంగంలో విశేషమైన సేవలను అందించినా, ఏదైనా అంశంపై పరిశోధనలు చేసి విజయం సాధించినా డాక్టరేట్లను పొందవచ్చు. అయితే కొందరు కేటుగాళ్లు మాత్రం డాక్టరేట్ కోసం ఏళ్లకు ఏళ్లు కష్టపడాల్సిన అవసరం లేదని.. డబ్బుంటే డాక్టరేట్ ను సొంతం చేసుకోచ్చని ప్రూవ్ చేస్తున్నారు. డాక్టరేట్ల నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణం తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

    Also Read : ఏపీపై కేంద్రం ఫోకస్: మత మార్పిడులపై కేంద్రం సీరియస్‌?

    డాక్టరేట్లను ఆంగడి సరుకులుగా మార్చి కొందరు కేటుగాళ్లు బేరం కుదుర్చుకుని విక్రయించడంపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మోసాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తే మాత్రమే వాళ్లలో మార్పు వస్తుందని విద్యార్థుల నుంచి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. డబ్బు ఉంటే డాక్టరేట్ ఇస్తున్న యూనివర్సిటీలపై చర్యలు తీసుకోవాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    అయితే చిన్నాచితకా యూనివర్సిటీలు ఇలాంటి డాక్టరేట్ లను ఇస్తున్నాయని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ప్రముఖ యూనివర్సిటీలు సైతం ఈ తరహా మోసాలకు తెరలేపుతున్నాయి. అక్షరం ముక్క రాని వారి దగ్గర కూడా డబ్బు ఉంటే డాక్టరేట్లను సొంతం చేసుకోచ్చని సమాజానికి చెబుతున్నాయి. గ్లోబల్‌ పీస్‌లాంటి యూనివర్సిటీలు నిబంధనలు తుంగలో తొక్కి 20 వేల నుంచి 50 వేల రూపాయలు ఉంటే డాక్టరేట్ సొంతం చేసుకోవచ్చని వెల్లడిస్తున్నాయి.

    ఎవరైనా డబ్బు చెల్లించి యూనివర్సిటీ పట్టా తీసుకోవడం సాధ్యం కాకపోతే వారికి కొరియర్ ద్వారా డాక్టరేట్ పట్టా ఇంటికే చేరుతుంది. డబ్బుల కోసం కక్కుర్తి పడి డాక్టరేట్లు ఇస్తున్న ఇలాంటి యూనివర్సిటీల వల్ల ప్రతిభ ఉన్న విద్యార్థులు నష్టపోతున్నారు. ఇలా డబ్బులు తీసుకుని సర్టిఫికెట్లు జారీ చేస్తున్న యూనివర్సిటీల గుర్తింపు రద్దు చేస్తే మాత్రమే ప్రతిభ గల విద్యార్థులకు న్యాయం జరుగుతుంది.

    Also Read : హేమంత్ హత్య కోసం రెండు సుపారీ గ్యాంగ్ లతో డీల్?