తెలంగాణ మళ్లీ టాప్.. గొప్ప విజయం

కేంద్ర ప్రభుత్వం మరోసారి స్వచ్ఛ ర్యాంకులను ప్రకటించింది. ఏటా రాష్ట్రాలు, జిల్లాలు, బ్లాక్‌లు, పంచాయతీల వారీగా కేంద్రం అవార్డులను అందిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో తెలంగాణ మళ్లీ సత్తా చాటింది. మూడోసారి మొదటి స్థానం పొంది హ్యాట్రిక్‌ సాధించింది. జిల్లాల కేటగిరీలో కరీంనగర్‌‌ మూడో స్థానంలో నిలిచింది. Also Read: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సంచలన తీర్పు తాగునీరు, పారిశుద్ధ్య విభాగంలో గతేడాది కేంద్ర ప్రభుత్వం  మూడు రకాల  ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది. […]

Written By: NARESH, Updated On : September 30, 2020 2:41 pm

swacha bharat

Follow us on


కేంద్ర ప్రభుత్వం మరోసారి స్వచ్ఛ ర్యాంకులను ప్రకటించింది. ఏటా రాష్ట్రాలు, జిల్లాలు, బ్లాక్‌లు, పంచాయతీల వారీగా కేంద్రం అవార్డులను అందిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో తెలంగాణ మళ్లీ సత్తా చాటింది. మూడోసారి మొదటి స్థానం పొంది హ్యాట్రిక్‌ సాధించింది. జిల్లాల కేటగిరీలో కరీంనగర్‌‌ మూడో స్థానంలో నిలిచింది.

Also Read: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సంచలన తీర్పు

తాగునీరు, పారిశుద్ధ్య విభాగంలో గతేడాది కేంద్ర ప్రభుత్వం  మూడు రకాల  ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ మూడు కేటగిరీల్లోనూ తెలంగాణ అద్భుత ఫలితాలు సాధించి దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలించింది. ఈ మేరకు కేంద్ర పారిశుద్ధ్య, తాగునీటి విభాగ(డీడీడబ్ల్యూఎస్‌) డైరెక్టర్‌ యుగుల్‌ కిషోర్‌ జోషి తెలిపారు. ఈ మేరకు ఆయన  రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖకు ఓ లేఖ పంపారు.

స్వచ్ఛభారత్‌లో తెలంగాణకు మరోసారి ఫస్ట్‌ ప్లేస్‌ రావడంపై రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు ఆనందం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ చేపట్టిన పట్టణ, పల్లె ప్రగతి, మిషన్‌ భగీరథ తదితర కార్యక్రమాల వల్లే అవార్డులు వచ్చాయన్నారు. అక్టోబర్‌ 2న స్వచ్ఛ భారత్‌ దివాస్‌ సందర్భంగా ఈ అవార్డులను కేంద్రం అందజేస్తోందని తెలిపారు.

Also Read: హేమంత్ హత్య కోసం రెండు సుపారీ గ్యాంగ్ లతో డీల్?

కరోనా నేపథ్యంలో కార్యక్రమం నిర్వహించే పరిస్థితి లేనందునా.. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ఆన్‌లైన్‌ ద్వారా అవార్డులు అందజేయనున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా ఈ అవార్డులను స్వీకరిస్తారని మంత్రి  తెలిపారు.