https://oktelugu.com/

బుద్ది తక్కువై పవన్ ను నమ్మాం.. పవన్ మూడు పెళ్లిళ్ల మాసికం: నారాయణ

తెలుగు రాష్ట్రాల్లో చిత్రవిచిత్రమైన తిట్లతో వార్తల్లో నిలుస్తుంటారు సీపీఐ నారాయణ. ఈసారి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీచేశారు. వామపక్షాలైన సీపీఐ, సీపీఎంలతో పొత్తు పెట్టుకొని అదృష్టం పరీక్షించుకున్నారు. కానీ ఆ ఎన్నికల్లో పవన్ సైతం గెలువలేకపోయారు. ఇన్నాళ్లు చేగువేరా ఆశయాలతో కమ్యూనిస్టులకు పెద్దపీట వేసిన పవన్ ఓడిపోయాక వారిని దూరం పెట్టేసేశారు. Also Read: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సంచలన […]

Written By: NARESH, Updated On : September 30, 2020 2:37 pm

cpi narayana

Follow us on

తెలుగు రాష్ట్రాల్లో చిత్రవిచిత్రమైన తిట్లతో వార్తల్లో నిలుస్తుంటారు సీపీఐ నారాయణ. ఈసారి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీచేశారు. వామపక్షాలైన సీపీఐ, సీపీఎంలతో పొత్తు పెట్టుకొని అదృష్టం పరీక్షించుకున్నారు. కానీ ఆ ఎన్నికల్లో పవన్ సైతం గెలువలేకపోయారు. ఇన్నాళ్లు చేగువేరా ఆశయాలతో కమ్యూనిస్టులకు పెద్దపీట వేసిన పవన్ ఓడిపోయాక వారిని దూరం పెట్టేసేశారు.

Also Read: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సంచలన తీర్పు

ఇప్పుడు కమ్యూనిస్టులతో దోస్తీ కట్ చేసి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పంచన చేశారు. ప్రస్తుతం ఏపీలో బీజేపీతో కలిసి వెళుతున్నారు. బీజేపీ అంటే అస్సలు పడని సీపీఐ నారాయణ తాజాగా పవన్ కళ్యాణ్ దుమ్ముదులిపేశారు. గత ఎన్నికల్లో బుద్ది తక్కువై పవన్ ని తాము నమ్మామని సీపీఐ నారాయణ ఆడిపోసుకున్నారు. పవన్ ఇలా బీజేపీకి సపోర్టు చేస్తారని ఊహించలేదని నారాయణ ఆరోపించారు.పవన్ కళ్యాణ్ మోడీ కాళ్లు పట్టుకుంటున్నారని.. ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకొని మాసికం చేసుకున్నారని నారాయణ హాట్ కామెంట్స్ చేశారు.

ఇక అంతటితో ఆగకుండా రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలను కూడా నారాయణ ఉతికి ఆరేశారు. బిల్లులకు మద్దతు ఇవ్వకపోతే జైలుకు వెళ్తాయనే భయం జగన్ లో ఉందని.. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్ ఇప్పుడు ఎక్కువమంది ఎంపీలున్నా చేతులెత్తేశారని మండిపడ్డారు. చంద్రబాబుకు పట్టిన గతే జగన్ కు పడుతుందన్నారు. జగన్, చంద్రబాబులు మోడీ కాళ్లు పట్టుకుంటున్నారని నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Also Read: జగన్‌ మార్క్‌ పాలి‘ట్రిక్స్‌’: కార్పొరేట్‌ స్కూళ్ల విలవిల

టీడీపీ, వైసీపీ దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నాయని   మండిపడ్డారు. రైతులకు నష్టం కలిగించే వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్ లో టీడీపీ, వైసీపీలు మద్దతు పలకడం దారుణమన్నారు.

ఇలా ఏపీలోని మూడు ప్రధాన పక్షాలు టీడీపీ, వైసీపీ, జనసేనలను తాజాగా నారాయణ టార్గెట్ చేశారు. పవన్ గురించి అయితే నోరు పారేసుకోవడం.. సంచలన కామెంట్లు చేయడం దుమారం రేపుతోంది.