MGM Hospital: వైద్యులను ప్రాణదాతలు అని పిలుస్తుంటారు. కనిపించే దేవుళ్ళుగా రోగులు కొలుస్తుంటారు. అటువంటి గొప్ప పేరు ఉన్న వైద్యులు రోగులకు చికిత్స అందించి.. ఇంకా మంచి పేరు తెచ్చుకోవాల్సి ఉండగా.. చికిత్సను పక్కనపెట్టి దోపిడికి పాల్పడుతున్నారు. అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడి ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టిస్తున్నారు.
Also Read: చిరంజీవి తో కలిసి నటించడం పై ప్రభాస్ హీరోయిన్ హాట్ కామెంట్స్..మండిపడుతున్న ఫ్యాన్స్
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల విభాగంలో అతిపెద్దదైన ఎంజీఎం (Mahatma Gandhi memorial hospital) లో అవినీతి వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇటీవల ఈ ఆసుపత్రిలో ఒకటే ఆక్సిజన్ సిలిండర్ ను ఇద్దరు చిన్నారులకు పెట్టడం చర్చకు దారి తీసింది. దీనిపై మీడియాలో ప్రముతంగా వార్తలు రావడంతో వైద్య శాఖ మంత్రి ఎంజీఎం superintendent పై చర్యలు తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజం లేదని తర్వాత తేలింది.. ఇటీవల ఎంజీఎం లో రోగులపై సెక్యూరిటీ గార్డ్ లు దాడి చేశారు. ఆ దాడికి సంబంధించిన దృశ్యాలు కూడా మీడియాలో విపరీతంగా కనిపించాయి. ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడం.. మీడియాలో ప్రముఖంగా రావడంతో ఎంజీఎం సూపరిండెండెంట్ పై చర్యలు తీసుకున్నది.
ఈ సంఘటన తర్వాత ఎంజిఎం లో ఓ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎంజీఎం లో అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల రెండు కోట్ల నిధులు పక్కదారి పట్టాయని ఆరోపణ వినిపిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ నిధులు స్వాహా కావడంతోపాటు టెండర్లు వేయకుండానే స్టేషనరీ కొనుగోలు చేసినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం ఆస్పత్రి వర్గాలలో చర్చకు దారితీస్తోంది. ఎంజీఎం లో పనిచేస్తున్న ఉన్నతాధికారుల్లో ఒకరు ఈ అవినీతి వ్యవహారాన్ని మీడియాకు లిక్ చేసినట్టు తెలుస్తోంది. ఓ వర్గం ఎంజీఎంలో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తోందని.. పై అండలు చూసుకుని అడ్డగోలుగా దోపిడీ చేస్తోందని మరో వర్గం ఆరోపిస్తోంది. మరో వర్గానికి చెందిన ఉన్నతాధికారి మీడియాకు లింకులు ఇవ్వడంతో ఈ వ్యవహారం బయటికి వచ్చింది. ఈ కుంభకోణంపై విజిలెన్స్ విచారణ చేపడితే నిజాలు బయటపడతాయని తెలుస్తోంది. ఎంజీఎం కొత్త బాస్ దీనిపై దృష్టి పెడితే బాగుంటుందని రోగులు అంటున్నారు.
ఇటీవల కాలంలో సెక్యూరిటీ గార్డులు కూడా రోగులపై దాష్టీకాన్ని ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెక్యూరిటీ గార్డులు పై అండదండలు తీసుకొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని విమర్శలున్నాయి.. కొత్త బాస్ సెక్యూరిటీ గార్డుల వ్యవహార శైలి పట్ల దృష్టి సారించాలని.. వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని రోగులు డిమాండ్ చేస్తున్నారు. వైద్య సేవల విషయంలో పారదర్శకతను పెంపొందించాలని కోరుతున్నారు.