Mohammad Azharuddin: తెలంగాణలో జూబ్లీహిల్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవడానికి బీఆర్‌ఎస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. సత్తా చాటాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇక అధికారం కాంగ్రెస్ తమ ఖాతాలో వేసుకోవడానికి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో మాజీ క్రికెటర్, ఎమ్మెల్సీ అజారుద్దీన్‌ను జూబ్లీహిల్స్ ఎన్నికల మైదానంలోకి దించబోతోంది. ఇందులో భాంగా సీఎం రేవంత్‌రెడ్డి ముందుగా అజారుద్దీన్‌ను మంత్రిని చేయాలని నిర్ణయించారు. రెండు రోజుల్లో అజార్‌తో మంత్రిగా ప్రమాణం చేయించి జూబ్లీహిల్స్ ఎన్నికల మైదానంలోకి దించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇటీవల ఢిల్లీకి వెళ్లి అధిష్టానం నుంచి ఇందుకు గ్రీన్‌సిగ్నల్ తెచ్చుకున్న ఆయన, ఉపఎన్నికలను కీలకమలుపు తిప్పబోతున్నారు.
Also Read: చిరంజీవి తో కలిసి నటించడం పై ప్రభాస్ హీరోయిన్ హాట్ కామెంట్స్..మండిపడుతున్న ఫ్యాన్స్!
మైనారిటీ ఓటర్లను ఆకట్టుకునేలా..
మాజీ క్రికెటర్‌గా జాతీయ గుర్తింపు కలిగిన అజార్ జూబ్లీహిల్స్‌లో మైనారిటీలతోపాటు యువతలో కూడా ప్రభావం చూపగల నాయకుడు. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ అంతర్గత విభేదాలు ఆగిపోవడానికి, అలసిన కేడర్‌కు చైతన్యం తెచ్చేందుకు ఆయన ప్రవేశం దోహదపడవచ్చు. బీఆర్‌ఎస్ స్థానిక నేతలు ఇప్పటికే డిఫెన్సివ్ గేమ్‌లోకి వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అజార్ మంత్రిగా నియమితులైతే, ఆయన క్యాబినెట్ ప్రతినిధిగా నిర్వహించే ప్రాధాన్యత జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటర్లపై మానసిక ప్రభావం చూపడం ఖాయం. కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఈ సీటును ప్రతిష్టాత్మకంగా మార్చి, మైనారిటీల ఓటు ధోరణిని కాపాడే కదలికలతో ముందుకు వస్తోంది.
బీజేపీ, బీఆర్‌ఎస్‌ను ఆడుకుంటాడా..
ఇక బీఆర్‌ఎస్, బీజేపీ లెక్కల్లో ఈ క్రికెటర్ జూబ్లీహిల్స్ గ్రౌండ్‌లో ఎలా ఎదుర్కొంటాడు.. వారి ప్రచారాన్ని తనదైన శైలిలో ఎలా తిప్పకొడతాడు.. కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ యాదవ్‌ను ఎలా గెలిపిస్తాడన్న చర్చ జరుగుతోంది. అజార్ ప్రజాసభలు, ప్రచార శైలి, చర్చలలో కనిపించే సాఫ్ట్ టచ్ కాంగ్రెస్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచవచ్చు. తన ఖ్యాతి, మానవతా దృక్పథం కలగలిపిన ప్రచారంతో అజార్ గేమ్ మొనదేరితే ప్రతిపక్షాలు క్లీన్ బోల్డ్ అయ్యే అవకాశం ఉంది.
మొత్తంగా జూబ్లీహిల్స్‌ను తన ఖాతాలో వేసుకునేందుకు రేవంత్‌రెడ్డి వ్యూహం ఏమేరకు సక్సెస్ అవుతుంది. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తుందా.. గెలిస్తే ఎంత మెజారిటీ తెప్పిస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇందుకోసం నవంబర్ 14 వరకు వేచి చూడాల్సిందే.