TV9- NTV
TV9- NTV: సంబరాలు మిన్నంటాయి. వేడుకలు హోరెత్తాయి. టపాసుల మోతతో బంజారా హిల్స్ ప్రాంతంలో కేరింతలు మోతెక్కాయి. ఇంతకీ ఇదంతా జరగడానికి కారణం టీవీ9 ఎన్టీవీ ని కిందికి లాగే నెంబర్ వన్ ప్లేస్ కు రావడం. వాస్తవానికి టీవీ9కు ఉన్న నెట్వర్క్ తో పోలిస్తే ఎన్టీవీ విస్తృతి చాలా తక్కువ. అయినప్పటికీ అది ఇన్ని రోజులు నెంబర్ వన్ పొజిషన్ కొట్టేసింది అంటే మామూలు విషయం కాదు. సరే ఇది తాత్కాలికంగా ఉన్నప్పటికీ.. చివరికి తన ప్రథమ స్థానాన్ని టీవీ9 తిరిగి సాధించుకుంది. అందుకే ఇవాళ టీవీ9 న్యూస్ స్టూడియోలో ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఇదే లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు. ఆ రుధిర దేవి లోగో పట్టుకుంటే.. రజనీకాంత్, మురళీ కృష్ణ అటువంటివారు నంబర్ 1 స్థానంలోకి తిరిగి రావడంపై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. టీవీ9తో పోలిస్తే స్ట్రైట్, ప్లెయిన్ కవరేజ్ విషయంలో ఎన్టీవీ ని జనం మెచ్చడంతో అది నెంబర్ వన్ స్థానంలోకి వెళ్లిపోయింది. కానీ దానికి అది తాత్కాలిక ఆనందమే అయిపోయింది. ఇవాళ టీవీ9 ఆఫీస్ లో సంబరాలు జరిగిన తీరు చూస్తుంటే.. ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని కార్యకర్తలు కార్యాలయంలో జరిపే వేడుకల మాదిరి ఉంది.
అది టీవీ9 నిర్లక్ష్యం
టీవీ9 ప్రారంభించిన తొలినాళ్లలో జనాలకు బాగా రీచ్ అయ్యిందంటే కారణం అప్పట్లో కీలక స్థానంలో మేధావులు ఉండేవారు. న్యూస్ ప్రజెంట్ చేసే విధానం, అది జనబాహుళ్యం లో కలిసిపోవడంతో నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. తర్వాత కీలక స్థానాల్లోకి అర్థ జ్ఞానం లేని వారు వచ్చి వెర్రి వచ్చి వెర్రి ముర్రి ప్రయోగాలు చేశారు. న్యూస్ పేరుతో చేసే న్యూసెన్స్ ఎక్కువైపోయింది. సెన్సేషనల్ పేరుతో నానా చెత్తను ప్రసారం చేయడం మొదలుపెట్టింది. పైగా న్యూస్ ప్రజెంట్ చేసే యాంకర్ల దిక్కుమాలిన భాష వల్ల టీవీ9 భ్రష్టు పట్టిపోయింది. ఏ మాటకు ఆ మాట ఆ రవి ప్రకాష్ ఉన్నప్పుడు న్యూస్ ప్రజెంటేషన్ విధానంలో టీవీ9 పనితీరు బాగుండేది. ఎప్పుడైతే రవి ప్రకాష్ బయటకు వెళ్ళాడో, మంచి టీం బయటకు వెళ్లిపోయిందో.. ఇక అప్పటినుంచి టీవీ9 మెరుగైన సమాజం కోసం అనే ట్యాగ్ లైన్ వదిలేసి కేవలం మాస్ మసాలా కు పరిమితం అయిపోయింది.
పోటీ ఉన్నప్పటికీ దోస్తీ
మొదటి రెండు స్థానాల్లో ఉన్నప్పటికీ టీవీ 9, ఎన్టీవీ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి..కానీ ఎన్టీవీ మొదటినుంచి ప్లైన్ కవరేజ్ నమ్ముకుంది. ఎప్పుడో ఒకప్పుడు తప్ప మిగతా సార్లు తన గిరి దాటి వార్తను ప్రజెంట్ చేయలేదు. టీవీ9 అలా కాదు అది ప్యూర్ దబిడి దిబిడి టైపు. విషయం తక్కువ ఆర్భాటం ఎక్కువ. అంతటి ప్లెయిన్ కవరేజ్ తో నెంబర్ వన్ స్థానానికి ఎన్ టీవీ వచ్చింది అంటే మామూలు విషయం కాదు. దాని గురించి టీవీ9 ఎందుకు శోధించలేదో, ఎందుకు ప్రయత్నించలేదో మరి.
తాజా బార్క్ రేటింగ్స్ లో..
న్యూస్ పేపర్ల గణాంకాలు పరిశీలించేందుకు ఏబీసీ ఉన్నట్టే..న్యూస్ చానల్స్ సత్తా తేల్చేందుకు బార్క్ అనే సంస్థ ఉంది.. అయితే ఈ బార్క్ రేటింగ్ ప్రకారం టీవీ9 మొదటి స్థానంలో ఉన్నట్టు తేలింది. అయితే ఈ జాబితా ప్రకారం 12 వారంలో ఎన్టీవీ తో పోలిస్తే టీవీ9 రేటింగ్స్ చాలా దారుణంగా ఉన్నాయి. ఏం చేసిందో తెలియదు కానీ మెల్లిమెల్లిగా ఎగబాకింది..ఎన్ టీవీ ని కిందకి లాగింది. నెంబర్ స్థానంలోకి వెళ్లిపోయింది. బహుశా ఈ రెండు ఛానెల్స్ మధ్య మరీ భారీ అంతరం లేదు కానీ..తర్వాత ఎన్టీవీ ఏం చేస్తుందనేదే ఇక్కడ ప్రశ్న. వాస్తవానికి బార్క్ రేటింగ్స్ మేనేజ్ చేయడం పెద్ద టాస్క్. అయితే వచ్చే ఎన్నికల కాలంలో ఈ పోటీ ఎంత వేగవంతంగా ఉంటుందో, రస కందాయంలో పడుతుందో వేచి చూడాల్సి ఉంది.
మూడో స్థానం లో టీవీ5
ఇక బార్క్ రేటింగ్స్ లో మూడో స్థానంలో టీవీ_5 నిలిచింది. అసలు ఏ మాత్రం పాత్రికేయ లక్షణాలు కనిపించని ఆ చానల్ మూడో స్థానంలో కొనసాగడమే పెద్ద ఆశ్చర్యం. బార్క్ రేటింగ్స్ అలానే ఉంటాయి కాబోలు..అలానే జరుగుతాయి కాబోలు. ఇక నాలుగో స్థానం లో ఉన్న వీ6 చానెల్ కు ఏబీఎన్ కు మధ్య ఒక్క అడుగు దూరం మాత్రమే ఉంది. ఈ లెక్కన చూస్తే ఏబీఎన్ నాలుగో స్థానంలోకి రావడం పెద్ద కష్టం కాకపోవచ్చు. అరే ఏబీఎన్ ఉదయం లేస్తే చంద్రబాబు డప్పు కొడుతుంది కదా..అది ఐదో స్థానంలోకి రావడం ఏంటని ప్రశ్నించకండి.. టీవీ5 మూడో స్థానంలో కొనసాగుతున్నప్పుడు ఏబీఎన్ ఐదో స్థానంలో ఉండటం పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇక పత్రికల్లో మొదటి రెండు స్థానాల్లో ఉన్న ఈనాడు, సాక్షి చానెల్స్ 7, 8 స్థానాల్లో ఉండటం ఒకింత విస్మయానికి గురి చేస్తున్నది. నంబర్ వన్ ప్లేస్ లోకి ఎలా వెళ్ళాలో టీవీ9 చెబితే.. ఈ రెండు కూడా అదే ఫాలో అవుతాయి కావొచ్చు. ఇక ఆ మధ్య ఇరగ దీసిన టీ న్యూస్.. చప్పున చల్లారిపోయింది.. కెసిఆర్ భజన మించిపోయి వెనక్కి వెళ్ళిపోయింది..ఇక మిగతా చానల్స్ అంటారా.. వాటి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మేనేజ్ చేసే బార్క్ రేటింగ్స్ లోనే అవి లేవంటే.. జనం మదిలో కూడా లేనట్టే కదా!
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Tv9 is again at the top after pushing back ntv
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com