Difference Between Heart Conditions: 20 ఏళ్ల వయసు కూడా లేని వ్యక్తికి హార్ట్ ఎటాక్.. కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న వ్యక్తికి హార్ట్ ఫెయిల్యూర్.. కార్డియాక్ అరెస్టుతో ఒకరి మృతి.. వంటి వార్తలు వింటుంటాం.. అయితే ఈ వార్తలన్నింటిలో ఒకటే కామన్ పాయింట్ ఉంటుంది.. గుండె సమస్యతో చనిపోయారని అర్థమవుతుంది. చాలామంది ఈ మూడు విధాలుగా వార్తలు వచ్చినప్పుడు అన్ని ఒకటే రకమైన వ్యాధితో మరణించారని అనుకుంటారు. కానీ వాస్తవానికి హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఫెయిల్యూర్ అనేవి మూడు వేరువేరు సమస్యలు. ఇవి ఎవరికైనా ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ మూడు సమస్యలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
హార్ట్ ఎటాక్:
హార్ట్ ఎటాక్ అనేది గుండెకు సరఫరా చేసే రక్తనాళాల్లో ఏర్పడే సమస్య. గుండెకు రక్తం సరఫరా చేసే కరోనరీ అర్టరీలు ఒక్కోసారి బ్లాక్ అవుతాయి. కొలెస్ట్రాల్ లేదా రక్తం గడ్డ కట్టడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఇలా గుండెకు రక్తం ఆగిపోవడంతో గుండె నుంచి ఇతర అవయవాలకు ఆక్సిజన్ సరఫరా ఆగిపోతుంది. ఫలితంగా కండరాలు దెబ్బతిని చాతిలో నొప్పి వస్తుంది. ముఖ్యంగా ఎడమజాతిలో కంటిన్యూగా నొప్పి రావడంతో పాటు చెమటలు, వాంతులు ఏర్పడతాయి. ఆ తర్వాత శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారుతుంది. భుజం నొప్పి, చేయి, మెడ ఇలా అన్ని రకాల అవయవాలు నొప్పికి వస్తాయి. ఈ లక్షణాలన్నీ హార్ట్ ఎటాక్ కు సంబంధించినవి.
కార్డియాక్ అరెస్ట్:
కార్డియాక్ అరెస్ట్ కూడా గుండెకు సంబంధించిన సమస్యనే. ఏమాత్రం విశ్రాంతి లేకుండా కొట్టుకునే గుండె ఒక్కసారి ఆగిపోవడానికి కార్డుయాక్ అరెస్ట్ అంటారు. గుండె కొట్టుకోవడం ఆగిపోవడంతో శ్వాస ఆగిపోతుంది. దీంతో ఆక్సిజన్ పూర్తిగా నిలిచిపోయి వ్యక్తి ఒకేసారి కింద పడిపోతాడు. అవయవాలు అన్నిటికీ రక్తప్రసరణ ఆగిపోయి ఒకేసారి మరణించే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమస్య ఏర్పడినప్పుడు పక్కన ఎవరైనా ఉంటే cpr లేదా డిపిబ్రిలేటర్ ద్వారా ఆ వ్యక్తిని రక్షించుకునే అవకాశం ఉంటుంది.
హార్ట్ ఫెయిల్యూర్:
కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం.. నిత్యం ఒత్తిడితో ఉండడం.. ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఒక్కోసారి గుండె సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. గుండెకు కావలసిన రక్తాన్ని మిగతా అవయవాలు సరైన సమయంలో పంపలేకపోయినా.. హార్ట్ బలహీనంగా మారి ఆ తర్వాత సరైన విధంగా కొట్టుకోకపోవడం జరుగుతుంది. ఇలా కొన్ని రోజులపాటు ఉండి ఆ తర్వాత గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. హార్ట్ ఫెయిల్యూర్ వచ్చేముందు కొన్ని లక్షణాలు ఏర్పడతాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. కాళ్లు ఆపు ఎక్కడం.. అలసట.. బలహీనంగా మారడం.. శరీరంలో నీటి శాతం పెరగడం వంటివి ఉంటాయి. ఇలా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.
ఇలా మూడు పేర్లు ఒకే రకంగా కనిపించినా.. ఆ సమస్యలు మాత్రం వేరుగా ఉంటాయి. అయితే వీటి లక్షణాలు.. సమస్యలను గుర్తించి వాటికి సరైన చికిత్స తీసుకోవడం మంచిది.