TRS MLAs- Sharmila: వారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. కనుసైగ చేస్తే ఎవరిౖపై అయినా దాడి చేయించగలరు.. అధికారం ఉపయోగించి జైల్లో పెట్టగలరు.. కానీ ఆమెను చూస్తే వారికి వణుకు పుడుతోంది. ఆమె నోటి నుంచి వస్తున్న పదాలతో పరువు పోగొట్టుకుంటున్నారు. ఒక్క మాట నోరుజారి తర్వాత వందల సార్లు తిట్టించుకుంటున్నారు. సమాజంలో పరువు పోగొట్టుకుంటున్నారు. మహిళా నాయకురాలు కావడంతో ఏమీ చేయలేక కాపాడండి మహాప్రభో అంటూ అసెంబ్లీ స్పీకర్ తపులు పట్టారు. ఇజ్జత్ పోతుందయ్యా.. మీరైనా కాపాడుండ్రి అని వేడుకున్నారు. మరి ఎవరు ఆ ఎమ్మెల్యేలు.. ఎందుకు ఈ పరిస్థితికి వచ్చారో తెలుసుకుందా.

అన్నతో గొడవ పడి తెలంగాణలో రాజకీయం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్.షర్మిల. అన్నతో గొడవపడి ఏడాదిన్నర క్రితం ఆంధ్రప్రదేశ్‌ను వీడి హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. రాజకీయాలపై ఆసక్తితో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కూతురిగా తెలంగాణ కోడిలిగా ఇక్కడ రాజకీయం చేయాలని నిర్ణయించుకుంది. వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించింది. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తండ్రిని అధికారంలోకి తీసుకువచ్చిన పాదయాత్ర మంచి మార్గమని భావించారు. ప్రజాప్రస్థానం పేరుతో యాత్ర చేస్తున్నారు. 2 వేల కిలోమీటర్ల యాత్ర పూర్తి చేసుకున్నా ఆశించిన హైప్ రావడం లేదు. ఆమె యాత్రను పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు.
హైప్ కోసం..
2 వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నా పార్టీని ఎవరూ పట్టించుకోవడం లేదు. పత్రికల్లో, మీడియాలో కథనాలు రావడం లేదు. పార్టీకి పెద్దగా గుర్తింపు, వ్యక్తిగతంగా షర్మిలకు పెద్దగా హైప్ రావడం లేదు. ఈ క్రమంలో ఇటీవల ప్రజలకు మరింత దగ్గరయ్యేలా పొలంలో నాట్లు వేయడం, కూలీలతో కలిసి భోజనం చేయడం, పత్తిలో కలుపు తీయడం, కూలీలు పెట్టిన ముద్ద తినడం, కూలీలకు ముద్ద పెట్టడం తదితర పనులు కూడా చేస్తున్నారు. యాత్రలో భాగంగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు.
వెతకబోయిన తీగ కాలికి తాకినట్లు..
పార్టీకి ఎలా హైప్ తీసుకురావాలని సమాలోచనలు చేస్తున్న షర్మిలకు వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లైంది తెలంగాణవ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి చేసిన విమర్శ. యాత్రతోపాటు, ప్రతీ మంగళవారం షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేస్తున్నారు. నోటిఫికేషన్లు వస్తున్నా దీ„ý ను మాత్ర కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల వనపర్తి జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి నియోజకవర్గంలో మంగళవారం నిరుద్యోగ దీక్ష చేశారు. దీనిపై ఆయన నోచు జారారు. షర్మిలను మంగళవారం మరదలు అని సంబోధించారు. దీంతో షర్మిల అగ్గిమీద గుగ్గిలమయ్యారు.
నోటికి పని చెప్తున్న షర్మిల..
మంత్రి చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న షర్మిల ఇక నోటికి పనిచెప్పడం ప్రారంభించారు. ‘ఎవడ్రా నీకు మరదలు.. నువ్వు మంత్రివారా.. చెప్పుతో కొడతా’ అంటూ దుర్భాషలాడారు. షర్మిల కోపం, ఆవేశపూరిత మాటల్లో కొంత నిజాయతీ ఉంది. దీనిని మీడియా హైలెట్ చేసింది. దీనిని గమనించిన వైఎస్సార్ టీపీ అధినేత్రి.. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తిట్ల దండయమే మంచిదకునున్నట్లు ఉన్నారు. వారం రోజులుగా మంత్రి నిరంజన్‌రెడ్డితోపాటు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. చివరకు సీఎం కేసీఆర్‌ను కూడా వదిలిపెట్టడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిని ఎండగడుతున్నారు. భూకబ్జాలను బయటపెడుతున్నారు.
ఏమీ చేయలేక స్పీకర్ వద్దకు..
ఐదు రోజులుగా షర్మిల తిట్టదండకం వినలేక చెవులు మూసుకున్న ఎమ్మెల్యేలు.. మహిళా నాయకురాలు కావడం, ఆర్థికంగా బలంగా ఉండడంతో ఏమీ చేయలేకపోయారు. విధిలేని పరిస్థితిలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాల చివరి రోజు స్పీకర్‌ను ఆశ్రయించారు. షర్మిల అసభ్యంగా మాట్లాడుతున్నారంటూ.. ఫిర్యాదు చేశారు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, దాస్యం వినయ భాస్కర్, లక్ష్మారెడ్డి, కాలే యాదయ్య, మంత్రి నిరంజన్‌రెడ్డి. ముఖ్యమంత్రిపై, మంత్రులపై, ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. చట్టసభల ప్రతినిధులు అనే çస్పృహలేకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేసేవిధంగా అవమానిస్తున్నదని.. ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధుల యొక్క హక్కులకు, గౌరవానికి భంగం కలిగించినందుకు, నిరాధార ఆరోపణలు చేసినందుకు, జుగుప్సాకర ఆరోపణలు చేసినందుకు ఆమెపై చర్య తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదును సీరియస్‌గా పరిగణిస్తామని ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు చేస్తానని స్పీకర్ హామీ ఇచ్చారు.

ముందు మంత్రిపై చర్య తీసుకోండి..
ఎమ్మెల్యేలు, మంత్రి ఫిర్యాదుపై స్పీకర్ స్పందించిన విషయం తెలుసుకున్న షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందించారు. స్పీకర్ తనపై చర్యలు తీసుకునే ముందు నిరంజన్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలను పరిశీలించి వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎదుటి మహిళలో తల్లిని, చెల్లిని చూడలేని మంత్రి నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించకుండా తనపై ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు చేయడం ఏమిటని ప్రశ్నించారు. అయితే మహిళ అనే అడ్వాంటేజ్‌ను తీసుకుని ఇతరుల్ని ఇష్టారీతన తిట్టడంపై విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. షర్మిల భాష తీరుచూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. మీడియాలో పబ్లిసిటీ కోసం ఇలా ఇతరుల్ని తిట్టడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో మంత్రి నిరంజన్‌రెడ్డి కామెంట్‌ను కూడా ఎవరూ సమర్థించడం లేదు. మంత్రి హోదాలో ఉండి మహిళను కించపరిచేలా మాట్లాడడాన్ని కూడా తప్పుపడుతున్నారు.