CM Revanth Reddy: నేటి సోషల్ మీడియా కాలంలో రకరకాల వీడియోలు.. రకరకాల ఫోటోలు అందుబాటులోకి వస్తున్నాయి.. అయితే కొంతమంది వ్యక్తులు మాత్రం కొన్ని ఫోటోలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.. కొన్ని వీడియోలను తమ లక్ష్యాలకు అనుగుణంగా మలుచుకుంటున్నారు.. ముఖ్యంగా బహుళ ప్రజాదరణ పొందిన చిత్రాలలో ఫోటోలను.. వీడియోలను తమ సొంతం కి వాడుకోవడంలో కొంతమంది టాలెంట్ వేరే లెవల్..
Also Read: ‘పెద్ది’ సినిమాకు జాన్వీ కపూర్ పెద్ద మైనస్ కానుందా..? హీరోయిన్ ని చూపించే విధానం అదేనా!
శుక్రవారం దర్శక ధీరుడు రాజమౌళి మహేష్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్ గా, పృధ్విరాజ్ సుకుమారన్ విలన్ గా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాకు సంబంధించి అప్డేట్స్ ను రాజమౌళి విడుదల చేయడం మొదలుపెట్టారు. శుక్రవారం ఈ చిత్రంలో ప్రతి నాయకుడు పాత్రలో కనిపిస్తున్న సుకుమారన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో సుకుమారన్ కాళ్లు చచ్చిబడిన వ్యక్తిగా కనిపిస్తున్నారు. ఒక వీల్ చైర్ ల కూర్చున్న ఆయన.. క్రూరమైన చూపుతో దర్శనమిస్తున్నారు. ఆయన కూర్చున్న కుర్చి పై నుంచి చిత్రమైన చేతులు కనిపిస్తున్నాయి. సుకుమారన్ ఫస్ట్ లుక్ ద్వారా ఇదంతా కూడా ఒక సైంటిఫిక్ సినిమా అని తెలుస్తోంది.
సుకుమారన్ ఫస్ట్ లుక్ ను కొంతమంది వ్యక్తులు మరో విధంగా ఉపయోగించుకుంటున్నారు.. సుకుమారన్ ముఖం స్థానంలో రేవంత్ రెడ్డి ముఖాన్ని అమర్చారు. వెనకాల బుల్డోజర్లను ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ పేద ప్రజలారా.. నేను వస్తున్నా అంటూ ట్యాగ్ లైన్ దానికి జత చేశారు. హైడ్రా ద్వారా హైదరాబాద్ నగరంలో కొద్దిరోజులుగా అక్రమ నిర్మాణాలను ప్రభుత్వం కూల్చివేస్తోంది. ఈ నేపథ్యంలో హైడ్రాకు గులాబీ పార్టీ మరో భాష్యం చెబుతోంది. హైదరాబాద్ ల పేదలు రోడ్డున పడుతున్నారని ఆరోపిస్తోంది. హైడ్రాకు రూపకల్పన చేసింది రేవంత్ రెడ్డి కాబట్టి.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే రేవంత్ రెడ్డి ఇలాగే జూబ్లీహిల్స్ పేదల మీదికి వస్తాడని.. హైడ్రాతో అడ్డగోలు పనులు చేస్తాడని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది. అందువల్లే రాజమౌళి విడుదల చేసిన సుకుమారన్ ఫస్ట్ లుక్ ను ఇలా మార్ఫింగ్ చేసి వాడుకుంటుంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.