Government Schools : దేశంలో విద్యా వ్యవస్థ రోజు రోజుకు మరింత దిగజారిపోతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యూడీఐఎస్ఈ) ప్లస్ ఒక నివేదిక రిలీజ్ చేసింది. అందులో ఆసక్తి గొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి. ఒక వైపు వసతి గృహాలు, మరో వైపు గురుకులాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ విద్యా విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్తున్న అధికారులకు సాధారణ పాఠశాలల్లో విద్యార్థులు లేకపోవడం ఇబ్బందిగా మారుతోంది. గురుకులాల కోసం కార్పొరేట్ స్థాయిలో భవనాలను నిర్మించి పేద, మధ్య తరగతి పిల్లలకు విద్య అందిస్తోంది. ప్రైవేట్ కు ధీటుగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను మారుస్తామని చెప్తున్న ప్రభుత్వాధికారులకు కొన్ని పాఠశాలలు తలనొప్పిగా మారాయి. తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్య మరింత దిగజారుతుందనేందుకు నిదర్శనంగా 2,000 పాఠశాలల్లో విద్యార్థులు లేరని ఖాళీ తరగతి గదులు మాత్రమే ఉన్నాయని విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా (UDISE) నివేదిక చెప్తోంది.
2023-24కి సంబంధించిన UDISE ప్లస్ నివేదిక ప్రకారం.. మొత్తం 2,097 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా లేడని పేర్కొంది. ఇది రాష్ట్రంలో పాఠశాల విద్య పరిస్థితిని హైలైట్ చేస్తుంది. పశ్చిమ బెంగాల్ 3,254, రాజస్తాన్ 2,167 పాఠశాలల తర్వాత జీరో ఎన్‌రోల్‌మెంట్‌లతో అధిక సంఖ్యలో పాఠశాలలతో తెలంగాణ దేశంలోనే మూడో రాష్ట్రంగా నిలిచింది. జీరో ఎన్‌రోల్‌మెంట్ ఉన్నప్పటికీ, పాఠశాలల్లో 2,000 మంది ఉపాధ్యాయులు ఉన్నారు.
మొత్తం 88,429 మంది విద్యార్థులతో 5,985 పాఠశాలల్లో ఒకే ఉపాధ్యాయుడు ఉన్నాడని వెలుగులోకి వచ్చిన మరో ఆశ్చర్యకరమైన సమాచారం. 2023-24 విద్యా సంవత్సరంలో అన్ని మేనేజ్‌మెంట్ల కింద మొత్తం 72,93,644 మంది విద్యార్థులు, 3,41,460 మంది టీచర్లతో రాష్ట్రం 42,901 పాఠశాలలకు నిలయంగా మారింది. ఇంకా, ప్రభుత్వ పాఠశాలల్లో 2021-22లో 33,03,699 నుంచి 2022-23లో 30,09,212కి 2023-24 విద్యా సంవత్సరంలో 27,79,713కి తగ్గింది.
రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాల స్థాయి వరకు సున్నా డ్రాపౌట్ రేటు నమోదైంది. అయినప్పటికీ సెకండరీ స్థాయిలో 13.3 శాతం బాలురు, 9.5 శాతం బాలికలు పాఠశాలకు రావడం మానివేయడంతో డ్రాపౌట్ రేటు 11.4 శాతానికి పెరిగింది. పై స్థాయికి వెళ్లేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. ఇంకా, 42,901 పాఠశాలల్లో 11.8 శాతం 10 కంటే తక్కువ విద్యార్థుల నమోదు చేసింది కేవలం 8.7 శాతం పాఠశాలల్లో మాత్రమే 500 కంటే ఎక్కువ మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు.
బాలికలు, బాలురకు మరుగుదొడ్లు లేని పాఠశాలల గురించి కూడా నివేదిక పేర్కొంది. 29,383 బాలికల పాఠశాలల్లో 2,017 మరుగుదొడ్లు లేవని, మిగిలిన వాటిలో 2,277 మరుగుదొడ్లు పనిచేయడం లేదని, బాలుర విషయానికొస్తే 28,689 పాఠశాలల్లో 4,823 పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవని, 2,618 పాఠశాలల్లో నిరుపయోగంగా ఉన్నాయని తెలిపింది.
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: There are no students in more than 2000 schools in telangana
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com