IPL 2024: ఈ బౌలర్లంటే బ్యాటర్లకు హడల్..

ఆరడుగుల ఎత్తు ఉండే ఈ వెస్టిండీస్ ఆటగాడు.. ఐపీఎల్ లో అద్భుతాలు చేశాడు. 161 మ్యాచ్లు ఆడి 183 వికెట్లు తీసి తను ఎందుకు స్పెషలో నిరూపించాడు. వైవిధ్యమైన బంతులు వేయడంలో బ్రావో కు తిరుగులేదు. ఐపీఎల్ లో ఇతడి బెస్ట్: 22/4.

Written By: Anabothula Bhaskar, Updated On : March 22, 2024 2:17 pm

IPL 2024

Follow us on

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఈ పేరు చెప్తే బ్యాటర్ల దూకుడు గుర్తుకొస్తుంది. వారు ఆడిన విధ్వంసకరమైన ఇన్నింగ్సే మదిలో మెదులుతుంది. కానీ అలాంటి చోట కొంతమంది బౌలర్లు తమ ప్రతాపాన్ని చూపారు. అరి వీర భయంకరమైన బౌలింగ్ వేసి బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించారు. అయితే వీరిలో స్పిన్నర్లే ఎక్కువగా ఉండటం విశేషం. మరికొద్ది క్షణాల్లో ఐపీఎల్ మొదలు కాబోతున్న నేపథ్యంలో.. ఒక్కసారి ఆ టాప్ టెన్ బౌలర్లు ఎవరో తెలుసుకుందామా..

యజువేంద్ర చాహల్

ఇతడు ఇప్పటివరకు 147 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. 187 వికెట్లు పడగొట్టాడు. బంతిని అద్భుతంగా మెలితిపడంలో ఇతడు సిద్ధహస్తుడు. ఐపీఎల్ లో ఇతడి బెస్ట్ ఇప్పటివరకు 40/5.

బ్రావో

ఆరడుగుల ఎత్తు ఉండే ఈ వెస్టిండీస్ ఆటగాడు.. ఐపీఎల్ లో అద్భుతాలు చేశాడు. 161 మ్యాచ్లు ఆడి 183 వికెట్లు తీసి తను ఎందుకు స్పెషలో నిరూపించాడు. వైవిధ్యమైన బంతులు వేయడంలో బ్రావో కు తిరుగులేదు. ఐపీఎల్ లో ఇతడి బెస్ట్: 22/4.

పీయూష్ చావ్లా

సంప్రదాయమైన బౌలింగ్ తో బ్యాటర్లను బోల్తా కొట్టించే స్పిన్ బౌలర్ ఇతడు. ఇప్పటివరకు 181 మ్యాచ్ లు ఆడాడు. 179 వికెట్లు సాధించాడు. ఇతడి అత్యుత్తమ ప్రదర్శన : 17/4.

అమిత్ మిశ్రా

ఇతడు ఇప్పటివరకు 161 మ్యాచ్లు ఆడాడు. 173 వికెట్లు పడగొట్టాడు. అద్భుతంగా బౌలింగ్ చేయడంలో దిట్ట. బంతులను మెలి తిప్పుతూ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టగలడు. ఇతడి బెస్ట్ : 17/5.

రవిచంద్రన్ అశ్విన్

టెస్టుల్లో ఇటీవల రవిచంద్రన్ 500 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ లోనూ సత్తా చాటాడు. ఇప్పటివరకూ 197 మ్యాచ్ లు ఆడాడు. 171 వికెట్లు తీశాడు. ఐపీఎల్ లో ఇతడి బెస్ట్: 34/4.

మలింగ

డిఫరెంట్ బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాటర్లను భయపెట్టే మలింగ.. ఐపీఎల్ లో ఇప్పటివరకు 122 మ్యాచ్ లు ఆడాడు. 170 వికెట్లు తీశాడు. ఇతడి బెస్ట్: 13/5.

భువనేశ్వర్ కుమార్

స్వింగ్ బౌలింగ్ తో వికెట్లు తీయగల నేర్పరి భువనేశ్వర్ కుమార్. ఇతడు ఇప్పటివరకు 160 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. 170 వికెట్లు పడగొట్టాడు. ఇతడి బెస్ట్: 19/5

సునీల్ నరైన్

ఇతడు ఇప్పటివరకు 162 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. 163 వికెట్లు పడగొట్టాడు. స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టగల నైపుణ్యం ఇతడి సొంతం. ఇతడి బెస్ట్: 19/5

రవీంద్ర జడేజా

రవీంద్ర జడేజా ఇప్పటివరకు 226 మ్యాచులు ఆడాడు. 1502 వికెట్లు పడగొట్టాడు. తనదైన రోజు ఇతడు అద్భుతాలు చేయగలడు. ఇతడి బెస్ట్: 16/5.

హర్భజన్ సింగ్

దూస్రా బంతులతో బ్యాటర్లను బెంబేలెత్తించే ఈ పంజాబ్ బౌలర్.. ఇప్పటివరకు 120 ఐపిఎల్ మ్యాచ్లు ఆడాడు. 150 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇతడి బెస్ట్: 18/5.