HomeతెలంగాణCannabis: గంజాయి దందా కొత్త పంథా: ఇతడు రియల్‌ పుష్ప రాజ్‌

Cannabis: గంజాయి దందా కొత్త పంథా: ఇతడు రియల్‌ పుష్ప రాజ్‌

Cannabis: అతడు ఓ మాములు వ్యక్తి. చూసేందుకు మాత్రం డాబూ దర్పాన్ని విపరీతంగా ప్రదర్శిస్తుం టాడు. రేబాన్‌ కళ్లద్దాలు, జొడియాక్‌ చెప్పులు, కొత్త వెర్షన్‌ ఐఫోన్‌, రేమాండ్‌ దుస్తులు.. మాములుగా ఉండదు అతడితో. చూసేందుకు ఓ వీఐపీ లాగా ఉంటాడు. అతడు ఉపయోగించే వాహనానికి పోలీ స్‌ సైరన్‌ ఉంటుంది. అవసరాన్ని, సందర్భాన్ని బట్టి కారుపై ప్రభుత్వ ఉన్నతాధికారుల స్టిక్కర్లు కూడా కన్పిస్తుంటాడు. ఆ స్టిక్కర్లను అతికించుకుని.. కుయ్‌కుయ్‌మనే పోలీస్‌ సైరన్‌తో.. ఖరీదైన కారులో దర్జాగా కూర్చుని రయ్‌మంటూ దూసుకుపోతుం టాడు. ఈ ఉపాద్ఘాతం మొత్తం చదివి అతడు ఏ పోలీస్‌ అధికారో, మరెవరో అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. కానీ, అతడో గంజాయి స్మగ్లర్‌.

తక్కువ ధరకు కొనుగోలు

తక్కువ ధరకు లభించే డ్రగ్స్‌గా గుర్తింపు పొం దిన గంజాయిని ఇక్కడి నుంచి మహారాష్ట్రకు సరఫరా చేస్తూ కోట్లకు పడగలెత్తాడు. తన దందాపై ఎవరికీ అనుమానం రాకుండా ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్‌ స్థాయిలో ప్రణాళిక రూపొందించాడు. టాటా హెక్సా, ఎంజీ హెక్టర్‌, హ్యుండయ్‌ వెర్నా, ఫార్చ్యూనర్‌, ఇన్నోవా, క్రిస్టా వంటి ఖరీదైన కార్లలో ప్రత్యేకంగా అరలు తయారు చేయించి.. వాటిలో గంజాయి సర్ది మహారాష్ట్రకు సరఫరా చేస్తున్నాడు. ఆయా వాహనాలకు పోలీస్‌ ఉన్నతాధికారుల స్టిక్క రో, తహసీల్దారు స్టిక్కరో ఉండడంతో వాటిని చెకింగ్‌ సిబ్బంది పట్టించుకోవట్లేదు. దీంతో స్మగ్లర్‌ వెంకన్న సంపాదనకు హద్దు లేకుండా పోతోంది. మహారాష్ట్రలో ఓ డీలర్‌తో వ్యాపార సంబంధాలు పెంచుకుని.. ఇక్కడ వ్యాపారాల్లో కూడా పెట్టుబడులు పె ట్టాడు. అయితే, అతడి నేరచరిత్ర గురించి ఉప్పందడంతో టీఎస్ న్యాబ్‌ అధికారులు లంగర్‌హౌజ్‌ పోలీసులతో కలిసి వల వేసి అతణ్ని పట్టుకున్నారు. వెంకన్నతో పాటు గంజాయి దందాలో అతనికి సహకరించిన మరో ఐదుగురిని కూడా టీఎ్‌స న్యాబ్‌ పో లీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 44 కేజీల గంజాయి, నాలుగు భారీ కార్లు, రూ.12 లక్షల నగదు మొత్తం రూ. కోటి విలువైన సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ వెంకన్న చరిత్ర

మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం, ఏపూరు గ్రామానికి చెందిన వంకుడోత్‌ వెంకన్న (33) అలియాస్‌ వీరు 2006లో పదో తరగతి పరీక్షల్లో తప్పాడు. తర్వాత హెచ్‌డీఎస్ సీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు విభాగంలో, నారాయణ ఈ టెక్నో స్కూల్‌ (ఆర్‌కే పురం)లో ఏడాది పాటు పనిచేశాడు. ఆ సమయంలో సూర్యాపేటలో నివాసం ఉండే తన మేనమామ తేజావత్‌ చందా (70) వద్దకు తరచూ వెళ్తుండేవాడు. చందా అప్పటికే గంజాయి సరఫరా వ్యాపారంలో ఉండటం.. ఈజీగా డబ్బులు సంపాదించడం చూసి వెంకన్న కూడా గంజాయి దందావైపు ఆకర్షితుడయ్యాడు. 2018లో పూర్తిస్థాయిలో గంజా యి దందాను తన చేతుల్లోకి తీసుకున్నాడు. మల్క న్‌గిరిలో సోమరాజు అనే గంజాయి ఉత్పత్తిదారు వద్ద రూ.4 వేలకే గంజాయి కొనుగోలు చేసి మహా రాష్ట్ర బీడ్‌ జిల్లాలోని నికిలేష్‌ అలియాస్‌ బాబుకు రూ.20-25 వేలకు అమ్మేవాడు. గంజాయి సరఫరాకు ఖరీదైన కార్లను వాడుకునేవాడు. ఆటోనగర్‌లోని ఓ వెల్డింగ్‌ షాపు వద్దకు ఆ కార్లను తీసుకెళ్లి.. సీట్ల కింద.. బాడీకిపైన చిన్న చిన్న అరలు తయారు చే యించాడు. ఆ కార్లను నడిపేందుకు డ్రైవర్లను నియమించుకున్నాడు. విశాఖపట్నం నుంచి ప్రతి ట్రిప్పు లో కారులో 100 కేజీల గంజాయి.. 10 కేజీలు.. 5 కే జీల చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి వాటిని కార్ల అరల కింద అమర్చి దర్జాగా తీసుకొచ్చేసేవాడు. అలా వా రంలో రెండు సార్లు విశాఖ నుంచి గంజాయి తరలిస్తుంటాడని పోలీస్‌ విచారణలో వెల్లడైంది.

కానిస్టేబుల్‌ సహకారంతో

గంజాయి దాటించడానికి ఇన్ని తెలివితేటలు ప్రదర్శించిన వెంకన్నకు అతని వరసకు సోదరుడయ్యే తేజావత్‌ ప్రశాంత్‌ నాయక్‌ (27) సహకరించాడు. మహబూబాబాద్‌ జిల్లా తోపాల్‌ తండా ప్రాంతానికి చెందిన ప్రశాంత్‌ 2018లో కానిస్టేబుల్‌గా ఎంపికై టీఎస్‌ స్పెషల్‌ పోలీస్‌, మామ్నూర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. పోలీసులు చెకింగ్‌ నిర్వహించే తీరు.. స్టిక్కర్‌ ఉంటే, సైరన్‌ ఉంటే ఎలా తప్పించుకోవచ్చో వివరాలు.. పోలీసుల చెకింగ్‌ల గురించి సమాచారం ఇస్తూ గంజాయి సరఫరాకు సహకరించేవాడని పోలీసు విచారణలో వెల్లడవ్వడతో అతణ్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ దందాలో అతనికి సహకరించిన ఇద్దరు డ్రైవర్లు మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన అజ్మీర వెంకన్న (21), సుర్మేని మనోజ్‌ (20)తో పాటు, మరో ఇద్దరు వ్యాపారులు మెరుగు మధు (39, మహబూబాబాద్‌ జిల్లా), మహమ్మద్‌ జహంగీర్‌ (40, మహబూబ్‌నగర్‌ టౌన్‌) కటకటల పాలయ్యారు కాగా.. గంజాయి వ్యాపారంలో సంపాదించిన డబ్బుతో వెంకన్న తన స్వగ్రామంలో ఓ ఇల్లు నిర్మించడంతో పాటు ఉప్పల్‌లో ఓ ప్లాట్‌ కొనుగోలుకు అడ్వాన్స్‌ చెల్లించాడు. రెండు సూపర్‌ మార్కెట్లలో, వైన్స్‌దందాలో కూడా పెట్టుబడులు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular