HomeతెలంగాణCongress Leaders : జనమే గంగా ప్రవాహం.. అందుకే జనం దగ్గరికి కాంగ్రెస్ నేతలు!

Congress Leaders : జనమే గంగా ప్రవాహం.. అందుకే జనం దగ్గరికి కాంగ్రెస్ నేతలు!

Congress Leaders : జననేత.. ఈ పదం వినగానే తెలుగు ప్రజలందరికీ గుర్తకు వచ్చేది దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖరరెడ్డి. అంతటా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు వైఎస్సార్‌. ఇక రాజకీయ నేతల పాదయాత్ర కూడా బహుషా ఆయనతోనే మొదలైందనుకుంటా. అప్పటి వరకూ ఏ నేత చేయని సాహసం చేశారు వైఎస్సార్‌. పదేళ్లు అధికారానికి దూరమై పూర్తిగా చతికిలబడిన పార్టీకి జవసత్వాలు తేవడానికి ఆయన తీసుకున్న నిర్ణయం అటు వైఎస్సార్‌ను జననేతను చేసింది. కాంగ్రెస్‌ను రెండుసార్లు అధికారంలోకి తీసుకురాలగిలింది. దీని తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలో మారిపోయాయి. తమ వద్దకు వచ్చిన నేతనే జనం ఆదరిస్తున్నారు. 2014 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న నారా చంద్రబానాయుడు పాదయాత్ర చేశారు. ఫలితంగా టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2018 కి ముందు విపక్ష నేతగా ఉన్న వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి కూడా పాదయాత్రతో జనం మధ్యకు వెళ్లారు. జనం ఆయనను గుండెల్లో పెట్టుకున్నారు.
తాజాగా భట్టి విక్రమార్క.. 
ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిస్థితులు చూస్తుటే 2004కు ముందు కాంగ్రెస్‌ పరిస్థితిని మళ్లీ కనిపిస్తుంది. దాదాపు పదేళ్లుగా కాంగ్రెస్‌ అధికారానికి దూరమైంది. తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చినా పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. ఈ పరిస్థితిలో సీనియర్‌ నేతలు 2004 ముందు పరిస్థితే ప్రస్తుతం పార్టీలో కనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ జనంలోకే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ‘గంగా నది ఎంతో పవిత్రమైనది… అది మన దగ్గరకు రాదు. వేల మైళ్లు ప్రయాణించి అయినా మనమే గంగ దగ్గరికి వెళ్లాలి’ అన్నట్లు ప్రజాస్వామ్యంలో జనమే… గంగా ప్రవాహం లాంటి వారని కాంగ్రెస్‌ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. రేవంత్‌ యాద్ర కొన్ని రోజులకు ఆగిపోయినా.. భట్టియాత్ర వెయ్యి కిలోమీట్ల మైలురాయిని దాటింది.
వైఎస్సార్‌ను తలపించేలా.. 
‘జనం మధ్యలో జన నేత’ అంటే పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా తెలుగు వారందరికీ వైఎస్‌.రాజశేఖరరెడ్డి కళ్ల ముందు కదలాడతారు! తలపై పాగా, తెల్లటి పంచె, స్వచ్ఛతలో ఒక దానితో ఒకటి పోటీ పడే ఆయన లాల్చీ, చిరు నవ్వులు… మనల్ని గతంలోకి తీసుకు వెళ్లిపోతాయి. అదుగో.. ఆ రాజన్న ఇప్పుడు పేదలు, బడుగు, బలహీనవర్గాల వారికి మరోసారి గుర్తుకు వస్తున్నారు. తమని ఆదుకునే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందని వాళ్ల కళ్లలో ఆశలు మిలమిల మెరుస్తున్నాయి. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత భట్టి విక్రమార్క ‘పీపుల్స్‌ మార్చ్‌’ అంటూ పోరుబాట పట్టిన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతంలో ఎర్రటి ఎండల్లోనూ జనం మధ్య, జనంతో మమేకం అవుతున్నారు. మార్చిలో ప్రారంభమైన భట్టి పాదయాత్ర దివంగత రాజశేఖరరెడ్డిని జనానికి తలపిస్తూ ముందుకు సాగుతోంది. వైఎస్సార్‌లాగే పంచెకట్టుతో, భరోసా ఇచ్చే చిరు నవ్వుతో, రైతుల్లో రైతుగా మారిపోయి… సామన్యుల్లో సామాన్యుడై… మన తెలంగాణ భూమి పుత్రుడు అడుగులు వేస్తున్నారు. జనం ఆయనతో తమ కష్ట, నష్టాలు చెప్పుకుంటూ రాబోయే కాంగ్రెస్‌ ప్రభుత్వం కోసం కంకణాలు కట్టుకుంటున్నారు. హస్తానికే తమ ఓటు అంటూ ప్రతిజ్ఞలు చేస్తున్నారు.
వైఎస్సార్‌ తరహా పాలనకు హామీ.. 
వైఎస్సార్‌ను తలపించే రూపం, హావభావాలు మాత్రమే కాదు… భట్టి విక్రమార్క మరో మారు రాజన్న రాజ్యాన్ని కాంగ్రెస్‌ మార్కు పథకాలు, పాలనతో తాను తీసుకు వస్తానని సూటిగా, స్పష్టంగా చెబుతున్నారు. పేదల గోడు వినని ప్రస్తుత దొరల పాలనకు తమ ప్రభుత్వం పూర్తి భిన్నంగా ఉంటుందని ఆయన ప్రకటించారు. ప్రగతి భవన్, ఫామ్‌ హౌజ్‌ ల్లోనే తొమ్మిదేళ్లు గడిపేసిన కేసీఆర్‌ తన రాజ ప్రాసాదాల్లోకి కామన్‌ మ్యాన్‌కు నో ఎంట్రీ అనేశాడు. సచివాలయంలోకి కూడా సామాన్యుడు రాకుండా పోలీసుల్ని కాపాలా పెట్టేశాడు. కాంగ్రెస్‌ వస్తే రాజశేఖరరెడ్డి హయాంలో మాదిరిగా ప్రజాదర్భార్, రచ్చబండ కార్యక్రమాలు పునః ప్రారంభం అవుతాయని భట్టి చెబుతున్నారు. జనం సీఎం వద్దకు రావచ్చని… సీఎం జనం వద్దకు వచ్చి తీరుతాడని యాత్రలో ఆయన ప్రజలకు హామీ ఇస్తున్నారు. రాబోయే ఖచ్చితంగా… పేదలకు, సామాన్యులకు ఆపన్న ’హస్తం’ అందించే… రాజన్న రాజ్యమే అని ధీమాగా చెబుతున్నారు.
Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular