Telangana Police : తమ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణలోని స్పెషల్ పోలీసుల కుటుంబాలు ఆందోళన చేస్తున్నాయి. భార్యలు, పిల్లలు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నాయి. రాస్తారోకో చేస్తున్నాయి. అయితే ఈ ఆందోళనల వెనుక పోలీసులు ఉన్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. పోలీస్ అంటే క్రమశిక్షణకు మారుపేరు. ఎవరైనా ఆందోళన చేస్తే.. వారిని నియంత్రిస్తారు. కానీ, స్పెషల్ పోలీసులు ఆందోళనను ప్రోత్సహించడాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. క్రమ శిక్షణ ఉల్లంఘించారనే అభియోగాలతో పది మంది టీజీపీఎస్సీ పోలీసులను డిస్మిస్ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అంశం రాష్ట్రంలో కలకలం రేపింది. మరోవైపు మరికొందరిపైనా వేటు పడతుందన్న ప్రచారం జరుగుతోంది.
నిబంధనలు అతిక్రమించారని…
సమస్యల పరిష్కారం కోసం పోలీసుల కుటుంబాలు నిరసనలు, ఆందోళనల పేరుతో పోలీస్ శాఖ నిబంధనలు అతిక్రమించిందని ఉన్నతాధికారులు భావించారు. దీంతో రెండు రోజుల క్రితం 30 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసింది. తాజాగా ఏఆర్ ఎస్సై, హెడ్ కారిస్టేబుల్ సహా 10 మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకే రాష్ట్రం, ఒకే పోలీస్ నిబంధనల పేరుతో ఆందోళన నిర్వహించిన పోలీసులై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీస్ విభాగంలో ఉద్యోగులకు సెలవులతోపాటు ఇతర అంశాలకు సంబంధించిన విధి విధానాలపై అడిషనల్ డీజీపీ ఇటీవల జారీ చేసిన సర్క్యూలర్‌ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీజీపీఎస్పీ బెటాలియన్ల సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు నిరసనకు దిగిన విషయం తెలిసిందే. ఆర్డర్లీ వ్యవస్థ రద్దు చేయాలని సెలవులు ఇవ్వడం, ఇతర సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలిపారు.
డిస్మిస్ అయిన వారి వీరే..
ఉద్యోగాల నుంచి తొలగించిన పోలీసుల్లో ఇబ్రహీంపట్నంలోని 3వ బెటాలియన్ కానిస్టేబుల్ జి.రవికుమార్, భద్రాద్రి కొత్తగూడెంలోని ఆరో బెటాలియన్ కానిస్టేబుల్ కె.భూషణరావు, అన్నెపర్తి 12వ బెటాలియన్‌లోని హెడ్‌కారిస్టేబుల్ వి.రామకృష్ణ, కానిస్టేబుల్ ఎస్‌కే.రఫీ, సిరిసిల్ల 17వ బెటాలియన్‌లోని ఏఆర్ ఎస్సై సాయిరామ్, కానిస్టేబుళ్లు కె.లక్ష్మీనారాయణ, ఎస్.కరుణాకర్‌రెడ్డి, టి.వంశీ, బి.అశోక్, ఆర్.శ్రీనివాస్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
చర్చనీయాంశంగా ఉత్తర్వులు..
ఇదిలా ఉంటే.. పోలీస్ శాకలోఆర్డర్లీ వ్యవస్థపై ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి. పేరుకు పోలీస్ ఉద్యోగాలే అయినా స్పెషల్ పోలీస్ బలగాల సిబ్బందిని కట్టు బానిసలకన్నా హీనంగా సొంత పనులకు వాడుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆర్డర్లీ పేరుతో సీఐలు మొదలుకుని డీజీపీల వరకు తమ సొంత పనులకే వడుకుంటున్నారన్న ఆరోపణలు ఉఆన్నియ. సేవల కోసం సాటి పోలీస్ సిబ్బందిని నిర్ధాక్షణ్యంగా సొంత పనులు చేయించుకుంటున్నారనే ఆరోపణులు ఉన్నాయి. శాంతిభద్రతల పరిరక్షణ, అదనపు సిబ్బంది అవసరమైన సమయాల్లో వాడుకోవడానికి యూనిఫాం సిబ్బంది సేవలను వాడుకోవాలి. కానీ ఇళ్లలో పాచిపనులు చేయడం, గార్డెనింగ్ చేయడం, వంటపని, అధికారుల పిల్లలను ఆడించడం, స్కూళ్లక తీసుకెల్లడం డ్రైవింగ్ వంటి పనులు చేయిస్తున్నారు. ఈ క్రమంలో వ్యక్తిగత స్వేచ్ఛ, కుటంబాలను కూడా దూరం చేస్తున్నారు. దీంతో కిందిస్థాయి సిబ్బందిలో అసంతృప్తి ఉంది. ఈ క్రమంలో ఇటీవల సెలవులతోపాటు విధుల నిర్వహణపై జారీ చేసిన ఉత్తర్వులు సిబ్బంది ఆందోళన పెంచాయి. తాజాగా ఆందోళనకు బాధ్యులను చేస్తూ 10 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు.