Homeఆధ్యాత్మికంSamba Shiva Temple: 1200 ఏళ్ల నాటి సాంబ శివాలయం.. ఈ ఆలయం గురించి తెలిస్తే...

Samba Shiva Temple: 1200 ఏళ్ల నాటి సాంబ శివాలయం.. ఈ ఆలయం గురించి తెలిస్తే చేతులెత్తి మొక్కుతారు..

Samba Shiva Temple:  భారతదేశంలో ప్రాచీన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని ఆలయాలు ఎవరు? ఎప్పుడు నిర్మించారో తెలియని పరిస్థితి. కానీ అవి ఇప్పటికీ ప్రముఖ ఆలయాలుగా కొనసాగుతున్నాయి. అయితే చరిత్రకారులు ఎప్పటికప్పుడు పరిశోధనలు చేసి ఆలయాల చరిత్రను బయటపెడుతున్నారు. ఇలా వీరు చేసిన పరిశోధనలు చూస్తే షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకంటే కొన్ని ఆలయాలు వెయ్యేళ్ల కిందట నిర్మించినట్లు కొన్ని శాసనాల ద్వారా తెలుస్తోంది. మరికొన్ని ఆలయాల నిర్మాణ తీరు, కట్టడ శైలిని బట్టి అవి ఎప్పుడు నిర్మించారో బయటపెడుతున్నారు. ఇలాంటి ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో ఉంది. ఈ ఆలయం పురాతమైనది మాత్రమే కాకుండా ఇక్కడ కొలువైన శివుడు భక్తులు ఎటువంటి కోరిక కోరినా నెరవేరుస్తున్నాడని స్థానికులు అంటున్నారు. దీనిని వెయ్యేళ్ల కిందట నిర్మించగా ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంటోంది. దీనిని పునర్నిర్మిస్తున్నారు. అయితే ఈ ఆలయ చరిత్రలోకి వెళితే..

తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలోని కొలనుపాక గ్రామంలో ఉన్న సాంబశివాలయం అతి పురాతన క్షేత్రంగా చెప్పవచ్చు. ఇది సాధారణ శివాలయం కాదని, ఇక్కడికి భక్తులు వచ్చి ఎటువంటి కోరికలు కోరినా ఆ శివుడు అనుగ్రహిస్తాడని భక్తులు నమ్ముతారు. అయితే ఈ ఆలయానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది. దీనిని దాదాపు 1200 ఏళ్ల కింద కాకతీయులు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఆ కాలంలో రాజకీయ, మతపరమైన కేంద్రంగా ఉండేందుకు దీనిని నిర్మించారని తెలుస్తోంది. ఈ ఆలయం పక్కను నూరు కొలనులు ఉండేవట. అందుకే ఈ గ్రామానికి కొలనూరు అని పేరు వచ్చినట్లు చెబుతున్నారు.

సాధారణంగా ప్రతీ శివాలయంలో లింగంతో సమానంగా పానవట్టం ఉంటుంది. కానీ తెలంగాణలో ఎక్కడా లేని విధంగా ఈ శివాలయంలో అతిపెద్ద పానవట్టాన్ని కలిగి ఉంది. ఈ ఆలయం పురాతనమైనది కావడంతో శిథిలావస్థకు చేరింది. దీంతో ఉప ఆలయంలో శివలింగాన్ని ఉంచి పూజలు నిర్వహిస్తున్నారు. శివుడికి ఒకవైపు అమ్మవారు.. మరోవైపు విఘ్నేశ్వరుడు పూజలు అందుకుంటున్నారు. ప్రతీ అమావాస్య రోజున ఈ ఆలయానికి నాగుపాము వచ్చి శివలింగాన్ని దర్శించుకుంటుందని భక్తులు చెబుతున్నారు. ఏ ఆలయంలోనూ లేని విధంగా ఇక్కడ సప్తమాత్రుక విగ్రహాలు కనిపిస్తాయి. అలాగే పురాతనమైన విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని ఇక్కడ చూడొచ్చు.

పండుగలు, పర్వదినాల్లో సాంబశివాలయంలో పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు. శివుడికి అభిషేకాలు నిర్వహిస్తారు. సంతానం లేని వారు ఉద్యోగం పొందాలని అనుకునేవారు కొలనూరు సాంబశివాలయానికి వచ్చి స్వామివారిని వేడుకుంటే నెరవేరుతుందని భక్తులు నమ్ముతారు. అందుకే ప్రతీ సోమవారం ఇక్కడికి భక్తులు తరలివస్తారు. అయితే తమ కోరికలు నెరవేర్చాలని శివుడి కంటే ముందు నందీశ్వరుడికి చెప్పడం వల్ల వెంటనే తీరిపోతాయని నమ్ముతున్నారు.

కొలనూరు సాంబశివాలయంలో పురాతమైనది కావడంతో శిథిలావస్థకు చేరింది. ఇలాంటి అపురూప కట్టడాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని గ్రహించి ప్రభుత్వం ఇప్పుడు దీనిని పునర్నిర్మిస్తున్నారు. త్వరలోనే కొత్త రకమైన గుడి భక్తులకు అందుబాటులోకి వస్తుందని అంటున్నారు. ఈ ఆలయానికి చేరుకోవాలంటే పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో ఉన్న కొలనూరు సాంబశివాలయానికి చేరుకోవాలంటే కరీంనగర్ నుంచి సుల్తానాబాద్ కు చేరుకోవాలి. అక్కడి నుంచి క్రాస్ చేసి ఓదెల వైపు వెళ్లే మార్గంలో కొలనూరు గ్రామం వస్తుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Dharmendra Pradhan

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Samsung Galaxy S25

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...
Festivals this year

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....
Peddi Sudarshan Reddy

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...
Oktelugu Epaper