Chanakya Niti: భారతీయ వివాహ బంధానికి మంచి గుర్తింపు ఉంది. చాలా పవిత్రంగా భావిస్తారు. హిందూ వివాహ బంధం గురించి చాణక్యుడు తన చాణక్య నీతిలో చాలా విషయాలు చెప్పారు. ఈ క్రమంలో భార్యకు ఉన్న కొన్ని అలవాట్ల కారణంగా భర్త జీవితం ఎలా నాశనం అవుతుందో వివరించాడు.
భార్య అనుకుంటే..
వైవాహిక జీవితంలో అడుగు పెట్టిన స్త్రీ భార్యగా, కోడలిగా కుటుంబానికి వెన్నెముకగా ఉంటుంది. భార్యభర్తల బంధం బాగుంటే కుటుంబం కూడా బాగుటుంది భార్య సత్రపవర్తనతో భర్తలోని చెడు అలవాట్లను కూడా దూరం చేయగలుగుతుంది. వైఫల్యాలను విజయంగా మార్చగలదు. అయితే భార్య ప్రవర్తన వింతగా ఉంటే కుటుంబంలో ప్రతీ ఒక్కరూ దాని పర్యవసానాలు ఎదుర్కొంటారు. భర్త జీవితం కూడా నాశనం అవుతుంది. కుటుంబంలో భార్య పాత్ర సరిగా లేకుంటే చాలా కష్టాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. చాణకుడు చెప్పిన ఆరు అలవాట్లతో కుటుంబం నాశనం అవుతుందని తెలిపాడు. అవేంటో చూద్దాం.
మాటలు అదుపులో లేకపోవడం
చాణక్యనీతి ప్రకారం భార్య తన మాటలను అదుపులో ఉంచుకోవాలి. కఠినమైన పదాలను ఉపయోగిస్తే భర్తకు హాని కలుగుతుంది. అలాంటి స్త్రీలు ఇతరుల భావాలను పట్టించుకోరు. ఇతరులు కూడా మీకు దూరమవుతారు.
అతి కోపం..
కోపం మానవ సమహజం. ఒకరి ప్రవర్తన కోపంగా ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్న వ్యక్తుల జీవితాన్ని కష్టతరం చేస్తారు అందుకే భార్య కోపం తగ్గించుకుంటే కుటుంబం సంతోషంగా ఉంటుంది. కోసం ఎక్కువగా ఉన్న భార్యతో భర్త ఇబ్బందులు ఎదుర్కొంటాడు.
గొడవలు సృష్టించే భార్య
ఇంట్లో గొడవలు సృష్టించే భార్యతో సుఖం ఉండదు. ఇలాంటి భార్య ప్రవర్తన రరిణామాలను తరం అంతా అనుబవించాల్సి ఉంటుంది. అలాంటి స్త్రీతో పిల్లలకు మంచి లక్షణాలు నేర్పించలేదు. కుటుంబాల్లో చీలికలు తెస్తారు. వ్యక్తిగతంగానూ నష్టమే.
అబద్ధాలు చెప్పే భార్య..
కొంతమంది మహిళలు తమ స్వార్థం కోసం అబద్ధాలు చెబుతారు. చాణక్యుడు ఈ అలవాటు ఉన్నవారి నుంచి ఇతరులకూ అలవడుతుంది. కొన్ని పరిస్థితులను నివారించడానికి మహిళలు అబద్ధాలు చెప్పడానికి కూడా వెనుకాడరు. ద్రోహం కూడా చేస్తారు. భర్తకూ అన్యాయం చేస్తారు.
మోసం చేసే స్త్రీలు
కొందరు మహిళలు మోసం చేయడంలోనూ దిట్టగా ఉంటారు. చాణక్యుడి ప్రకారం స్వార్థపూరిత కారణాలతో మోసాలకు పాల్పడతారు. ఇలాంటి వారితో భర్తకు, కుటుంబాలకు సమస్యలు వస్తాయి. జాగ్రత్తగా ఉండాలి.
డబ్బుపై అత్యాశ
ఇక డబ్బుపై అత్యాశ ఉన్న మహిళలతో కూడా భర్తకు ఇబ్బందులు ఎదురవుతాయి. డబ్బు కోసం తప్పుడు దారుల్లో వెళ్లే మహిళలతో భర్తకు ఇబ్బందులు వస్తాయి. కుటుంబ భవిష్యత్ నాశనమవుతుంది.