TG Tet : తెలంగాణ పాఠశాల విద్యా శాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీజీటెట్‌కు సంబంధించిన హాల్ టికెట్లు విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో 2024కు సంబంధించిన హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి.
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీజీ టెట్‌కు సంబంధించిన విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఈమేరకు హాల్‌టికెట్లు గురువారం(డిసెంబర్ 26న) విడుదల చేసింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి. టెట్ పరీక్షలు జనవరి 2 నుంచి ప్రారంభం అవుతాయి. జనవరి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లోనే పరీక్షలు జరుగుతాయి. ఈమేరకు పరీక్షల షెడ్యూల్‌ను ఇప్పటికే విడుదల చేసింది. హాల్‌టికెట్లను డైరెక్ట్ లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పరీక్షల షెడ్యూల్ ఇలా..
విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించిన పరీక్షల షెడ్యూల్ ప్రకారం… 2025, జనవరి 2 నుంచి పరీక్షలు జరుగుతాయి. 8, 9, 10, 18 తేదీల్లో టెట్ పేపర్–1 పరీక్ష నిర్వహిస్తారు. ఇక జనవరి 2, 5, 11, 12, 19, 20 తేదీల్లో టెట్ పేపర్–2 పరీక్ష నిర్వహిస్తారు. రెండు షెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4:30 గంటల వరకు పరీక్ష సమయాలు నిర్ణయించారు. మరోవైపు పరీక్షల సిలబస్‌ను కూడా విద్యాశాఖ ఇప్పటికే విడుదల చేసింది.
టీజీటెట్ పేపర్–1
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్–1 ఐదు విభాగాల్లో 150 ప్రశ్నలు ఉంటాయి. 150 మార్కులకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాలి(30 మార్కులు), లాంగ్వేజ్–1 (30 మార్కులు), లాంగ్వేజ్–2 (30 మార్కులు, మ్యాథమెటిక్స్(30 మార్కులు), ఎన్విరాన్‌మెంట్ స్టడీస్(30 మార్కులు) ప్రశ్నలు ఉంటాయి. ప్రతీ విభాగంలో ఆరు ప్రశ్నలు పెడగాగి నుంచి ఉంటాయి.
టీజీటెట్–2
తెలంగాణ టెట్ పేపర్–2 కూడా నాలుగు విభాగాల్లో 150 ప్రశ్నలు ఉంటాయి. ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఈ పేపర్ పూర్తిగా మల్టీపుల్ ప్రశ్నలు ఉంటాయి. ఇందులో చైల్డ్ పెడగాలి 30 మార్కులు, లాంగ్వేజ్–1 30 మార్కులు, లాంగ్వేజ్–2(ఇంగ్లిష్) 30 మార్కులు, సంబంధిత సబ్జెక్ట్ 60 మార్కులు, ఉంటాయి.
అర్హత మార్కులు ఇలా..
రెండు పేపర్లుగా నిర్వహించే టెట్ పేపర్–1, పేపర్ – 2లో అభ్యర్థులు తప్పనిసరిగా కనీస అర్మత మార్కులు సాదించాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులు అయితే 60 శాతం మార్కులు సాధించాలి బీసీ కేటగిరీ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 40 శాతం మార్కులు సాదిస్తే సరిపోతుంది.
హాల్ టికెట్ డౌన్‌లోడ్ ఇలా..
స్టెప్–1 : అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి, అనగా tgtet2024.aptonline.in.
స్టెప్–2:: హోమ్‌పేజీలో, ’హాల్ టిక్కెట్ డౌన్‌లోడ్’ అని ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్– 3: స్క్రీన్‌పై కొత్త పేజీ కనిపిస్తుంది.
స్టెప్– 4: అడిగిన ఆధారాలను నమోదు చేసి, సమర్పించుపై క్లిక్ చేయండి.
స్టెప్›– 5: టీజీటెట్ 2024 హాల్ టిక్కెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
స్టెప్–6: మీ హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి మరియు భవిష్యత్తు సూచన కోసం దాని ప్రింటవుట్ తీసుకోండి.