Woman Cheating : సాధారణంగా మగాళ్ళకు మద పిచ్చి ఉంటుంది అంటారు. ఆడవాళ్ళు కనిపిస్తే చాలు అనుభవించాలనే కోరిక వారిని భూమ్మీద నిలబడనీయకుండా చేస్తుంది అంటారు . ఇటువంటి వారి వల్లే ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతుంటాయి. ఇప్పుడు మీరు చదవబోయే కథనం మాత్రం పూర్తి డిఫరెంట్.
ఆమెది ఉమ్మడి నల్గొండ జిల్లా. గతంలోనే వివాహం జరిగింది.. వివాహం జరిగిన తొలి రోజుల్లో భర్తతో బాగానే ఉండేది. ఆ తర్వాతే ఆమె వలపు వలలు విసరడం మొదలుపెట్టింది. చాలా మందితో సన్నిహిత సంబంధాలను పెట్టుకుంది.. ఈ విషయం మొదటి భర్తకు తెలియడంతో ఆమెకు విడాకులు ఇచ్చాడు.
మొదటి భర్త విడాకులు ఇవ్వడంతో కొద్దిరోజుల వరకు ఆమె బయటికి రాలేదు.. ఆ తర్వాత సూర్యాపేట జిల్లా పరిధిలో పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు దగ్గర అయింది.. అతడిని రెండవ పెళ్లి చేసుకుంది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ను చేస్తున్నప్పటికీ సదరు లేడి కామ క్రోదాన్ని అణుచుకోలేకపోయింది. చివరికి సంత పనుల కోసం వచ్చే కారు డ్రైవర్ ను కూడా మభ్యపెట్టి.. అతని వద్ద లక్షలు కాజేసిందంటే.. ఆమె కోరికలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. డ్రైవర్ తోని ఆమె ఆగిపోలేదు. చాలామంది రాజకీయ నాయకులు, పోలీసు అధికారులపై వలపు వల విసిరింది ఆ లేడి. వారితో సన్నిహితంగా ఉంటూనే ఆ దృశ్యాలను రహస్యంగా వీడియో తీసేది. ఆ వీడియోలను బయటపెడతానని వారిని బెదిరించేది. ఈ లేడి ట్రాప్ లో ఎంతో మంది రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు పడ్డారు. లక్షలకు లక్షలు కోల్పోయారు..
ఇప్పటికే ఈ మహిళపై రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎనిమిది కేసులు నమోదయ్యాయి. ఈవిడ గారి వ్యవహార శైలి చూసి.. సదరు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ దూరం పెట్టాడు. ఈ కి లేడిని హయత్ నగర్ పోలీస్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
లక్షలకు లక్షల కొట్టేసిన ఈ కి లేడి భారీగా ఆస్తులు సంపాదించినట్టు సమాచారం. ఒక పకడ్బందీ ప్రణాళికతోనే ఆమె ఈ వలపు వల విసిరినట్టు తెలుస్తోంది.. ఈమె చేతిలో మోసపోయిన చాలా మంది రాజకీయ నాయకులు హయత్ నగర్ పోలీసులను ఆశ్రయిస్తున్నట్టు సమాచారం. ఆమె వద్ద నుంచి పోలీసులు కొన్ని కీలక వీడియోలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.