https://oktelugu.com/

Republic Day 2024: రిపబ్లిక్‌డే వేడుకల్లో తెలంగాణ శకటం.. పేరు తెలుసా?

రిపబ్లిక్‌డే వేడుకల్లో పాల్గొనే తెలంగాణ శకటానికి ప్రజాకవి అందెశ్రీ రాసిన పాట జయ జయమే తెలంగాణ పేరు పెట్టారు. ఈ పాట తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలకంగా మారింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : January 25, 2024 / 06:16 PM IST

    Republic Day 2024

    Follow us on

    Republic Day 2024: ఢిల్లీలో జనవరి 26న నిర్వహించే రిపబ్లిక్‌డే వేడుకలకు ఈసారి కేంద్రం తెలంగాణ శకటానికి అవకాశం ఇచ్చింది. ఈ శకటానికి మూడు నెలల ముందే కేంద్రం అనుమతి ఇస్తుంది. కానీ మొన్నటి వరకు అధికారంలో ఉన్న కేసీఆర్‌ ప్రభుత్వం తెలంగాణ శకటాన్ని పంపించలేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ శకటం పంపేందుకు ముందుకు వచ్చినా అప్పటికే గడువు ముగిసిందని కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో ఢిల్లీ వెళ్లిన రేవంత్‌రెడ్డి, ప్రధానిని కలిసి ప్రత్యేక అనుమతి కోరాడు. దీంతో తెలంగాణ శకటానికి రిపబ్లిక్‌డే పరేడ్‌లో అవకాశం దక్కింది.

    పేరు ప్రత్యేకం..
    ఇక రిపబ్లిక్‌డే వేడుకల్లో పాల్గొనే తెలంగాణ శకటానికి ప్రజాకవి అందెశ్రీ రాసిన పాట జయ జయమే తెలంగాణ పేరు పెట్టారు. ఈ పాట తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలకంగా మారింది. తాజాగా అదే పేరును రేవంత్‌రెడ్డి సూచన మేరకు తెలంగాణ శకటానికి పెట్టారు. ఈ శకటంపై కుమురంభీం, చాకలి ఐలమ్మ, రాంజీగోండ్‌ వంటి పోరాట యోధుల విగ్రహాలను ఉంచారు.

    ఢిల్లీలో రిహార్సల్స్‌..
    తెలంగాణ తరఫున రిపబ్లిడ్‌ డే వేడుకల్లో ప్రదర్శించే తెలంగాణ శకటం ఇప్పటికే ఢిల్లీలో రిహార్సల్స్‌లో పాల్గొటోంది. నాలుగు ఏళ్ల తర్వాత తెలంగాణ శకటం ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో పాల్గొడం గమనార్హం. కేసీఆర్‌కు కేంద్రంలోని బీజేపీతో ఏర్పడిన విభేదాలతో తెలంగాణ శకటం పంపించడం మానేశారు. ప్రభుత్వం మారడంతో మళ్లీ అవకాశం దక్కింది.

    చివరిసారి 2020లో
    తెలంగాణ రాష్ట్రం 2014 జూన్‌ 2న ఏర్పడింది. దీంతో 2015 జనవరి 26న రిపబ్లిక్‌డే సందర్భంగా తెలంగాణ తరఫున శకటం కర్తవ్యపథ్ (అప్పటి రాజ్‌పథ్)పై మెరిసింది. బోనాల థీమ్‌తో ఈ శకటాన్ని ప్రదర్శించి తెలంగాణ ప్రత్యేకతను దేశం నలుమూలలా చాటారు. తర్వాత 2020లో మరోసారి శకటాన్ని ప్రదర్శించే అవకాశం రాష్ట్రానికి దక్కింది. అప్పుడు బతుకమ్మ, వేయి స్తంభాల గుడి, మేడారం సమక్క–సారలమ్మ జాతర రూపకంతో శకటాన్ని ప్రదర్శించారు.