Sarpanch turns into a bear: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. అధికార కాంగ్రెస్ పల్లె ఓటర్లు పట్టం కట్టారు. ఇక స్వతంత్రులు భారీగా విజయం సాధించారు. ఈ ఎన్నికలు గుర్తులు, పార్టీలతో సంబంధం లేకపోయినా పార్టీల మద్దతు ప్రభావం చూపింది. అధికారంలో ఉండడం కాంగ్రెస్ మద్దతు దారులకు కలిసి వచ్చింది. ఇక ఈ ఎన్నికల్లో స్థానిక సమ్యలపై అభ్యర్థులు ఇచ్చిన హామీలు గెలిపించాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సర్పంచులు అయ్యాక నెరవేరుస్తున్నారు. ఇటీవల సిరిసిల్ల జిల్లాల ఓ సర్పంచ్ కోతులను పట్టేవారిని తీసుకువచ్చి.. ఊళ్లో కోతులు లేకుండా చేశారు. తాజాగా నిర్మల్ జిల్లా సర్పంచ్ కోతులను రతిమేందుకు కొత్త ఉపాయం ఆలోచించాడు.
ఎలుగుబంటి వేషంలో..
నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామంలో కోతుల సమస్యకు తాత్కాలిక పరిష్కారం కనుగొన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఇటీవల ఎన్నికైన యువ సర్పంచ్ కుమ్మరి రంజిత్, గ్రామీణ ప్రాంతంలోని పంటలను కాపాడేందుకు సృజనాత్మక ఉపాయం ఆలోచించాడు. గ్రామసుతల సురక్ష లక్ష్యంగా, తనను తాను ఎలుగుంబంటిగా మార్చుకున్నాడు. ఎలుగుబంటిగా దుస్తులు మార్చుకుని కోతులను తరిమేస్తున్నాడు.
భయంతో పారిపోతున్న మర్కటాలు..
ఎలుగుబంటి రూపం చూడగానే కోతులు భయపడి పరిగెత్తాయి. ఈ చిన్న ప్రయత్నంతో గ్రామంలోని పొలాలు తాత్కాలికంగా సురక్షితమయ్యాయి. రంజిత్ చేతిచేతి పట్టుదలను చూసి గ్రామస్థులు ఆనందంగా మెచ్చుకున్నారు. ఇలాంటి స్థానిక విధానాలు గ్రామీణ సమస్యలకు మరిన్ని సొల్యూషన్లను ప్రేరేపిస్తాయని అందరూ భావిస్తున్నారు.
గ్రామం నుండి కోతులను తరిమికొట్టేందుకు ఎలుగుబంటి వేషం వేసిన కొత్త సర్పంచ్
నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామంలో కోతుల బెడద నుండి తప్పించేందుకు బీఆర్‌ఎస్ పార్టీ నుండి కొత్తగా ఎన్నికైన యువ సర్పంచ్ కుమ్మరి రంజిత్ విన్నూత్న ప్రయత్నం
ఎలుగుబంటి కనిపించడంతో పరారైన కోతులు.. యువ… pic.twitter.com/Pf6yBNUOf1
— Telugu Scribe (@TeluguScribe) December 19, 2025