Telangana Panchayat Elections: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా అనే విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీసీ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తయిన తరువాత మాత్రమే ఎన్నికలు నిర్వహించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ర్ట ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ కు సంబంధించి శాశనసభలో బిల్లు పాస్ చేసి, పార్లమెంట్ ఆమోదంకు పంపింది. పార్లమెంట్ బిల్లు ఆమోదించిన తదుపరి రాష్ట్రపతి ఆమోద ముద్ర పడిన తరువాత తప్ప రిజర్వేషన్ అమలులోకి రావడం కష్టమే. అయితే ఈ విషయంలో కేంద్రంలో బీజేపీ కూటమి ఈ బిల్లును యధాతథంగా ఆమోదించేందుకు ఒప్పుకుంటారా లేక సవరించేందుకు సూచిస్తూ, పెండింగ్ లో పెడుతారా అనేది రాజకీయంగా కొంత చర్చకు తావిస్తోంది. అయితే ఈ పరిస్తితుల్లో స్థానిక ఎన్నికలకు రిజర్వేషన్ అమలయ్యేందుకు వీలుగా రాష్ర్ట ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది.
సెప్టెంబర్ లో సర్పంచ్ ఎన్నికలు
తెలంగాణలో సర్పంచుల పదవీకాలం ముగిసి ఏడాది అయ్యింది. పంచాయతీలో పాలకవర్గాలు లేక పాలనావ్యవస్థపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. ఈ విషయమై హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం వేయడంతో, స్పందించిన హైకోర్టు పంచాయతీ ఎన్నికలు సెప్టెంబర్ 30 లోగా నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. అయితే పంచాయతీ ఎన్నికలు వెళితే ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ మద్దతుపై పోటీ చేసే అభ్యర్థుల గెలుపోటములపై ఇప్పటికే పార్టీ ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తీరుపై అంతర్గతంగా ప్రజల అభిప్రాయ సేకరణకు వివిధ రకాల పద్దతులను ఎంచుకుంటున్నారు. ప్రజలు ఏ విషయంలో తమకు మద్దతు పలుకవచ్చు. ఏ విషయాలపై అసంత్రుప్తి ఉంది.
Also Read: Kavitha KCR Rift: అన్నయ్య? నాన్న? కవిత వెనక ఉన్నది ఎవ్వరు?
ప్రభుత్వ పథకాలు ఓట్లను కుమ్మరిస్తాయా.?
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా ప్రయోజనాల పథకాలు ఏ మేరకు ఓట్లు కురిపిస్తాయి అనే విషయాలపై అను ప్రభుత్వ పెద్దలు, ఇటు పార్టీ పెద్దలు తర్జన భర్జనలు చేస్తున్నారు. సరైన సమయంలో ఎన్నికలకు వెళ్లాలని, ఆ సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికలు ప్రభుత్వ పనితీరుపై ప్రజల సుస్పష్టంగా ఇచ్చే అభిప్రాయం. ఈ ఎన్నికలలో గెలుపు, ఓటములు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో పాటు స్థానిక నాయకులు ప్రజలతో వ్యవహరించే తీరు కూడా ప్రభావం చూపుతుంది. అందుకే బూత్ స్థాయి నుంచి మండల, నియోజకవర్గ స్థాయి వరకు పటిష్టమైన నాయకత్వం ఉండేలా చూసుకుంటున్నట్లు, ప్రత్యేకంగా ఇన్చార్జిలను ఏర్పాటు చేసి పరిశీలిస్తున్నారు. గ్రామాల్లో ప్రాతినిధ్యం వహించే వార్డు సభ్యుల నుంచి మండల స్థాయి వరకు నాయకులలో ప్రజామోదం ఉన్న వారికి మాత్రమే మద్దతు ఇచ్చి గెలిపించాలని భావిస్తున్నారు.
అందరికీ పరీక్షే..
అయితే పంచాయతీ ఎన్నికలను రాష్ర్టంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తో పాటు, అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి చవిచూసి ప్రభుత్వం కోల్పోయి, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేక పోయిన బీఆర్ఎస్ కనీసం స్థానిక ఎన్నికల్లోనైనా తమ ప్రభావం చూపించాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే వరుసగా అధినాయకత్వంలో పెద్దలు పలు విచారణలు ఎదుర్కొంటున్న ఈ సమయంలో పార్టీ పరువు కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పార్లమెంట్ లో 8 స్థానాలు గెలుపొందిన బీజేపీ సైతం వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని అంతర్గతంగా కింది క్యాడర్ కు సూచిస్తున్నా అభ్యర్థుల ఎంపిక కసరత్తు మాత్రం అన్ని పార్టీలలో కొనసాగుతునే ఉంది.