Homeటాప్ స్టోరీస్Telangana Municipal Elections Results 2026: అది తెలంగాణ అంటే.. ఇతర రాష్ట్రాలకు ఓ దారి...

Telangana Municipal Elections Results 2026: అది తెలంగాణ అంటే.. ఇతర రాష్ట్రాలకు ఓ దారి దీపం!

Telangana Municipal Elections Results 2026: ఆమధ్య మహా రాష్ట్ర లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ విజయం సాధించింది. దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది. ఈ విజయాన్ని అక్కడి అధికార పార్టీ గొప్పగా చెప్పుకుంది.

ఇక కేరళ రాష్ట్రంలో కూడా జరిగిన స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి షాక్ తగిలింది. చాలావరకు స్థానాలలో అక్కడి ప్రతిపక్షం విజయం సాధించింది. కొన్ని ప్రాంతాలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు సత్తా చూపించారు.

ఈ రెండు ఉదాహరణలు చాలు స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరిగాయో చెప్పడానికి. ప్రజలు అయితేనేమో అధికార పక్షానికి లేకుంటేనేమో ప్రతిపక్షానికి ఓట్లు వేస్తున్నారు. తమ ఆగ్రహాన్ని ఏకపక్షమైన తీర్పుగా బ్యాలెట్ బాక్స్ లో వేస్తున్నారు.

కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ప్రజలు ప్రజాస్వామ్యాన్ని మాత్రమే కోరుకుంటున్నారు. దీనికి ప్రభుత్వం కూడా తోడు కావడంతో పరిస్థితి చాలా వరకు ఆశాజనకంగా కనిపిస్తోంది. ఉదాహరణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షమైన ఫలితాలు రాలేదు. అలాగని భారత రాష్ట్ర సమితి దారుణంగా ఓడిపోలేదు. చివరికి భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ సత్తా చూపించ గలిగింది. కేవలం ఉమ్మడి పాలమూరు జిల్లా మాత్రమే కాదు.. దాదాపు తెలంగాణ వ్యాప్తంగా కూడా పరిస్థితి ఇలానే ఉంది.

ఏ జిల్లాలో కూడా ఏకపక్షమైన ఫలితాలు అధికార పార్టీకి రాలేదు. అలాగని ప్రతిపక్షానికి ప్రజలు గంప గుత్తగా జై కొట్టలేదు. అధికార పక్షాన్ని గౌరవించారు. ప్రతిపక్షాన్ని భుజం తట్టి నిలబెట్టారు. ఎక్కడ కూడా ఏకపక్షమైన ఫలితాన్ని ఓటర్లు అందించలేదు. అలాగని ప్రతిపక్షాలను చిన్నచూపు చూడలేదు…

తెలంగాణ రాష్ట్రంలో సామాజిక చైతన్యం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ప్రజలు ఎవరిని కూడా భుజాల మీదకి ఎత్తుకొని మోయలేరు. అలాగని కింద కూడా పడేయలేరు. సాధ్యమైనంత వరకు సముచితమైన స్థాయిలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అనేక ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు దీనిని నిరూపించారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా బలంగా చాటారు. కేరళ రాష్ట్రంలో అత్యధికంగా అక్షరాస్యత ఉంటుంది. మహారాష్ట్రలో ప్రజలకు ఆర్థిక స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ రెండు రాష్ట్రాల ప్రజలను మించి తెలంగాణ ప్రజలు వ్యవహరించారు. తమకు తామే సాటి అని నిరూపించుకున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular