Inter Supplementary Results 2025: తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు (TSBIE) 2025 జూన్ 16న మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్లైనtsbie.cgg.gov.in results.cgg.gov.in లో అందుబాటులో ఉంచింది.
ఫలితాల తనిఖీ విధానం
విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా ఫలితాలను ఆన్‌లైన్‌లో చూడవచ్చు. అలాగే, manabadi.co.in వంటి థర్డ్–పార్టీ వెబ్‌సైట్లలో కూడా ఫలితాలు అందుబాటులో ఉంటాయి. ఆన్‌లైన్‌లో అందించిన మార్కులు తాత్కాలికమైనవి కాగా, అసలు మార్కుల మెమోను విద్యార్థులు తమ స్కూళ్ల నుంచి సేకరించాలి.
పరీక్షల షెడ్యూల్
సప్లిమెంటరీ పరీక్షలు 2025 మే 22 నుంచి మే 29 వరకు నిర్వహించారు. మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండవ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరిగాయి.
ముఖ్య సూచనలు
ఫలితాల్లో ఏవైనా తప్పులు ఉంటే, విద్యార్థులు తమ స్కూల్ అధికారులను లేదా TSBIEని సంప్రదించాలి. ఫలితాల సేకరణ, ధ్రువీకరణ కోసం అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే ఆశ్రయించాలని సూచించబడింది.