https://oktelugu.com/

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త.. 50 శాతం ఛాయిస్..?

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్ ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో విద్యాశాఖ వార్షిక పరీక్షల ప్రశ్నపత్రాల్లో ఛాయిస్ లను భారీగా పెంచనుంది. ఇంటర్ బోర్డ్ ప్రభుత్వ అమోదం కొరకు ఈ మేరకు ప్రతిపాదనలను పంపింది. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంటర్ బోర్డ్ అధికారులు విద్యార్థులకు కరోనా విజృంభణ నేపథ్యంలో కొంత […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 27, 2021 / 01:25 PM IST
    Follow us on

    తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్ ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో విద్యాశాఖ వార్షిక పరీక్షల ప్రశ్నపత్రాల్లో ఛాయిస్ లను భారీగా పెంచనుంది. ఇంటర్ బోర్డ్ ప్రభుత్వ అమోదం కొరకు ఈ మేరకు ప్రతిపాదనలను పంపింది. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

    ఇంటర్ బోర్డ్ అధికారులు విద్యార్థులకు కరోనా విజృంభణ నేపథ్యంలో కొంత వెసులుబాటు ఇవ్వాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో ప్రతి దాంట్లో ఉన్న మూడు సెక్షన్లలో రెండు సెక్షన్లలో ఛాయిస్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ప్రశ్నలలో సగం ప్రశ్నలకే జవాబులు రాయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు రెండు లేదా మూడు ప్రశ్నలు మాత్రమే ఛాయిస్ ఉంటాయి.

    మరోవైపు విద్యార్థులకు ఆన్ లైన్ బోధన జరగడం వల్ల మానసిక ఒత్తిడి పడే అవకాశం ఉండటంతో ఇంటర్ బోర్డ్ మానసిక ఒత్తిడిని తట్టుకునేందుకు తరగతులను నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అన్ లైన్ ద్వారా స్ట్రెస్ మేనేజ్ మెంట్ గురించి ఐదారు తరగతులను ఇంటర్ బోర్డ్ నిర్వహించనుందని తెలుస్తోంది. ఇంటర్ బోర్డ్ కెరీర్ గైడెన్స్ పై కూడా అవగాహన కల్పించనుందని సమాచారం.

    ఇంటర్ బోర్డ్ విద్యార్థికి ఇష్టమైన రంగంలో రాణించేందుకు అధికారులు సైకోమెట్రిక్ పరీక్ష నిర్వహించలని భావిస్తున్నారు. విద్యార్థులు చెప్పే జవాబులను బట్టి నిపుణులు ఎవరు ఏ రంగంలో ప్రయత్నం చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందో సూచనలు చేస్తారు.