Telangana Heatwave Alert: తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు. మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. దీంతో పగలు పట్టణాల్లో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. జనం బయటకురావడం లేదు. ఉక్కపోత కూడా పెరిగింది. దీంతో కూలర్లు, ఏసీలు, ఫ్యాన్ల వాడకం పెరిగింది. దీంతో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుకుంది. ఇదిలా ఉంటే.. రానునన మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకావం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈనేపథ్యంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
Also Read: ఘనంగా జరిగిన హీరో అల్లు శిరీష్ వివాహం..సినీ ఇండస్ట్రీ నుండి ఎవరెవరు వచ్చారంటే!
సాధారణం కాన్న ఎక్కువ ఉష్ణోగ్రతలు..
ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలలోపే నమోదు కావాలి. కానీ ఐదు రోజులుగా 35 డిగ్రీలకన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో మధ్యాహ్నం వేడి, ఉక్కపోత అధికంగా ఉంటుంది. రాబోయే మూడు రోజులు 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రత గరిష్ట స్థాయికి చేరుకుంటుందని పేర్కొంది.
అనవసరంగా బయటకు రావొద్దు..
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా. రవీందర్ నాయక్ కీలక సూచనలు చేశారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు అనవసరంగా బయటకు రావద్దని సూచించారు. దాహం లేకపోయినా నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం ఎక్కువగా తీసుకోవాలని తెలిపారు. డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్, ఆరోగ్య సమస్యలను నివారిస్తాయని పేర్కొన్నారు. బయటకు వెళితే వదులు దుస్తులు ధరించడం, టోపీలు లేదా గొడుగులు వాడాలని సూచించారు. త్వరగా జీర్ణమయ్యే పండ్లు, కూరగాయలు తీసుకోవాలని తెలిపారు. వృద్ధులు, పిల్లలు ఎక్కువ జాగ్రత్తలు పాటించాలన్నారు.
ఈ ఎండలు పంటలపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉంది. రైతులు నీటి సరఫరాను మెరుగుపరచాలి. నగరాల్లో ట్రాఫిక్ రద్దీతో గాలి నాణ్యత కూడా ప్రభావితమవుతుంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తలు మేలు.