Arjun Tendulkar : ఐపీఎల్ 2025 వేలంలో ఎందరో వర్తమాన ఆటగాళ్లు అమ్ముడుపోయారు. కోట్లకు కోట్లు దక్కించుకున్నారు. అక్కడిదాకా ఎందుకు పట్టుమని 14 సంవత్సరాలు కూడా లేని బాలుడు వైభవ్ సూర్య వంశీని రాజస్థాన్ జట్టు కొనుగోలు చేసింది. ఏకంగా 1.10 కోట్లు అతడికి చెల్లించింది. కానీ ఇదే ధైర్యం ముంబై జట్టు సచిన్ టెండుల్కర్ కొడుకు విషయంలో చేయలేకపోయింది. అసలు వేలంలో సచిన్ కొడుకు ఉన్నాడని మర్చిపోయింది. గత మూడు సీజన్లుగా అతనిని అంటిపెట్టుకున్న ముంబై జట్టు ఇటీవల అతడిని వదిలించుకుంది. ఆ తర్వాత వేలంలో అతడి సంగతి విస్మరించింది. గత సీజన్లో సచిన్ సిఫారసు ద్వారా అర్జున్ ముంబై జట్టుకు ఆడాడు. అది కూడా ఒక మ్యాచ్ లోనే కనిపించాడు. అందులోనూ ఒక ఓవర్ వేసి.. ఓవరాక్షన్ చేశాడు. ముంబై జట్టు అంత కష్టాల్లో ఉన్నప్పటికీ అతడికి గత సీజన్లో ఏమాత్రం ఆడే అవకాశం ఇవ్వలేదు.. ఇప్పుడు మాత్రం అసలు అతడిని కొనుగోలే చేయలేదు. దీంతో సచిన్ కుమారుడు అన్ సోల్డ్ ఆటగాడిగా మిగిలిపోయాడు. అతడి బేస్ ప్రైస్ 30 లక్షలు మాత్రమే అయినప్పటికీ.. కొనుగోలు చేయడానికి ఏ జట్టు కూడా ముందుకు రాలేదు.
అగమ్య గోచరం
అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్, మధ్యలో ఫీల్డింగ్.. వీటన్నింటిలోనూ సచిన్ తనదైన బెంచ్ మార్క్ సృష్టించాడు. మరే ఆటగాడు కూడా తన రికార్డును బద్దలు కొట్టడానికి సాహసించని పరిస్థితిని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే అంతటి లెగసి ఉన్న ఆటగాడి కొడుకు అయిన అర్జున్.. క్రికెట్లో ఆ స్థాయిలో ప్రదర్శన చేయలేకపోతున్నాడు. కనీసం బౌలింగ్ లోనైనా కాస్తలో కాస్త ప్రతిభ చూపలేకపోతున్నాడు. టి20 లలో దారుణంగా తేలిపోతున్నాడు. అందువల్లే జట్ల యాజమాన్యాలు అతనికి అవకాశాలు ఇవ్వడం లేదని తెలుస్తోంది..” అతడు తన తండ్రి కంటే ఎత్తున్నాడు.. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అతడు బౌలింగ్ పై దృష్టి సారిస్తే మెరుగైన ఆటగాడు అవుతాడు. తండ్రికి తగ్గ తనయుడు అవుతాడు. వచ్చిన అవకాశాలను వినియోగించుకోవడంలో అర్జున్ విఫలమవుతున్నాడు. అందువల్లే అతడు గొప్ప క్రికెటర్ కాలేకపోతున్నాడు. సచిన్ సిఫారసు వల్ల ముంబై జట్టు పలుమార్లు అతడిని కొనుగోలు చేసింది. కానీ అతడు జట్టుకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు. అందువల్లే తన బేస్ ప్రైస్ 30 లక్షలకు తగ్గించుకున్నాడు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. సచిన్ ఎన్ని రికార్డులు సాధించినప్పటికీ.. తన కొడుకు గొప్ప క్రికెటర్ గా ఎదగలేకపోవడం అతడిని నిత్యం బాధిస్తూనే ఉంటుంది. గొప్ప ఆటగాడికి ఇంతకు మించిన నిరాశ ఏముంటుంది? ఈ విషయంలో సచిన్ ఆలోచించుకోవాలి.. తన కొడుకును వజ్రం లాగా సానపెట్టాలి. లేకపోతే సచిన్ లెగసి మరో తరానికి అడాప్ట్ కాదని” క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.