KCR Vs Governor Tamilisai : ఏడాదిన్నరగా రాజ్ భవన్.. ప్రగతి భవన్ మధ్య దూరం పెరుగుతూనే ఉంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గ్యాప్ తగ్గినట్లు కనిపించినా.. మళ్లీ రాష్ట్రంలో సర్కార్ వర్సెస్ గవర్నర్ మధ్య వార్ కంటిన్యూ అవుతోంది. నిన్న, మొన్నటి వరకు పెండింగ్ బిల్లుల ఆమోదంపై వార్ నడిస్తే.. ఇప్పుడు కొత్త పంచాయతీ మొదలైంది.
ఆహ్వానం పంచాయితీ..
సెక్రటేరియట్ ప్రారంభోత్సవ ఆహ్వానంపై రగడ జరుగుతోంది. ఏప్రిల్ 30న కొత్తగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్ ఆహ్వాన లేఖపై వివాదం జరుగుతోంది. కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి గవర్నర్ తమిళిసై రాకపోవడంపై మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేకపోతున్నారని, అభివృద్ధి నిరోధకులు రాన్నంత మాత్రన ఇబ్బంది రాదన్నారు. గవర్నర్ ఈర్షతోనే రాలేదన్నారు. రావడం, రాకపోవడం అనేది ఆమె విజ్ఞతకే వదిలి పెడుతున్నామన్నారు మంత్రి.
ఆహ్వానమే లేదన్న రాజభవన్.
మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్ పై రాజ్ భవన్ వర్గాలు స్పందించాయి. సచివాలయ ప్రారంభోత్సవానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదని నోట్ రిలీజ్ చేశాయి. గవర్నర్ కు ఆహ్వానం అందించినట్లు చెప్పడపం అవాస్తవం అన్నారు. ఆహ్వానం లేకుండా ఎలా హాజరువుతారని ప్రశ్నించారు.
జగదీశ్ అబద్దం ఆడారా..
కొత్త సచివాలయం ఆహ్వానంపై మంత్రి జగదీష్ రెడ్డి అబద్దం ఆడారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గవర్నర్ ఆహ్వానం విషయంలో ఎవరు స్పందించకపోయినా జగదీష్ రెడ్డి స్పందించడం కొత్త చర్చకు దారితీసింది. అసందర్భంగా గవర్నర్ ఆహ్వానం విషయం ప్రస్తావించడం వెనుక ఆంతర్యం ఏమిటన్న చర్చ మొదలైంది.