War 2 Coolie Tickets Hike Denied: ఎల్లుండి సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) నటించిన ‘కూలీ'(Coolie Movie), ఎన్టీఆర్(Junior NTR) – హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వార్ 2′(War 2 Movie) చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలు కావడంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ రేట్స్ కి అమ్ముడుపోయాయి. ‘వార్ 2’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 70 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరగ్గా, కూలీ చిత్రానికి 50 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అందుకే నిర్మాతలు రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్స్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతి ని కోరుతూ ప్రభుత్వాలకు అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతించింది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం అంగీకరించలేదు. తెలంగాణ ప్రభుత్వం కూడా టికెట్స్ రేట్స్ పెంచేందుకు ఆలోచన చేసింది. కానీ సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది.
Also Read: ‘హరి హర వీరమల్లు’ ని దాటలేకపోయిన ‘వార్ 2’..మరీ ఇంత తక్కువనా?
డబ్బింగ్ సినిమాలకు టికెట్ రేట్స్ ఎలా పెంచుతారు?, జనాల నుండి ఎంత దోపిడీ చేస్తారు?, మీరు ఒకవేళ టికెట్ రేట్స్ పెంచితే రజినీకాంత్ కూలీ చిత్రానికి తమిళనాడు ఉండే మల్టీప్లెక్స్ టికెట్ రేట్స్, మన తెలంగాణ లోని మల్టీప్లెక్స్ టికెట్ రేట్స్ కంటే తక్కువ ఉంటుంది. ప్రొమోషన్స్ కోసం కనీసం హైదరాబాద్ కి కూడా హీరో రాలేదు, అలాంటి సినిమాకు టికెట్ రేట్స్ పెంచడం అవసరమా అంటూ సోషల్ మీడియా నెటిజెన్స్ ప్రభుత్వ అధికారులను ట్యాగ్ చేసి తిట్టడం మొదలు పెట్టారు. నిన్న మొన్నటి వరకు ఈరోజు, లేదా రేపు టికెట్ రేట్స్ GO వచ్చేస్తుంది, తెలంగాణ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది అంటూ వార్తలు వచ్చాయి, కానీ అకస్మాత్తుగా ఈ రెండు సినిమాలకు అనుమతిని నిరాకరించినట్టు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త. మరి కాసేపట్లో నార్మల్ టికెట్ రేట్స్ తోనే ఈ రెండు సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాబోతున్నాయి.
Also Read: సినిమా షూటింగులు బంద్…కానీ పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ నడుస్తోందా..?
తక్కువ రేట్స్ తో ఈ రెండు క్రేజీ సినిమాలను చూడాలని కోరుకునే మూవీ లవర్స్ కి ఇది పండగ లాంటి వార్త. కానీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ‘వార్ 2’ విషయం టికెట్ రేట్స్ రానందుకు కాస్త బాధపడుతున్నారు. ఎందుకంటే భారీ గ్రాస్ నంబర్స్ ని చూసే అవకాశం పొయ్యింది కదా అనేది వాళ్ళ బాధ. కానీ ఈమధ్య కాలం లో టికెట్ రేట్స్ భారీగా పెంచిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. టాక్ బాగుంటే వసూళ్లు ఎవ్వరూ ఊహించనంత వస్తున్నాయి. కానీ ఒకవేళ టాక్ బాగాలేకపోతే మాత్రం దారుణమైన వసూళ్లు నమోదు అవుతున్నాయి. కానీ ఇప్పుడు రెండు సినిమాలకు నార్మల్ టికెట్ రేట్స్ ఉండడం తో కచ్చితంగా ఈ రెండు సినిమాలు కనీసం యావరేజ్ రేంజ్ టాక్ తెచ్చుకున్నా బంపర్ కలెక్షన్స్ ఉంటాయని విశ్లేషకులు ఆశిస్తున్నారు.
After facing heavy backlash over ticket hikes from public & fans… Now, NO TICKET HIKES for #Coolie & #War2 in telangana! Bookings open TODAY after 2 PM.
— (@BheeshmaTalks) August 12, 2025