HomeతెలంగాణTS Power Sector: తెలంగాణ కరెంటు.. అప్పుల కుప్ప

TS Power Sector: తెలంగాణ కరెంటు.. అప్పుల కుప్ప

TS Power Sector: తెలంగాణకు 24 గంటల పాటు కరెంటు ఇస్తున్నాం. మోటార్లకు మీటర్లు పెట్టాలని ఆ మధ్య మోడీ నాపై ఒత్తిడి తీసుకొచ్చారు. అయినప్పటికీ నేను వెనుకాడ లేదు. నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు తెలంగాణ రైతులకు అన్యాయం జరగనివ్వను.. ఇవే కదా కెసిఆర్ పదేపదే చెప్పింది. తాను 24 గంటలపాటు కరెంటు ఇస్తున్నానని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంధకారం ఉంటే.. తెలంగాణ ఏర్పడిన తర్వాత వెలుగులమయం చేశానని గొప్పలు పోయింది. కానీ తెలంగాణ విద్యుత్ ముఖచిత్రం వెలుగులమయం కాదని.. దాచిన, దోచిన విషయాలు ఎన్నో ఉన్నాయని అధికారుల ద్వారా తెలుస్తోంది. టీఎస్ జెన్కోకు 1200 కోట్లు, కేంద్ర ప్రభుత్వ విద్యుత్ పంపిణీ సంస్థలకు 1605 కోట్లు, ఎక్స్చేంజిలలో కరెంటు కొనుగోళ్లకు 500 కోట్లు, అప్పులకు, జీతాల చెల్లింపులకు 1457 కోట్లు.. ఇలా మొత్తం ఖర్చులకే 4762 కోట్లను తెలంగాణ విద్యుత్ సంస్థలు చెల్లిస్తున్నాయి. వీటి ద్వారా సుమారు 1004 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంటున్నాయి. ఈ గణాంకాలు చాలు తెలంగాణ విద్యుత్ సంస్థ ఎలా ఉందో చెప్పేందుకు.

200 యూనిట్లకు 4008 కోట్లు

తెలంగాణ విద్యుత్ సంస్థల పనితీరు బాగా లేకపోవడంతో ప్రతినెల అప్పుల నెలసరి వాయిదాల చెల్లింపులకు 1300 కోట్లు చెల్లిస్తున్నాయి. ఇక 2014_ 23 సంవత్సరాలలో ఏకంగా డిస్కములు 50వేల 275 కోట్ల నష్టాలను చవిచూశాయి. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించినట్టు ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తే ఆ భారం ఏకంగా ప్రతి సంవత్సరం 4008 కోట్లకు చేరుతుంది. ఇక ఖర్చు బాగా పెరిగిన నేపథ్యంలో ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ డిస్కమ్ లు తీవ్ర ఆర్థిక సంక్షేపంలో కూరుకుపోయాయి. 2014- 15 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ రాయితీలు 3,600 కోట్లు ఉండగా.. ఈ 10 సంవత్సరాలలో అవి ఏకంగా 11,500 కోట్లకు చేరాయి..

వీటివల్లే దారుణమైన నష్టాలు

తెలంగాణ విద్యుత్ సంస్థ భారీగా నష్టాల్లో కూరుకు పోవడానికి అనేక కారణాలు దోహదం చేస్తున్నాయి. టన్ను బొగ్గుపై క్లీన్ ఎనర్జీ సెస్ గా కేంద్రం 400 వసూలు చేస్తుంది. బొగ్గు ధరలు విపరీతంగా పెరగడంతో రవాణా చార్జీలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక పంపిణీ సంస్థల స్వల్పకాలిక రుణాలు ఏకంగా 30, 406 కోట్లకు చేరాయి. ఇవి విద్యుత్ కొనుగోళ్ల కోసం ఆ సంస్థలు చేసిన అప్పులు. ఇక రాష్ట్రంలో 27.99 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి వీటి వినియోగంపై ప్రభుత్వం వద్ద లెక్కలు లేవు. లెక్కలు లేకపోవడం వల్లే కేంద్ర ప్రభుత్వం మీటర్లు పెట్టాలని నిర్ణయించింది. కాకపోతే వీటికి లెక్కలు చెప్పాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో మోటార్లకు మీటర్లు పెట్టేందుకు ఒప్పుకోలేదు. ఇక ట్రూ అప్ చార్జీలు వసూలు చేసేందుకు గత ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఈ చార్జీల విలువ 12,515 కోట్ల దాకా ఉంటుంది. 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కేటీపీఎస్, 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్, 800 మెగావాట్ల ఎన్టిపిసి వంటి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంతో విద్యుత్ కొనుగోలు వేయడం భారీగా పెరిగింది. ఉద్యోగులకు 2014 _15లో 37.5%, 2018-19 లో 42.5%, 2023_24 లో ఏడు శాతం ఫిట్మెంట్, సర్వీస్ వెయిటేజ్ కలిపి పదిహేను శాతం ప్రభుత్వం పెంచింది. దీనివల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడింది. విద్యుత్ ఎక్స్చేంజి ల నుంచి అదనపు విద్యుత్ కొనుగోలు కోసం ప్రతినెల 500 కోట్లను వెచ్చించడం ద్వారా సంస్థలపై మరింత భారం పడుతుంది.. ఇక వచ్చే ఆరు నెలల్లో విద్యుత్ సంస్థలు 22,781 కోట్ల ఆదాయాన్ని ఆర్జించనున్నాయి. ఇదే సమయంలో 33,839 కోట్ల కష్టాన్ని మూటగట్టుకోనున్నాయి. కేవలం ఆరు నెలల్లో 11, 058 కోట్ల నష్టాలను చవిచూడనన్నాయి

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular