Telangana Budget 2025 (2)
Telangana Budget 2025: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ. 3,04,965 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం మరియు ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ బడ్జెట్‌ను శాసనసభలో సమర్పించారు. ఈ బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం రూ. 2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ. 36,504 కోట్లుగా నిర్ణయించారు. రాష్ట్రంలోని వివిధ శాఖలకు కేటాయించిన నిధుల వివరాలు ఇలా ఉన్నాయి..
Also Read: సునీతా విలియమ్స్‌కు స్వాగతం పలుకుతూ మోదీ ట్వీట్ వైరల్!
రైతు భరోసా: రూ. 18,000 కోట్లు
వ్యవసాయ శాఖ: రూ. 24,439 కోట్లు
పశు సంవర్ధక శాఖ: రూ. 1,674 కోట్లు
పౌర సరఫరాల శాఖ: రూ. 5,734 కోట్లు
విద్యా శాఖ: రూ. 23,108 కోట్లు
మహిళా, శిశు సంక్షేమ శాఖ: రూ. 2,862 కోట్లు
ఎస్సీ సంక్షేమ శాఖ: రూ. 40,232 కోట్లు
ఎస్టీ సంక్షేమ శాఖ: రూ. 17,169 కోట్లు
బీసీ సంక్షేమ శాఖ: రూ. 11,405 కోట్లు
మైనారిటీ సంక్షేమ శాఖ: రూ. 3,591 కోట్లు
ఐటీ శాఖ: రూ. 774 కోట్లు
వైద్య ఆరోగ్య శాఖ: రూ. 12,393 కోట్లు
విద్యుత్ శాఖ: రూ. 21,221 కోట్లు
హైదరాబాద్ సిటీ డెవలప్‌మెంట్: రూ. 150 కోట్లు
పురపాలక, నగరాభివృద్ధి శాఖ (MA & UD): రూ. 17,677 కోట్లు
నీటి పారుదల శాఖ: రూ. 23,373 కోట్లు
రోడ్లు, భవనాల శాఖ: రూ. 5,907 కోట్లు
పర్యాటక శాఖ: రూ. 775 కోట్లు
క్రీడా శాఖ: రూ. 465 కోట్లు
అటవీ, పర్యావరణ శాఖ: రూ. 1,023 కోట్లు
దేవాదాయ శాఖ: రూ. 190 కోట్లు
హోం శాఖ: రూ. 10,188 కోట్లు
చేనేత శాఖ: రూ. 371 కోట్లు
పరిశ్రమల శాఖ: రూ. 3,527 కోట్లు
అంతేకాక, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు రూ. 56,084 కోట్లు కేటాయించారు. ఇందులో:
రైతు భరోసా: రూ. 18,000 కోట్లు
చేయూత: రూ. 14,861 కోట్లు
ఇందిరమ్మ ఇళ్లు: రూ. 12,571 కోట్లు
మహాలక్ష్మి: రూ. 4,305 కోట్లు
గృహ జ్యోతి: రూ. 2,080 కోట్లు
సన్న బియ్యం బోనస్: రూ. 1,800 కోట్లు
రాజీవ్ ఆరోగ్యశ్రీ: రూ. 1,143 కోట్లు
గ్యాస్ సిలిండర్: రూ. 723 కోట్లు
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా: రూ. 600 కోట్లు
ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Telangana budget 2025 allocations by ministry
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com