Homeజాతీయ వార్తలుBandi Sanjay: ‘బండి’ ఉంటాడా..? ఊడతాడా..? టీబీజేపీలో ఉత్కంఠ!

Bandi Sanjay: ‘బండి’ ఉంటాడా..? ఊడతాడా..? టీబీజేపీలో ఉత్కంఠ!

Bandi Sanjay: తెలంగాణ బీజేపీలో మార్పులు ఊపందుకున్నాయా… అధక్షుడి మార్పు తప్పదా.. రెండ మూడు రోజుల్లో నూతన అధ్యక్షుడు రాబోతున్నాడా? అంటే బీజేపీ వర్గాల నుంచి భిన్న సమాధానం వస్తోంది. కొంతమంది మార్పు ఖాయమంటుండగా, మరికొందరు మార్పు ఉండకపోవచ్చని అంటున్నారు. పక్షం రోజులుగా ఏదో విషయంలో తెలంగాణ బీజేపీ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ప్రధాని మోదీ అధ్యక్షతన కౌన్సిల్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ సమావేశం జరుగుతున్న సమయంలోనే అత్యవసరంగా ఢిల్లీకి రావాలని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు పిలుపు వచ్చింది. మరోవైపు అంతకంటే ముందే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఢిల్లీకి వెళ్లడం సంచలనంగా మారింది. కారణం తెలియకపోయినా.. హస్తినాలో ఏదో జరుగుతోందన్న అనుమానాలు మాత్రం కలుగుతున్నాయి. తెలంగాణ బీజేపీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది.

సంస్థాగత వ్యవహారలపై భేటీ..
గత వారం బీజేపీ సంస్థాగత వ్యవహారాలపై ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షుడు నడ్డా అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, అన్ని రాష్ట్రాల ఇన్‌చార్జిలు, మోర్చాల అధ్యక్షులు, మోర్చాల ఇన్‌చార్జిలు పాల్గొన్నారు. జేపీ నడ్డా, బీఎల్‌ సంతోష్‌ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో జరిగిందన్నదనే అంశంపై ఊహాగానాలు చక్కర్లు కొట్టినా అసలు ఏ నిర్ణయాలు తీసుకున్నారు అన్నది మాత్రం బయటకు రాలేదు.

ఎడమొహం.. పెడమొహం..
ఇదిలావుంటే, తెలంగాణ బీజేపీలో నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. కొంతకాలంగా కీలక నాయకులు కలుసుకోవడం లేదు. పార్టీ నాయకుల మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు ఉండటంతో నేరుగా అధిష్టానమే రంగంలోకి దిగి సమస్యకు ముగింపు పలికే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే సంజయ్‌కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా అధ్యక్షుడి మార్పుపై జరుగుతున్న ప్రచారానికి ఈ సమావేశం తర్వాత తెరపడే అవకాశం కనిపిస్తోంది.

ఒకరి వెనక ఒకరు..
ఇదిలా ఉంటే తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందర్‌ రావు ఢిల్లీకి వెళ్లడం.. ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ బయలుదేరడంతో మరోసారి చర్చ మొదలైంది. రఘునందర్‌రావు తనకు శాసనసభాపక్ష నేత పదవి కావాలంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తనను అధిష్టానం పట్టించుకోవడం లేదని, కొత్తగా పార్టీలోకి చేరిన వారిని పిలిచి మరీ మాట్లాడుతోందని కూడా ఇటీవల వ్యాఖ్యానించారు. తన గెలుపుతోనే బీజేపీకి తెలంగాణలో ఊపు వచ్చిందని కూడా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రఘునందన్‌ ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలవడం కూడా చర్చనీయాంశమైంది. కొన్ని గంటల్లో తెలంగాణ బీజేపీలో మార్పులు చేర్పుల అంశం కొలిక్కి రావడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. బండి సంజయ్‌ అధ్యక్ష పదవి ఉంటుందా.. ఊడుతుందా అనేది కూడా తెలిసిపోతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular