Telangana BJP map issue: నేటి కాలంలో రాజకీయాలు అత్యంత సున్నితంగా మారిపోయాయి.. రాజకీయ నాయకులు మాట్లాడే ప్రతి మాట.. వేసే ప్రతి అడుగు చర్చకు దారి తీస్తోంది. ఇందులో ఏమాత్రం లోపం కనిపించినా చాలు రచ్చరచ్చ అయిపోతున్నది. రాజకీయ పార్టీల సోషల్ మీడియా బృందాలు బలంగా ఉండడంతో అనవసరమైన విషయం కూడా వివాదానికి కారణం అవుతోంది. ఆ తర్వాత జరుగుతున్న రచ్చ మామూలుగా ఉండడం లేదు. ప్రస్తుతం అటువంటి సంఘటన ఒకటి ఏపీలో చోటుచేసుకుంది. వైసిపి అనుకూల సోషల్ మీడియా విభాగాలు దానిని రచ్చ రచ్చ చేస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..
Also Read: ఆడుతూ పాడుతూ పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లకు ఏం షాకిచ్చావయ్యా రేవంతూ!
ఇటీవల భారత జంట పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పివిఎన్ మాధవ్ నియమితులయ్యారు. ఈ క్రమంలో ఆయన ఏపీ మంత్రి నారా లోకేష్ ను కలిశారు. ప్రస్తుతం ఏపీలో బిజెపి, టిడిపి, జనసేన కూటమిగా ఏర్పడి అధికారంలో ఉన్నాయి.. గడిచిన ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇక ఇటీవల ఏపీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్ ఎన్నికయ్యారు. ఎన్నికైన నేపథ్యంలో మాధవ్ ఏపీ మంత్రి నారా లోకేష్ ను కలిశారు. ఈ సందర్భంగా ఒక చిత్రపటాన్ని బహుకరించారు. వాస్తవానికి ఆ చిత్రపటాన్ని చూస్తే 20 శతాబ్దపు భారతదేశం కనిపిస్తోంది. ఆ చిత్రపటం లో అన్ని పేర్లు కూడా తెలుగులో ఉన్నాయి. భారతీయ సంస్కృతిని ఆ చిత్రపటం ప్రతిబింబిస్తోంది. మరోవైపు ఆ చిత్రపటంలో భారతదేశాన్ని అఖండ భారత్ గా పేర్కొన్నారు. అయితే ఇది వైసిపి అనుకూల, గులాబీ పార్టీ అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్స్ కు తప్పుగా అనిపిస్తోంది. అంతేకాదు తెలంగాణ అంటే బిజెపి నాయకులకు చిన్న చూపు అని ఏకంగా ఆ హ్యాండిల్స్ లో తీర్మానించేశారు. ఆ చిత్రపటం ఎలా ఉంది? ఏ ఉద్దేశంతో దానిని ఇచ్చారు? అందులో ఉన్న వివరాలను పక్కనపెట్టి తాము ఏం అనుకుంటున్నామో.. ఆ మాటలు అనేశారు.
Mr. Lokesh,
You live in Telangana.
Your son goes to school here.
Your wife and mother run all your businesses from Telangana.
Even your grandfather’s memorial stands on Telangana soil.Yet you shamelessly accepted a “gift” from the BJP State President, a map of India that… https://t.co/FwXE5zn0rp
— ఉత్తమ్ || Utt@m (@UttamKBRS) July 10, 2025
వాస్తవానికి ఇలాంటి వ్యాఖ్యల వల్ల ప్రజల్లో లేనిపోని వైషమ్యాలు చెలరేగుతాయి. ఇప్పుడు అధికారానికి దూరమైన పార్టీలకు కావలసింది కూడా అదే. అందువల్లే లేనిపోని సెంటిమెంట్ తగిలించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎప్పుడైతే గులాబి, వైసిపి అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఈ ఫోటో పోస్ట్ చేశారో.. సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. తెలంగాణను బిజెపి గుర్తించదని కొంతమంది అంటుంటే.. అఖండ భారత్లో తెలంగాణ భాగం కాదా.. అప్పుడు తెలంగాణ ఏర్పడలేదు కదా అని మరి కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి ఇప్పుడున్నవన్ని ఉద్యమం నాటి పరిస్థితులు కాదు. రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి. వేటికవే బతుకుతున్నాయి. ప్రజలు ఆదరించిన పార్టీలు అధికారంలో ఉన్నాయి. ప్రజలు తిరస్కరించిన పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అధికారం కోసం పోరాటం చేయాలి అందులో తప్పులేదు. కానీ ప్రజా సమస్యలపై పోరావలసిన సమయంలో ఇలాంటి సెంటిమెంట్ రాజకీయాలకు తెలలేపడం ఎంతవరకు సమంజసమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు గడిచిన 10 సంవత్సరాలలో తెలంగాణ, ఆంధ్రా అంటూ తేడాలు రాలేదు. ఇప్పుడు మాత్రమే ఎందుకు వస్తున్నాయంటే.. అదే అర్థం చేసుకోవాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సెంటిమెంట్ రాజకీయాలను పక్కనపెట్టి.. ప్రజలలో విభేదాలను సృష్టించే పనులు మానుకొని.. ప్రజా సమస్యలపై పోరాడే తత్వాన్ని ప్రతిపక్షాలు పెంపొందించుకోవాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.