YSRCP Duvvada Srinivas: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్( duvvada Srinivas) జనసేనలో చేరుతారా? ఆ ప్రయత్నంలోనే ఉన్నారా? అందుకే చిరంజీవిని పొగుడుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల ఆయనపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంది. అయితే దువ్వాడ శ్రీనివాస్ మాత్రం జగన్మోహన్ రెడ్డిని తప్పు పట్టడం లేదు. ఇప్పటికీ ఆయనను ఆరాధన భావంతోనే చూస్తున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత తనను గుర్తించింది జగన్మోహన్ రెడ్డి అని చెబుతుంటారు. అందుకే వారిద్దరిని దేవుళ్ళతో పోల్చుతుంటారు. అయితే ఇప్పుడు కొత్తగా మెగాస్టార్ చిరంజీవి ఆ జాబితాలోకి రావడం విశేషం. ఆయన నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారు దువ్వాడ శ్రీనివాస్. అందుకే నాటి సంగతులను గుర్తు చేసుకుని చిరంజీవి అంటే తనకు అభిమానమని చెబుతున్నారు.
Also Read: పవన్ సవాల్‌ను స్వీకరిస్తున్నా: లోకేశ్ సంచలన నిర్ణయం
ప్రతి ఎన్నికలలోనూ పరాజయం
దువ్వాడ శ్రీనివాస్ దశాబ్దాలుగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారే కానీ.. గెలిచిన దాఖలాలు లేవు. కాంగ్రెస్ పార్టీ( Congress Party) ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు దువ్వాడ శ్రీనివాస్. 2001లో యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. యువనేతగా, దూకుడు కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు. అప్పట్లోనే టెక్కలి నియోజకవర్గంలో పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు. 2004 ఎన్నికల్లో హరిచంద్రపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అటు తరువాత జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అయ్యారు. పూర్తిగా ధర్మాన, కింజరాపు కుటుంబాలను వ్యతిరేకించేవారు. వారిది పరస్పర అవగాహన రాజకీయం అని ఆరోపణలు చేసేవారు. అదే దువ్వాడ రాజకీయ ఎదుగుదలకు ఇబ్బందికరంగా మారింది.
సుదీర్ఘ రాజకీయ నేపథ్యం
2009లో ప్రజారాజ్యం( Praja Rajyam) పార్టీలో చేరారు దువ్వాడ శ్రీనివాస్. శ్రీకాకుళం నుంచి కళా వెంకట్రావు, తమ్మినేని సీతారాం తెలుగుదేశం పార్టీ నుంచి ప్రజారాజ్యం పార్టీలో చేరగా.. కాంగ్రెస్ పార్టీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ జంప్ చేశారు. 2009 ఎన్నికల్లో టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానానికి పరిమితం అయ్యారు. అటు తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన దువ్వాడ శ్రీనివాస్ కు జగన్మోహన్ రెడ్డి గుర్తింపు ఇచ్చారు. 2014లో టెక్కలి అసెంబ్లీ సీటు ఇచ్చారు. కానీ ఓటమి పలకరించింది. 2019లో శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు శ్రీనివాస్. అయితే రామ్మోహన్ నాయుడు చేతిలో ఓడిపోయారు. దీంతో జగన్మోహన్ రెడ్డి దువ్వాడ శ్రీనివాస్కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. 2024లో సైతం టెక్కలి అసెంబ్లీ స్థానాన్ని కేటాయించారు. ఈ ఎన్నికల్లో సైతం ఓడిపోయారు దువ్వాడ శ్రీనివాస్.
Also Read: జగన్ ఓడిపోతారని నేను ఊహించలేదు.. కేటీఆర్ కామెంట్స్ వైరల్!
మెగాస్టార్ పై ప్రశంసలు
అయితే దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారంతో పార్టీ నుంచి సస్పెండ్ కు గురయ్యారు. అయితే దీని వెనుక ధర్మాన కుటుంబం( Dharma na family ) ఉన్నది అన్నది దువ్వాడ శ్రీనివాస్ అనుమానం. అందుకే ధర్మాన సోదరులపై విమర్శలు చేస్తున్న దువ్వాడ శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డిని పల్లెత్తు మాట అనడం లేదు. కానీ ఇటీవల మెగాస్టార్ చిరంజీవి పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనలో చేరుతారని టాక్ నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.