Revanth Reddy And Chambrabu: పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ మరో నాలుగైదు రోజుల్లో రాబోతోంది. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఈ తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఢిల్లీ కేంద్రంగా రెండు రాష్ట్రాల రాజకీయాలపై చర్చలు జరుగుతున్నాయి. ఏపీలో పొత్తులపై చర్చించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గురువారం(మార్చి 7న) ఢిల్లీ వెళ్లారు. ఇదే సమయంలో తెలంగాణ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం కూడా గురువారమే జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లారు.
ఆసక్తికర భేటీ..
ఢిల్లీలో రెండ జాతీయ పార్టీల్లో కీలక సమావేశాలు జరుతున్న వేళ. రాజధాని కేంద్రంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు కీలక నేతలు భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. తన రాజకీయ గురువు అయిన నారా చంద్రబాబు నాయుడును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలిశారు. ఏపీలో ఎన్నికలు ఈసారి చంద్రబాబు నాయుడుకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకున్నాడు. బీజేపీతోనూ కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవి చర్చల దశలో ఉన్నాయి. బీజేపీ ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్తుండడంతో పొత్తులు కొలిక్కి రావడం లేదు. ఈ తరుణంలో కాంగ్రెస్‌కు సీఎం అయిన రేవంత్, టీడీపీ చీఫ్ చంబ్రాబు సమావేశం కావడం రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది.
విమానాశ్రయంలో భేటీ..
టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ విమానాశ్రయంలో భేటీ అయినట్లు తెలుస్తోంది. ఇద్దరు తాజా రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం. ఒకవైపు బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్న నారా చంద్రబాబు నాయకుడు, కాంగ్రెస్ సీఎం రేవంత్‌తో సమావేశం కావడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
2018లో ఎన్డీఏ నుంచి బయటకు..
2014 ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేన పోటీ చేశాయి. జనసేన బరిలోనిలవకపోయినా మద్దతు తెలిపింది. ఈ ఎన్నికల్లో ఈ మూడూ పార్టీల పొత్తు సక్సెస్ అయింది. 2018లో ఎన్డీఏను టీడీపీ వీడింది. మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. దీంతో తీవ్రంగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో అదే కాంబినేషన్‌ను 2024లో కొనసాగించాలని టీడీపీ బలంగా కోరుకుంటోంది. ఇప్పటికే జనసేతో పొత్తు కొలిక్కి వచ్చింది. బీజేపీ మాత్రం ఎటూ తేల్చడం లేదు. ఒకవైపు ఒంటరి పోరు అంటూనే టీడీపీతో కమలనాథులు చర్చలు జరుపుతున్నారు. పొత్తు అయితే ఎక్కువ ఎంపీ సీట్ల కోసం పట్టుపడుతున్నారు. అయితే టీడీపీ ఎన్డీఏలో చేరడంపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.