Swecha Votarkar Case: పాత్రికేయురాలు స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో పూర్ణచంద్ర నాయక్ శనివారం రాత్రి తన లాయర్ తో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు అతడిని న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. పోలీసులు దాఖలు చేసిన అభియోగాలను పరిశీలించి.. పూర్ణచంద్రనాయక్ కు న్యాయమూర్తి 14 రోజులపాటు రిమాండ్ విధించారు. దీంతో ఆయనను పోలీసులు జైలుకు తరలించారు. 14 రోజులపాటు అతడు రిమాండ్ లో ఉంటాడు.. ఈ కేసులో మరిన్ని వివరాలు సేకరించడానికి పోలీసులు అతడిని విచారించనున్నారు.
Also Read: పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్నది ‘తుపాకీ’ కాదు..ఈ ఆయుధం పేరు,దాని చరిత్ర తెలిస్తే మెంటలెక్కిపోతారు!
స్వేచ్ఛకు, పూర్ణకు చాలా సంవత్సరాలుగా పరిచయం ఉంది. గతంలోనే స్వేచ్ఛకు రెండు వివాహాలు జరిగాయి. ఆ రెండు వివాహాలు కూడా విడాకులకు దారితీసాయి. రెండవ భర్త ద్వారా స్వేచ్ఛకు కుమార్తె కలిగింది. ఆ కుమార్తెకు అరణ్య అని పేరు పెట్టుకుంది. స్వేచ్ఛ పనిచేస్తున్న న్యూస్ ఛానల్లోనే పూర్ణ కూడా గతంలో పనిచేశాడు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. అది కాస్త ప్రేమకు దారితీసింది. అయితే పూర్ణ గతంలోనే ప్రేమ వివాహం చేసుకున్నాడు. అతనికి భార్య, పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో స్వేచ్ఛతో పరిచయం కాస్త స్నేహంగా మారడం.. అది ప్రేమకు దారి తీసింది. స్వేచ్ఛ, పూర్ణ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే మొదట్లో పెళ్లి చేసుకుంటారని స్వేచ్ఛకు మాట ఇచ్చిన పూర్ణ.. దానిని నిలుపుకోవడంలో విఫలమయ్యాడు. ఇదే విషయంపై ఇద్దరి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. అందువల్లే తరచూ వారిద్దరు గొడవపడే వాళ్ళని తెలుస్తోంది.
ఇక ఇటీవల కాలంలో పూర్ణతో దిగిన ఫోటోలను స్వేచ్ఛ బయటపెట్టింది. సామాజిక మాధ్యమ ఖాతాలలో వాటిని పోస్ట్ చేసింది. అంతేకాదు తన పేరుకు పక్కన పూర్ణ పేరు కూడా జత చేసింది. ఎప్పుడైతే సామాజిక మాధ్యమాలలో తనతో దిగిన ఫోటోలను స్వేచ్ఛ పోస్ట్ చేసిందో.. పూర్ణకు అది ఆగ్రహాన్ని తెప్పించింది. స్వేచ్ఛ ఆ ఫోటోలను పోస్ట్ చేయడం ద్వారా పూర్ణ ఇంట్లో కూడా గొడవలు జరిగినట్టు తెలుస్తోంది. అందువల్లే పూర్ణ స్వేచ్ఛతో వాగ్వాదానికి దిగినట్టు సమాచారం. అందువల్లే స్వేచ్ఛ ఈ అఘాయిత్యానికి పాల్పడిందని ఆమె కుమార్తె అరణ్య చెబుతోంది.
స్వేచ్ఛ కేసులో మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున అతడిని 14 రోజులపాటు విచారించాల్సి ఉందని పోలీసులు పేర్కొనడంతో.. న్యాయమూర్తి సమ్మతం తెలిపారు. ప్రస్తుతం పూర్ణ విచారణ ఖైదీగా ఉన్నాడు. పోలీసుల ఎదుట లొంగిపోయే కంటే ముందు పూర్ణ పేరుతో కొన్ని లేఖలు మీడియాకు అందాయి. ఆ లేఖలలో పూర్ణ స్వేచ్ఛ తల్లిదండ్రులను దోషులుగా చూపించే ప్రయత్నం చేశాడు. స్వేచ్ఛ కుమార్తెకు ఫంక్షన్ చేశానని.. ఆమెకు సంబంధించిన అన్ని ఖర్చులు కూడా తానే భరించి నట్టు పూర్ణ ఆలేఖలో పేర్కొన్నాడు. మరోవైపు పూర్ణ వ్యక్తిత్వం పై అరణ్య సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. మొత్తంగా చూస్తే స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో ఇంకా చాలా వివరాలు బయటకు తెలియాల్సి ఉందని పోలీసులు భావిస్తున్నారు.