Kodandaram And Ali Khan: రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత శాసనమండలికి ఎవరిని పంపించాలి చర్చ మొదలైనప్పుడు.. ఆయన మదిలో మిగిలిన తొలి పేరు కోదండరాం.. ఆ తర్వాత ఇతర సమీకరణాల నేపథ్యంలో అలీ ఖాన్ పేరును కూడా ఆయన గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయడానికి పంపించారు. గవర్నర్ మరో మాటకు తావు లేకుండా వారిద్దరిని శాసనమండలి సభ్యులుగా ఎంపిక చేశారు. అయితే వారిద్దరిని ఎందుకు ఎంపిక చేశారని సవాల్ చేస్తూ అప్పట్లోనే భారత రాష్ట్ర సమితి నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
Also Read: ఏపీలో నామినేటెడ్ జాతర
సర్వోన్నత న్యాయస్థానం ఇన్ని రోజులపాటు ఆ ఫిర్యాదును హోల్డ్ లో పెట్టింది. బుధవారం దానికి సంబంధించి విచారణ సాగించింది. ఈ విచారణలో భాగంగా ఇరుపక్షాల వాదనలు విన్న సర్వోన్నత న్యాస్థానం కోదండరాం, అలీ ఖాన్ ను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయడం సరి కాదని ధర్మసనం వ్యాఖ్యానించింది. వారి శాసనమండలి సభ్యత్వలను రద్దు చేస్తూ సంచలనమైన తీర్పు ఇచ్చింది. గతంలో శ్రవణ్, సత్యనారాయణ ను గవర్నర్ కూడా లో ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాలని భారత రాష్ట్ర సమితి ప్రతిపాదించింది. దీనిని గవర్నర్ పరిధిలోకి తీసుకెళ్లింది. అయితే గవర్నర్ దీనిని వ్యతిరేకించారు. ఆ తర్వాత ఎమ్మెల్యేల కోటాలో శ్రవణ్ ఎమ్మెల్సీ అయ్యారు. అప్పట్లో గవర్నర్ తనను ఎమ్మెల్సీగా ఎంపిక చేయకపోవడం పట్ల శ్రవణ్ తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు కోదండరాం, ఆలీ ఖాన్ ను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇన్ని రోజులపాటు ఆ పిటిషన్ ను హోల్డ్ లో పెట్టిన సుప్రీంకోర్టు.. బుధవారం భారత రాష్ట్ర సమితి ఊహించిన విధంగా తీర్పు ఇచ్చింది. అంతేకాదు తదుపరి విచారణను వచ్చే నెల 17 కు వాయిదా వేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో నామినేషన్లు తమ తుది తీర్పుకు లోబడి ఉంటాయని సుప్రీంకోర్టు వెల్లడించింది.
ఈ తీర్పు ఒక రకంగా అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బలాంటిది. ఎందుకంటే 2023లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి ప్రధాన కారణాలలో కోదండరాం కూడా ఒకరు. కోదండరాం ఉద్యమ నాయకుడిగా పేరుపొందారు. అయితే ఆయనకు భారత రాష్ట్ర సమితి సముచిత ప్రాధాన్యం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆయన తెలంగాణ ఉద్యమంలో చేసిన సేవలు గుర్తించి ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది. ఆయన ఎంపికను ప్రారంభం నుంచి భారత రాష్ట్ర సమితి తప్పుపడుతూనే ఉంది. చివరికి సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. ఏం జరుగుతుందో అనేది ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్ 17న ఈ కేసు కు సంబంధించి తుది తీర్పు వెళ్ళడయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది చూడాల్సి ఉంది. ఆ రెండు స్థానాలలో నామినేషన్ల దాఖలు తమ తుది తీర్పుకు లోబడి ఉంటాయని సుప్రీంకోర్టు ప్రకటించిన నేపథ్యంలో.. ఆ మార్గదర్శకాలకు అనుకూలంగా ప్రభుత్వం నడుచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అధికార కాంగ్రెస్ పార్టీకి మొట్టికాయ లాంటిదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.