Rishabh Pant Made Pizza: ఇటీవల ఇంగ్లాండ్ సిరీస్ లో రిషబ్ పంత్ అదరగొట్టాడు. సెంచరీలతో మోత మోగించాడు. ఉన్నంతసేపు తన ఆడుతోంది టెస్ట్ అని మర్చిపోయి.. బీభత్సంగా బ్యాటింగ్ చేశాడు. మైదానంలో పరుగుల వరద పారించాడు. సిక్సర్లు, ఫోర్ లతో కదం తొక్కాడు.
నాలుగో టెస్టులో అతడు గాయపడ్డాడు.. ఐదవ టెస్టులో కూడా అతని పాదానికి గాయమైంది. దీంతో అతడు బ్యాటింగ్ చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఈ దశలో అతడికి మేనేజ్మెంట్ రెస్ట్ ఇచ్చింది. అతడి స్థానంలో జూరెల్ కీపింగ్ చేశాడు. నాలుగో టెస్టును రవీంద్ర జడేజా, సుందర్ వల్ల టీమిండియా డ్రా చేసుకుంది. ఐదవ టెస్టులో అద్భుతమైన పోరాటపటి మను చూపించి విజయం సాధించింది. సిరాజ్, ఆకాష్, ప్రసిద్ద్ కృష్ణ వల్ల భారత జట్టు చిరస్మరణీయ విజయం సాధించింది.
Also Read: ఇంగ్లాండ్ సిరీస్ లో రాణించినప్పటికీ వారిపై వేటు.. ఆసియా కప్ లో ఆడేది వీరే
ఐదో టెస్టులో గాయపడిన నేపథ్యంలో రిషబ్ పంత్ ఆసియా కప్ కు అందుబాటులో లేకుండా పోయాడు. ప్రస్తుతం అతడి పాదానికి గాయం కావడంతో చికిత్స తీసుకుంటున్నాడు. కాలికి గాయమైనప్పటికీ రిషబ్ పంత్ ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. పైగా తనకు నచ్చిన వ్యాపకాలతో సందడి చేస్తున్నాడు. రిషబ్ పంత్ నాన్ వెజ్ అంతగా తినడు. ఇందులో భాగంగానే అతడు వెజ్ పిజ్జా చేశాడు. దానికి సంబంధించిన వీడియోను పంచుకున్నాడు.” నేను మాంసాహారం తినను. ఇప్పుడు మీకోసం.. దెబ్బ తలిగిన నా కాలి కోసం వెజ్ ఫీజ్జా చేస్తాను.. ఇది తినే లాగా ఉంటుందా.. మరో విధంగా ఉంటుందా నాకు తెలియదు.. కాకపోతే దీని తయారీ నాకు కొత్త.. చూడాలి ఏం జరుగుతుందో అంటూ” రిషబ్ పంత్ వ్యాఖ్యానించాడు. అతడు చెప్పిన దానికంటే గొప్పగా ఆ వెజ్ ఫిజ్జా వచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో సందడి చేస్తోంది.
రిషబ్ పంత్ కు గాయాలు కావడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. సుదీర్ఘ కాలం మంచానికి పరిమితమయ్యాడు. ఆ తర్వాత కోలుకున్నాడు. ఆ తర్వాత ఐపీఎల్ లో ఢిల్లీ జట్టు తరఫున ఆడాడు. ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహించాడు. ఆ తర్వాత లక్నో జట్టుకు మారిపోయాడు. లక్నో జట్టుకు నాయకత్వం వహిస్తున్న అతడు.. ఈ సీజన్లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు.
Impasto, salsa, forno… and me. #RP17 pic.twitter.com/u1mf1FyvYa
— Rishabh Pant (@RishabhPant17) August 13, 2025