Tea Cafe Ad: ఒక ఉత్పత్తి వినియోగదారుల మనసును గెలుచుకోవాలంటే నాణ్యత ఉండాలి. దానికి తగ్గట్టుగానే ప్రచారం అద్భుతంగా ఉండాలి. అప్పుడే ఆ ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు బహుళ ప్రాచుర్యం పొందిన అనేక ఉత్పత్తులకు వాటి తయారీ సంస్థలు విశేషమైన ప్రచారం చేశాయి. అందువల్లే అవి ఈ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాయి. నేటి సోషల్ మీడియా కాలంలో ఒక ఉత్పత్తి గురించి ప్రచారం చేయాలంటే విభిన్నమైన విధానాన్ని ఎంచుకోవాలి. దానిని ప్రజల్లోకి అత్యంత గొప్పగా తీసుకెళ్లాలి. అప్పుడే ఆ ఉత్పత్తికి డిమాండ్ ఏర్పడుతుంది.
Also Read: ఏపీలో నామినేటెడ్ జాతర
ఉదాహరణకి హైదరాబాదులో నిలోఫర్ కేఫ్ ను తీసుకుంటే.. ఆ చాయ్ కి సంబంధించి యజమాని విభిన్నమైన ప్రచారం చేశారు. మార్కెట్లోకి సరికొత్తగా తీసుకెళ్లారు. ఫలితంగా తనకంటూ ఒక బ్రాండ్ సృష్టించుకున్నారు. హైదరాబాదులో గొప్ప గొప్ప కేఫ్ లు ఉన్నప్పటికీ.. బాబురావు అనే వ్యక్తి నిర్వహించే కేఫ్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రధాన కారణం దాని యజమాని అనుసరించిన ప్రచారమే. ఆ ప్రచారం వల్లే నిలోఫర్ కేఫ్ అద్భుతమైన గుర్తింపును తెచ్చుకుంది. నిలోఫర్ కేఫ్ యజమాని ప్రచారాన్ని చూసి స్ఫూర్తి పొందాడేమో.. ఓ వ్యక్తి తను ఏర్పాటు చేసిన కేఫ్ గురించి డిఫరెంట్ గా ప్రచారం చేశాడు.
దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆకాశం లో ఎగురుతున్న విమానం నుంచి అతను ఉపోద్ఘాతం మొదలుపెట్టాడు. చివరికి తన కేఫ్ లో లభించే టి, సమోసా వరకు తీసుకొచ్చాడు. వాస్తవానికి ఆకాశానికి బోడి గుండుకు లంకె పెట్టిన అతడు.. చివరికి అద్భుతమైన కంక్లూజన్ ఇచ్చాడు. ఇటీవల కాలంలో ఒక ఉత్పత్తి గురించి ఏ వ్యాపారి కూడా ఈ స్థాయిలో ప్రచారం చేయలేదు. ఆ వీడియో చూసిన వారంతా అతని క్రియేటివిటీ ని మెచ్చుకుంటున్నారు. ఇలా కూడా ఆలోచిస్తారా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.. నేటి కాలంలో ఒక ఉత్పత్తి ప్రజల మనసును గెలుచుకోవాలంటే డిఫరెంట్ గా ఉండాలి. ఆ డిఫరెన్స్ ను ఈ వ్యాపారి చూపించాడు. మొత్తానికి సక్సెస్ అయ్యాడు.
Last twist pic.twitter.com/iDEd71m2ZC
— Poley_Adiripoley (@poleyadiripoley) August 12, 2025